Prema Entha Madhuram Serial Today Episode: శంకర్ చాంబర్‌లోంచి కొట్టేసిన టెండర్ కోట్ ను చిన్నోడు, పెద్దొడు కలిసి వెళ్లి రాకేష్ ఇస్తారు. అది చూసిన రాకేష్ హ్యాపీగా ఫీలవుతూ..ఇద్దరినీ మెచ్చుకుంటాడు. మేము లీక్ చేసిన విషయం ఎవ్వరికీ తెలియదు కదా బ్రదర్ అని అడుగుతారు. మీరు తీసుకొచ్చినప్పుడు ఎవ్వరూ చూడలేదు కదా..? అంటే చూడలేదని చెప్తారు.. ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదని చెప్తాడు రాకేష్. పొరపాటున మామీద ఎవరికైనా డౌట్ వస్తే మీరే మమ్మల్ని సేవ్ చేయాలి అని చిన్నోడు అడగ్గానే.. సరే అంటాడు. ఇంతలో సీసీటీవీ చూసి చిన్నోడు భయపడుతుంటాడు. అదే టైంలో క్యాబిన్‌లోకి వెళ్లిన శంకర్ క్యాబిన్ చిందరవందరగా ఉన్నది చూసి అనుమానంగా అటూ ఇటూ చూస్తుంటాడు. ఇంతలో శంకర్‌కు సీసీటీవీ గుర్తుకు వచ్చి క్యాబిన్ ఉంచి బయటకు వస్తాడు.
శంకర్: సెక్యూరిటీ.. సెక్యూరిటీ.. ఎఫ్ఎం..
ఎఫ్‌ఎం: సార్ వస్తున్నాను.. సార్ చెప్పండి.
శంకర్: ఇదిగో నా క్యాబిన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ కావాలి. అర్జెంటుగా అది ఎక్కడ ఉంటుందో కనుక్కున అది తీసుకొచ్చి ఇవ్వు.
జెండే: ఏమైంది శంకర్ ఎందుకు నీ చాంబర్ ఫుటేజీ అడుగుతున్నావు.
శంకర్: ఏం లేదు జెండే సార్ నేను నా క్యాబిన్‌లో లేనప్పుడు ఎవరో నా క్యాబిన్‌లోకి వెళ్లినట్టు డౌటుగా ఉంది. పైగా డెస్క్ ఓపెన్ చేసి ఉంది. అందుకే డౌట్ వచ్చి సీసీ టీవీ ఫుటేజీ తీసుకురమ్మని చెప్తున్నాను.
జెండే: ఓ అదా.. ఇందాకా ఓ ఫైల్ కోసం నీ చాంబర్ కోసం నేనే వచ్చాను.
శంకర్: అవునా.. ఆ డెస్క్ ఓపెన్ చేసింది ఫైల్స్ అన్నీ మార్చేసింది మీరేనా..?
జెండే: ఫైల్స్ అయితే చెక్ చేస్తూ అటూ ఇటూ మార్చాను..
శంకర్: సరే లేండి మీరు వచ్చి వెళ్తే పర్వాలేదు.
దూరం నుంచి శంకర్ వాళ్ల మాటలు వింటున్న చిన్నొడు, పెద్దొడు, రాకేస్ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో నారాయణ వచ్చి ఆ టెండర్ కోట్ ఇస్తే టెండర్ ఆఫీసుకు వెళ్లి సబ్ మీట్ చేస్తాను. అనగానే శంకర్, జెండేను లోపలికి తీసుకెళ్లి టెండర్ కోట్ ఇస్తాడు. మరోవైపు యాదగిరి ఏదో రాస్తుంటే జ్యోతి వచ్చి వంట ఏం చేయాలని అడుగుతుంది. ఇంతలో అకి, రవి వస్తారు.
యాదగిరి: అకి ఈ టైంలో నువ్వు ఎందుకు వచ్చావు.
అకి: రవిని డ్రాప్ చేద్దామని వచ్చాను.
యాదరిగి: ఏరా బస్సులోనో ఆటోలోనో రాలేకపోతున్నావా.. కారే కావాలా..? నీకు
అకి: రవిని ఎందుకు అనవసరంగా కోప్పడతావు మామయ్య.. రవి రానని చెప్పాడు. నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను.
యాదగిరి: అమ్మా అకి జరిగినవి.. జరగుతున్నవి అన్నీ నీకు తెలుసు.. నువ్వు రవికి దూరంగా ఉండటమే మంచిది. అర్థం చేసుకో తల్లి.
అకి: అర్థం చేసుకోవాల్సింది మీరు మామయ్య.. మీరు ఓపెన్ అయ్యారు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నాకు రవి అంటే ఇష్టం తనను నేను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మామయ్య.
రవి: అకి ఏం మాట్లాడుతున్నావు. నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడకు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను నిన్ను కేవలం ఒక ఫ్రెండుగానే చూస్తున్నాను.
అకి: అబద్దం చెప్పకు రవి.. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. ఆ విషయం నీకు అర్తం అయిందో లేదో నాకు తెలియదు కానీ నీ చూపులో నీ కేరింగ్ లో నాకు అర్థం అయింది. ఇప్పుడే ఇంట్లో నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేస్తాను. ఈ విషయం ఇవాళే తేల్చేస్తాను.
అని అకి వెళ్లిపోతుంది. యాదగిరి వద్దని వారిస్తాడు. రవిని కోపంగా చూస్తుంటాడు. దీంతో రవి అమ్మ మీద ఒట్టు నాన్న నాకేం తెలియదు అంటాడు. అయినా వినకుండా యాదగిరి రవిని తిడతాడు. ఇంకా నేనెన్ని మాటలు పడాలో ఏమో అంటూ బాధపడతాడు. మరోవైపు లేటుగా ఇంటికి వచ్చిన అకిని అభయ్ కోపంగా ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతాడు. రవిని డ్రాప్ చేసి వస్తున్నాను అని అకి చెప్పగానే అభయ్ కోపంగా అకిని కొట్టబోతే గౌరి అడ్డుపడుతుంది. ఆడవాళ్ల మీద అది తోబుట్టువు మీద చెయ్యి ఎత్తడం వర్ధన్ కుటుంబం సంస్కారం కాదు అని చెప్తుంది. అయితే వెంటనే అకికి రాకేష్‌తో పెళ్లి చేస్తాను అంటాడు అభయ్. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!