Prema Entha Madhuram  Serial Today Episode: ఆర్య ఐసీయూలో ఉంటాడు. బయట నీరజ్‌, అను, శారదాదేవి, మాన్షి, కేశవ బాధపడుతుంటారు. అజయ్‌, మీరా కలిసి ఏదో ప్లాన్‌ ప్రకారమే ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారని అను అంటుంది. కేశవ అవునని అంటాడు. ఇంతలో ఆజయ్‌, మీరా హాస్పిటల్‌కు వస్తారు. వారిని చూసిన నీరజ్‌ కోపంగా తిడతాడు. దీంతో అజయ్‌ కూల్‌గా వెయిట్‌ బ్రో  మన అన్నయ్యా ఐసీయూలో ఉన్నాడు. అంటూ పిల్లలను పలకరిస్తాడు అజయ్‌.


అజయ్‌: నమస్తే పెద్దమ్మా.. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? అను .. ఓ సారీ వదినమ్మా? ఎలా ఉన్నారు వదినమ్మ ఈ పరిస్థితుల్లో అడగాల్సిన ప్రశ్న కాదనుకుంటా


అంటూ ఐసీయూలోకి వెళ్లబోతుంటే కేశవ అడ్డుపడతాడు.


కేశవ: ఆర్యను డిస్టర్బ్‌ చేయోద్దని డాక్టర్స్‌ చెప్పారు.


అజయ్‌: డాక్టర్స్‌ చెప్పారా? లేక నేనేమైనా చేస్తానని అనుమానమా? మై డియర్‌ కేశవజెండే మా అన్నయ్యకు ఛీప్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ అని తెలుసు. అంతకన్నా ఫ్రెండ్‌ అని తెలుసు కానీ మరీ ఇంత సిన్సియర్‌ అనుకోలేదు. జస్ట్‌ అలా వెళ్లి బ్లెసింగ్స్‌ తీసుకుని ఇలా వచ్చేస్తాను.


అనగానే కేశవ లోపలికి వెళ్లడానికి పర్మిషన్‌ ఇస్తాడు. అజయ్‌ లోపలికి వెళ్తాడు. బయట మీరా కూడా అందరినీ పలకరిస్తుంది. ఎవ్వరూ కూడా పలకరు. లోపలికి వెళ్లిన అజయ్‌, ఆర్యను చూసి హ్యాపీగా ఫీలవుతాడు ఒకవేళ నువ్వు కానీ బతికితే నిన్ను నా కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తానని చెప్పి వెళ్లిపోతాడు.


అజయ్‌: పెద్దమ్మా ఛైర్మన్‌ అయ్యాక నీ బ్లెస్సింగ్స్‌ కోసం మళ్లీ వస్తాను.


శారదాదేవి: మంచిది బాబు. ఒక్క విషయం..  మీ నాన్న కూడా ఇలాగే మితిమీరిన తలపొగరుతో ప్రవర్తించేవారు. చివరికి ఏమైందో తెలుసుకదా? జాగ్రత్త


అజయ్‌: నేను మా నాన్నగారంత అమాయకుణ్ని కాదు పెద్దమ్మ. చైర్మన్ అయ్యాక మీకే తెలుస్తుంది.


అను: పగటి కలలు కనడం అంత మంచిది కాదు. ఆర్యవర్థన్‌ గారి స్థానాన్ని దక్కించుకోవాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు.


అజయ్‌: ఓవర్‌ కాన్ఫిడెంట్‌ గ్రేట్‌


అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అను వాళ్లు అందరూ బాధగా చూస్తుండిపోతారు.  తర్వాత మీరా, అజయ్‌ వర్ధన్‌ ఆఫీసులోకి వెళ్తారు. ఎంప్లాయిస్‌ను పలకరిస్తారు. ఎవ్వరూ కూడా రెస్పాండ్‌ కారు దీంతో అజయ్‌ త్వరలోనే నేను చైర్మన్‌ అయ్యాక అందరూ రెస్పాండ్‌ అవుతారు.  అని చెప్పి కాన్ఫరెన్స్‌ రూంలోకి వెళ్తారు. అదే విషయం ఒక ఎంప్లాయి కేశవకు ఫోన్‌ చేసి చెప్తాడు. దీతో కేశవ, నీరజ్‌ ఆఫీసుకు వెళ్తారు.  మరోవైపు ఆఫీసులో బోర్డు మెంబర్స్‌ మీటింగ్‌లో మీరా మాట్లాడుతుంది.


మీరా: ఆర్య చైర్మన్‌ పదవికి రిజైన్‌ చేశారు. కంపెనీలో 35 పర్సెంట్‌ షేర్స్‌ ఉన్న అజయ్‌వర్ధన్‌ చైర్మన్‌ కావాలనుకుంటున్నారు. కంపెనీని సమర్థవంతంగా నడపగలిగే సామర్ధ్యం ఇప్పుడు అజయ్‌ వర్థన్‌కే ఉంటుంది.  


అని మీరా  చెప్పడంతో బోర్డు మెంబర్స్‌ ఆలోచిస్తుంటారు. ఇంతలో అక్కడికి నీరజ్‌, కేశవ వస్తారు. మీరా, అజయ్‌లను నిలదీస్తారు. మా పర్మిషన్‌ లేకుండా మాఆఫీసులోకి ఎందుకొచ్చారని నీరజ్ నిలదీస్తాడు. దీంతో అజయ్‌ మా ఆఫీసు కాదు మన ఆఫీసు అని చెప్పడంతో నీరజ్‌  బోర్డు మెంబర్స్‌ ను మీరు ఎవరికి సపోర్టుగా ఉంటారని అడుగుతాడు. దీంతో బోర్డు మెంబర్స్‌ అందరూ  కూడా ఆర్యకే సపోర్ట్‌ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్స్ స్వీట్ సర్‌ప్రైజ్ - పాటే కాదు, స్టేజిపై ఎన్టీఆర్, చరణ్ స్టంట్స్‌ కూడా!