Brahmamudi Serial Today Episode: రాజ్‌ అంతరాత్మ వచ్చి రాజ్‌ను తిడుతుంది. మనసులో మాట కళావతితో చెప్పు అని ఫోర్స్‌ చేస్తుంది. అంత అందమైన కళావతిని చూస్తుంటే నీకేం అనిపించడం లేదా అంటూ గార్డెన్‌లో కావ్య, భాస్కర్‌, భామ్మ మాట్లాడుకుంటుంటే ఎందుకు దొంగచాటుగా చూస్తున్నావని అంతరాత్మ అడుగుతుంది. ఇప్పటి నుంచి ఎవ్వరినీ చూడను అంటూ లోపలికి రా అనగానే స్వరాజ్‌ అంతరాత్మ లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో భాస్కర్‌, కావ్య డోర్‌ దగ్గరకు వస్తారు.


కావ్య: ఏవండి..?


భాస్కర్‌: అన్నయ్యా..?


రాజ్‌: తమ్ముడన్నయ్యా.. రండి రండి రండి రా తమ్ముడన్నయ్యా.. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు ఈ ఇల్లు నీది ఈ గాలి ఎంత స్వేచ్చగా పీల్చుకుంటావో అలాగే ఈ ఇంట్లో ఉండొచ్చు..


కావ్య: ఏవండి ఏమైందండి మీకు


రాజ్‌: ఎక్కడో అమెరికాలో ఉన్న తమ్ముడన్నయ్యా నీకోసం వచ్చేస్తే.. మీ ఇద్దరికి ఏకాంతం కల్పించలేని పాపిస్టివాడిని అయ్యాను. ఏంటి అలా బిత్తరచూపులు చూస్తున్నారు. నేను నిజమే చేప్తున్నాను. అన్నట్టు మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు.


భాస్కర్‌: చాలు అన్నయ్యా.. చాలు గృహప్రవేశానికి పాలు పొంగిచినట్లు నీ మంచి తనం పొంగిపొర్లుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను.


కావ్య: ఏవండి ఇవాళ మా బావకు వాళ్ల కంపెనీ బ్రాంచ్‌లో మీటింగ్‌ ఏదో ఉందట. బావ సూట్స్‌ ఎక్కువ తెచ్చుకోలేదట.. మీకు బోలెడన్నీ సూట్స్‌ ఉన్నాయి. అందులో ఒకటి ఇస్తారేమోనని అడగడానికి వచ్చాను.


రాజ్‌: ఎంత మాటన్నావు కళావతి ఆ మాట అనడానికి నోరెలా వచ్చింది కళావతి. మీ బావకు సూట్‌ కావాలంటే నన్ను అడగాలా? ఏదైనా తీసుకునే హక్కు నా తమ్ముడన్నయ్యకు ఉంది.


అంటూ భాస్కర్‌ ను కప్‌బోర్డు దగ్గరకు తీసుకెళ్లి సూట్స్‌ బయటకు వేసి ఏది కావాలో తీసుకో అనగానే కావ్య, భాస్కర్‌ షాక్‌ అవుతారు. నీ మీటింగ్‌కు నీ బుజ్జిని కూడా తీసుకెళ్లు అని ఇద్దరిని బయటకు పంపించి అంతరాత్మను బయటకు పిలిచి చూశావా నేనేమైనా కుల్లుకున్నానా? అంటాడు. మరోవైపు అనామిక కాఫీ తీసుకుని కళ్యాణ్‌ దగ్గరకు వెళ్తూ ఇవాళ ఎలాగైనా కవిగారిని కూల్‌ చేయాలి. అమ్మ చెప్పినట్లు ఏదైనా తెగేదాకా లాగొద్దు అనుకుంటూ వెళ్లగానే కళ్యాణ్‌ అప్పుకు ఫోన్‌ చేసి  కలవాలని మాట్లాడుతుంటాడు. అది విన్న అనామిక కోపంగా కళ్యాణ్ ను తిడుతుంది.


అనామిక: ఎవరు ఫోన్‌


కళ్యాణ్‌: వినే ఉంటావు కదా మళ్లీ అడగడమెందుకు?


అనామిక: నీకోసం కష్టపడి కాఫీ చేసి ఇద్దామని తీసుకొస్తుంటే..? నువ్వు మాట్లాడింది వినిపించింది.


కళ్యాణ్‌: ఏ పనైనా కష్టంతో చేయకూడదు. ఇష్టంతో చేయాలి.


అనామిక: అందుకేనా దాన్ని ఇష్టంతో కలవడానికి వెళ్తున్నావు. ఇప్పుడు దాన్ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది.


అని అడగ్గానే కళ్యాణ్‌ ఇక్కడ నన్ను అర్థం చేసుకునేవాళ్లు ఎవరూ లేరు.  అనగానే పెళ్లాం ఉన్నా వేరే అమ్మాయిని కలుస్తున్నారంటే పోయేది నా పరువే.. అంటూ సీరియస్‌ అవుతుంది అనామిక. మరోవైపు అప్పును వాళ్ల అమ్మా నాన్నలు కూడా కలవొద్దని చెప్తారు. దీంతో మా ఇద్దరి మనస్సుల్లో తప్పుడు ఆలోచనలు లేనప్పుడు మేము ఇద్దరం కలవడంలో కూడా ఏం తప్పు లేదు అని అప్పు వెళ్లిపోతుంది. మరోవైపు ఇందిరాదేవి కాఫీ తాగుతు ఉంటుంది. పైనుంచి భాస్కర్‌, కావ్య డల్‌గా కిందకు వస్తుంటారు.


ఇందిరాదేవి: మిమ్మల్ని చూస్తుంటే అనుకున్నది సాధించుకొచ్చినట్లు కనిపిస్తున్నారు.


కావ్య: అవును బామ్మగారు. మీ మనవడు నా భార్య నా సొంతం, నా బట్టలు నా సొంతం అని అరిచారు.


ఇందిరాదేవి: అవును నా మనవడు అంలాంటి వాడే


అనగానే కావ్య, భాస్కర్‌ అక్కడ అంత సినిమా లేదు. అంటూ రాజ్‌ చెప్పిన మాటలు చెప్తారు. నేను మా బావ కలిసి వెళ్లడానికి కారు కూడా ఇచ్చారు. అని చెప్పగానే అయితే వాడు రివర్స్‌ లో వస్తున్నాడు. వాడు ఎలా వచ్చినా వాడి బండికి స్పీడు బ్రేకర్‌ నేను వేస్తాను. అంటూ బయటకు వెళ్తుంది ఇందిరాదేవి. మరోవైపు అనామిక కళ్యాణ్‌ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ధాన్యలక్ష్మీ వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో స్వప్నకు ఆస్థులు రాసిచ్చిన విషయం గుర్తు చేస్తుంది. తర్వాత కళ్యాణ్‌ గురించి బాధపడుతుంది. దీంతో మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా భర్తతో సర్ధుకుపోవాలి అని చెప్తుంది. అయితే మీ అబ్బాయి అప్పుతో మాట్లాడుతుంటే నేనెలా సర్ధుకుపోగలను అంటూ ధాన్యలక్ష్మీకి చెప్తుంది అనామిక. దీంతో ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతుంది.   మరోవైపు భాస్కర్‌, కావ్య బయటకు వెళ్తూ ఈ ట్విస్ట్‌ ఏంటో  అర్థం కావడం లేదని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: 'మా డాడీతో సినిమా చేయకూడదని అనుకుంటున్నాను' - ఆకాశ్‌ పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్