Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌ వాళ్లు అయోద్యపురం వెళ్లడంతో రాకేష్‌ కూడా అయోద్యపురం వెళ్లి నీలకంఠాన్ని కలుస్తాడు. శంకర్‌ కు ఎగనెస్ట్‌ గా ఏదైనా చేయమని అడుగుతాడు. నాకేంటి లాభం అని నీలకంఠ అడిగితే నాకు హెల్ప్‌ చేస్తే నీ పగ కూడా తీరుతుంది అని రాకేష్‌ చెప్పగానే.. పగ తీరితే హాయిగా ఉంటుంది కానీ పర్స్‌ నిండితే ఇంకా హాయిగా ఉంటుంది అని నీలకంఠం అడగ్గానే.. రాకేష్‌ డబ్బులు తీసి నీలకంఠానికి ఇస్తాడు.


కోటి: ఏవండి గుంటడు మీ నాడీ పట్టేశాడండీ బాబు..


నీలకంఠం: చురుకైనోడివే.. ఇప్పుడు చెప్పు నీకు ఏ హెల్ప్‌ కావాలి.. చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను.


రాకేష్‌: నీ ఇంట్లో షెల్టర్‌ కావాలి. నీ ఇంట్లో ఉండి నీ తోనే కలిసి వాళ్లను ఈ ఊర్లోంచి వెళ్లగొడతాను.


కోటి: ఏవండి డబ్బుతో కొట్టారు కదా..? ఇక నుంచి ఆ దిక్కుమాలిన ప్లానింగులన్నీ.. మా ఆయ్యగారు ఏసుకుంటారులెండి. మీరేం కంగారు పడకండి..


నీలకంఠం: మరే ఇదిగే హ్యాపీగా ఇక్కడే ఉండు. కలిసే పగ తీర్చుకుందాం..


అని నీలకంఠం చెప్పగానే.. రాకేష్‌ హ్యాపీగా ఫీలవుతుంటాడు. మరోవైపు శంకర్‌, గౌరి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటారు. జెండే వాళ్లు క్యారమ్స్‌ ఆడుతుంటారు. ఇంకోవైపు నుంచి రవి, అకి కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు. అందరినీ గమనిస్తున్న యాదగిరి హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఒక దగ్గర కూర్చున్న రవి ఇరిటేటింగ్‌ గా ఉంటాడు.


అకి : ఏమైంది రవి..?


రవి: నాకు కొంచెం వాటర్‌ కావాలి.


అకి: తీసుకో..


రవి: వద్దంటే నైట్‌ తీసుకెళ్లావు..


అకి: క్లైమేట్‌ బాగుంది కదా రవి..
రవి: ఏముంది క్లైమేట్‌ బాగుండటానికి..


అకి: ఇష్టంగా చూస్తేనే కదా క్లైమేట్ బాగుందో లేదో తెలుసుకోవడానికి..


రవి: నాకు ఏదీ అర్తం చేసుకోవాలని లేదు..


అకి: నువ్వు కూడా నాకు అర్థం కావడం లేదు రవి..


రవి: నా పరిస్థితి ఏంటో నాకే అర్తం కావడం లేదు. నీకేం అర్థం అవుతుంది.


యాదగిరి వచ్చి కోపంగా చూస్తాడు. మళ్లీ అందరినీ చూస్తూ కూల్‌ అవుతాడు.


రవి: ఏంటి నాన్నా.. ఇక్కడి దాకా వచ్చావు.. నన్ను కొపంగా చూశావు మళ్లీ అటు చూస్తున్నావు. ఏంటి.?


యాదగిరి: అనుబంధాలు, అప్యాయతలు అంటే ఏంటో చూస్తున్నాను. ఒక్కసారి వాళ్లను గమనించండి. గౌరి మేడంకు తన గత జన్మ గుర్తుకొచ్చిన తను కొటీశ్వరురాలిగా కాకుండా సార్‌ ప్రేమ కోసం తపిస్తున్నారు. అకి, అభయ్‌ లు తన కన్నబిడ్డలు అని తెలియకపోయినా.. సాటి మనుషులుగా వర్ధన్‌ కుటుంబం కోసం ఒక రకంగా తన బిడ్డల కోసం ఆయనే సైనికుడై పరిస్థితులతో పోరాడుతున్నారు. ఆర్య సార్‌. ఇక జెండే సార్‌ గురించి ఏం చెప్పాలి.. తన స్నేహితుడి కోసం బతుకుతున్నాడు. మేడంకు సార్‌కు తమ్ముళ్లు అయినా కూడా కలిసి ఉండటంలోని సంతోషాన్ని కళ్ల ముందు చూపిస్తున్నారు. వాళ్లందరికీ ఏ సమస్యాలు లేవని కాదు.. కానీ ఏ సమస్య వచ్చినా ఒకరికి ఒకరు తోడుంటారని నమ్మకం. అభి బాబును చూడండి తన అనుకుంటే చాలు తన కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ వర్థన్‌ కుటుంబాన్ని చెడగొట్టడానికి విషపు చుక్కలు ఎదురుచూస్తున్నాయి.


   అంటూ యాదగిరి రవికి హితబోద చేస్తాడు.  తర్వాత అయోద్యపురంలో ముగ్గుల పోటీ జరగుతుంది. స్టేజీ మీద కూర్చున్న నీలకంఠం  ఈ ఊరిలో నాకన్నా తోపు ఎవరున్నారు విజేతలను నేనే ప్రకటించి బహుమతులు ఇస్తాను అంటాడు. ఇంతలో అక్కడ ఉన్నవాళ్లంతా వర్ధన్‌ ఫ్యామిలీ ఉందని చెప్పడంతో శంకర్‌, జెండే వాళ్లు వస్తుంటారు. ఇంతలో నీలకంఠం ఈ బహుమతులు నేను కాదు నాకు బాగా కావాల్సిన మనిషి చేత ఇప్పిస్తానని చెప్తాడు. ఇంతోల రాకేష్‌ వస్తాడు. రాకేష్‌ను చూసిన శంకర్‌, జెండే షాక్‌ అవుతారు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


   


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!