Prema Entha Madhuram  Serial Today Episode:   శంకర్‌, గౌరిలను చూసిన జెండే వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించి మర్యాదగా కూర్చోబెట్టి.. ఎందుకు వచ్చారని అడుగుతాడు. దీంతో చెక్‌ గురించి చెప్తారు. జెండే సరేనని అకిని పిలుస్తానని లోపలికి వెళ్తుంటే యాదగిరి ఫోన్‌ చేసి గౌరి, శంకర్‌ లు వచ్చారని చెప్పగానే ఇప్పుడే వచ్చారని ఏం జరిగినా అంతా మంచికోసమేనని ఫోన్‌ పెట్టేస్తాడు. అకి రూంలోకి వెళ్లి నీ కోసం మీ అమ్మా నాన్న వచ్చారని జెండె చెప్పగానే అకి హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే బయటకు పరుగెత్తుకొస్తుంది. హాల్‌‌ లో మాట్లాడుతూ ఉన్న గౌరి, శంకర్‌ లను చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది.


అకి: ఫ్రెండ్‌ అన్నయ్యా రాకేష్‌ ఇంట్లోనే ఉన్నారు కదా? ఎలా మరి


జెండే: నువ్వు వాళ్లను కలపడానికి కానీ.. కలవకుండా ఉండటానికి కానీ ఎలాంటి ప్రయత్నం చేయకు అకి. అది డెస్టినీకి వదిలేయ్‌. ఇప్పుడైతే నువ్వు వాళ్లతో మాట్లాడు.


శంకర్‌: హలో అమ్మా..


గౌరి: హాయ్‌..


అకి: మీరెందుకు నిలబడ్డారు నో ఫార్మాలిటీస్‌.. కూర్చోండి.


గౌరి: నిన్న మీరు ఇంటికి వచ్చిన్నప్పుడు..


అకి: ఫ్లీజ్‌.. మీరు నన్ను మీరు అని పిలవకండి..


గౌరి: అకి.. నువ్వొచ్చిన్నప్పుడు కాస్త గొడవ గొడవగా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేదు.


శంకర్‌: అసలు  ఆ గొడవ కూడా ఈవిడ వల్లే జరిగింది అకి..


 అంటూ ఇద్దరూ అకి అని పిలవడంతో అకి తన్మయత్వంతో పులకించిపోతుంది. వాళ్లిద్దరూ మాట్లాడుతుంటే అకి మాత్రం వాళ్లిద్దరి మధ్య కూర్చుని మాట్లాడుతున్నట్టు మిమ్మల్ని చాలా మిస్సయ్యాను అని చెప్పినట్టు కలగంటుంది. ఇంతలో గౌరి శంకర్‌ చెక్కు గురించి చెప్పగానే సరే ఇస్తానని అకి చెప్పగానే గౌరి మీ ఇల్లు కూడా చాలా బాగుంది అంటుంది. అయితే ఇల్లు చూద్దాం రండి అని అకి ఇల్లు చూపిస్తుంది.


    డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్లగానే శంకర్‌ అచ్చు ఆర్యవర్ధన్‌‌ లా మారిపోతాడు. గౌరి అనులా మాట్లాడుతుంది. దీంతో జెండే, అకి షాక్‌ అవుతారు. ఇంతలో గౌరి, శంకర్‌ మామూలుగా మారిపోయి అకిని చెక్‌ త్వరగా ఇవ్వమని అడుగుతారు. అకి సరేనని చెక్‌ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. ఇంతలో అభయ్‌ కిందకు వస్తుంటాడు. జెండే రా అభయ్‌ గౌరి, శంకర్‌‌లు వచ్చారని చెప్పగానే అభయ్‌ వాళ్లను చూడకుండానే పైకి వెళ్లిపోతాడు.


రాకేష్‌: అభయ్‌ నేను షట్‌ డౌన్‌ చేసి వస్తానని చెప్పాను కదా మళ్లీ పైకి ఎందుకు వచ్చావు.


అభయ్‌: నేను కిందకు వెళ్లే సరికి హాల్‌లో గౌరి, శంకర్‌ లు ఉన్నారు. వాళ్లను కలవడం ఇష్టం లేక నేను వచ్చేశాను.


రాకేష్‌: గౌరి, శంకర్‌ వచ్చారా? వాళ్లెవరో వెంటనే చూడాలి. ( అని మనసులో అనుకుంటాడు) అయితే వెళ్లి కలుద్దాం పద అభయ్‌. అలా వచ్చేస్తే ఏం బాగుంటుంది.


అభయ్‌: నో.. అలాంటి చీటర్స్‌‌ ను  కలవడం నాకు ఇష్టం లేదు.


రాకేష్‌: పోనీ నేనన్నా ఒకసారి కలిసి వస్తాను


అభయ్‌: నో రాకేష్‌ నువ్వు అలాంటి చీటర్స్‌ ను కలవడం నాకు ఇష్టం లేదు.


   అని మాట్లాడుకుంటుంటే అక్కడికి జెండే వెళ్తాడు. ఇంతలో అకి చెక్‌ తీసుకుని వస్తుంది. చెక్‌ గౌరి, శంకర్‌ లకు ఇచ్చి ఎందుకు డల్‌ గా ఉన్నారని అడుగుతుంది. మీ అన్నయ్య వచ్చి మమ్మల్ని చూడకుండానే వెళ్లిపోయాడు. అనగానే అకి డిసప్పాయింట్‌ అవుతుంది.  మరోవైపు అభయ్‌ తాను వాళ్లను చూడనని జెండేకు చెప్పి వాళ్లను ఇక్కడి నుంచి పంపిచేయ్‌ అని చెప్తాడు. జెండే కిందకు వచ్చి అభయ్‌‌ కు ఏదో ఇంపార్టెంట్‌ కాల్‌ వచ్చి అని చెప్తుంటే సరేలేండి జెండే గారు అంటూ గౌరి, శంకర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో కిందకు వచ్చిన అభయ్‌ కోపంగా వాళ్లను పదేపదే నమ్మకు అని చెప్తాడు. అయితే నిజం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు అని అకి, అభయ్‌కి చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తే రెమ్యూనరేషన్ ఇచ్చేస్తానన్న హరీష్ శంకర్ - రూమర్లకు 'మిస్టర్ బచ్చన్' నిర్మాత చెక్!