Podharillu Serial Today Episode: ప్రతాప్‌ ఆదికి ఫోన్‌ చేసి తాత్కాలికంగా కొన్ని రోజులు కారు నడిపేందుకు  డ్రైవర్‌ను పంపిస్తున్నానని చెబుతాడు. ఇప్పుడే ఆ అబ్బాయి ఫోన్ చేశాడని.. ఇంటి ముందే ఉన్నాడని వివరిస్తాడు. ఇంతలోనే  చక్రి తలుపు తీసుకుని లోపలికి అడుగుపెడతాడు. దీంతో భూషణ్‌కు  చిర్రెత్తికొస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావని  గొడవపడతాడు. సార్‌ నీను వచ్చింది మీతో గొడవపడటానికి కాదని....మీకు డ్రైవర్‌ కావాలంటే వచ్చానని చెబుతాడు. ఇలాంటి ఆవారా గాడిని అంకుల్‌ ఎందుకు  పంపించారని ఆదిపైనా  భూషణ్‌ మండిపడితాడు. దీంతో  ఆది తన తండ్రి ప్రతాప్‌కు ఫోన్ చేసి అడుగుతాడు.                            భూషణ్‌ ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ  అమ్మాయి కూడా ఇక్కడే ఉండి ఉంటుందని చక్రి ఆనందపడుతుంటాడు. మహా కోసం వెతుకుతుంటాడు. ఇంతలో మహా మేడపై నుంచి కిందకు దిగుతుంది. వీడు మాత్రం వద్దేవదని భూషణ్‌ అంటాడు.నాన్న చెప్పారు ఇతను చాలా నమ్మకస్తుడని ఆది భూషణ్‌కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. మహా కోసం ఏం చేసైనా ఇక్కడే ఉండాలని చక్రి అనుకుంటాడు. దీంతో నిన్న జరిగిన గొడవకు సారీ చెప్పడంతో భూషణ్ కొంత తగ్గుతాడు. దీంతో డ్రైవర్‌గా ఉండటానికి ఓకే అంటాడు. దీంతో చక్రి బయటకు వెళ్లిపోగానే....ఇంట్లోవాళ్లందరూ టిఫిన్ చేస్తారు. అక్కడ కూడా భూషణ్  మహాను అవమానిస్తూనే ఉంటాడు.డ్రైవర్‌ రాదు.టేబుల్‌ మేనస్‌  తెలియదంటూ చిన్నబుచ్చుకునేలా చేస్తాడు. దీంతో మహాకు భూషణ్‌పై  కోపం వస్తూనే ఉంటుంది.

Continues below advertisement

   ఇంతలో మాధవ్‌ ఇంటిని చూడటానికి ఆడపెళ్లివారు వస్తుండటంతో తమ్ముళ్లు కాస్త హడావుడి చేస్తుంటారు. ఇంతలో పెళ్లివారు కారులో వచ్చి ఇల్లు, ఆ వాతావరణం చూసి హడలిపోతారు. స్థలం మాత్రం విశాలంగా ఉన్నా...ఇల్లు ఎందుకు ఇలా ఉందని అడుగుతారు. ఇంట్లోఆడవాళ్లు లేని లోటు కనిపిస్తోందని అంటారు. దీంతో నారాయణ బాధపడుతూ  నా భార్య చనిపోయిన దగ్గర నుంచి మేం ఒంటరిగానే ఉంటున్నామని...అందుకే అబ్బాయికి పెళ్లి చేస్తున్నామని చెబుతాడు. ఇంట్లో వంట మొత్తం మా అబ్బాయే చేస్తాడని చెబుతాడు. ఇంటిని రిపేర్‌ చేయించరా  అని ఆడపెళ్లివారు అడిగితే....పెళ్లి ఫిక్స్‌ అయితే వెంటనే చేయిస్తామని నారాయణ చెబుతాడు. ఈ పెళ్లిచూపుల తంతు మొత్తం గాయత్రి చాటుగా ఉండి చూస్తూనే ఉంటుంది. ఎలాగైనా ఈ పెళ్లిచూపులు చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటుంది. గాయత్రిని చూసిన కేశవ్‌ హడలిపోతాడు.ఇప్పుడు దీన్నిఇక్కడ వీళ్లు చూశారంటే....పెళ్లిచూపులు ఆగిపోతాయని భయపడతాడు. చిన్నాను పంపించి వెంటనే ఆ గాయత్రిని ఇక్కడి నుంచి తరిమేయమని చెబుతాడు. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారని చెప్పి వెళ్లిపోమ్మంటాడు.వాళ్లు చూస్తే ఆరాతీస్తారని హెచ్చరిస్తాడు. చిన్నప్పుడు నిన్ను ఎంతో ప్రేమగా పెంచాను రా...నన్ను కాదని మీ అన్నకు వేరే ఎవరితోనో  పెళ్లి ఎలా చేయిస్తున్నావు రా అని నిలదీస్తుంది. మరి ఏం చేయమంటావ్‌...నువ్వు ధైర్యంగా ఇంట్లో నుంచి రావు...మరి ఇంకొకరిని కూడా  పెళ్లి చేసుకోనివ్వవా అని మండిపడతాడు. నువ్వుఇక్కడి నుంచి వెళ్లకపోతే కేశవ్‌ను పిలుస్తానని చెప్పడంతో  గాయత్రి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Continues below advertisement