గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 18 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 18 Episode

Continues below advertisement

ఎట్టకేలకు సత్యం కుటుంబంలో బంగారం చిచ్చుకి ఫుల్ స్టాప్ పడిందకి. బంగారం బదులు మనోజ్ సగం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ డబ్బులతో కారు కొన్నాడు బాలు. తల్లి తండ్రి మాట్లాడుకోవడం లేదని బామ్మకి కబురుపెట్టి తీసుకొచ్చి మరీ అమ్మా నాన్న మధ్య దూరం చెరిపేశాడు బాలు. తను కొన్న కొత్తకారులో గుడికి తీసుకెళ్లి ఇద్దరూ మళ్లీ సంతోషంగా కలిసివచ్చేలా చేశాడు. దీంతో సత్యం కుటుంబంలో గొడవ సర్దుమణిగినట్టే.  

సంజూ ఏదో ఫంక్షన్ కి బయలుదేరుతాడు..నువ్వు ఒక్కడివే బ్యాచిలర్ పార్టీకి వెళుతున్నట్టు వెళుతున్నావ్ మౌనికను తీసుకెళ్లు అంటుంది తల్లి. దానికి ఇంట్లో చోటివ్వడమే ఎక్కువ..నాతోపాటూ పార్టీలకు, ఫంక్షన్లకు తీసుకెళ్తే నా స్టేటస్ ఏమవుతుంది..ఇంట్లో పని చేయించుకో అంటాడు. తనను పనిమనిషిలా చూస్తున్నావ్..వాళ్లు మౌనికను కూడా తీసుకురమ్మని చెప్పారు..నువ్వు దాన్ని తీసుకెళ్లకపోతే ఇద్దరి మధ్యా ఏదో ఉంది అనుకుంటారు అంటుంది తల్లి. సరే అని అయిష్టంగా ఒప్పుకుంటాడు సంజయ్. వాళ్లింటికి వెళ్లినట్టు పాత చీరతో కాదు..నా స్టేటస్ కి తగ్గట్టుగా కాస్ట్లీ చీర కట్టుకుని రావాలి అంటాడు. ఏడుపుగొట్టు మొహంతో కనిపించకు అని మౌనిక పుట్టింటివారిని కంపేర్ చేసి సూటిపోటిమాటలంటాడు. నీలాంటిదాన్ని తీసుకురావాలి అనుకోను..కానీ తప్పలేదని ఏడిపిస్తాడు. మౌనిక అక్కడే నిల్చుని ఏడుస్తుంటుంది ..సంజయ్ వెళ్లిపోతాడు. అప్పుడే ట్రిప్పు కోసం అటుగా వచ్చిన బాలు మౌనికను చూస్తాడు.

Continues below advertisement

బాలుని చూసిన మౌనిక...తనతో మాట్లాడొద్దని సంజయ్ ఇచ్చిన వార్నింగ్ సంగతి గుర్తుచేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే సమయంలో పర్స్ పడేస్తుంది. ఆపర్స్ తీసుకుని మౌనికా అని పిలుస్తూ వెనుకే వెళతాడు బాలు. అంతా ఆ పక్కనే ఉన్న సంజయ్ గమనిస్తుంచాడు..సంజూ గమనించడం మౌనిక కూడా చూస్తుంది. ఏంటమ్మా మౌనిక పిలుస్తుంటే వచ్చేశావ్ అని బాలు అడుగుతాడు..ఇంతలో ఓ సెక్యూరిటీ వచ్చి నువ్వు ఎవరు? నేరుగా లోపలకు వచ్చేశావేంటి? అంటాడు. ఈమె నా చెల్లెలు అందుకే వచ్చాను అంటాడు బాలు. ఈయనెవరో నాకు తెలియదు బయటకు పంపించేయండి అని  పెద్ద షాకిస్తుంది మౌనిక. ఆమె ఏమందో అర్థమయ్యేలోగానే అక్కడున్న సెక్యూరిటీ బాలుని బయటకు గంటేస్తాడు. అసలు ఏం జరుగుతోందో? మౌనిక ఎందుకలా ప్రవర్తిస్తుందో బాలుకి అర్థంకాదు. ఇదంతా చెట్టుచాటు నుంచి గమనించిన సంజయ్ మాత్రం పైశాచిక ఆనందానని పొందుతాడు. దీనికి నేనంటే భయం ఉంది, నా మాట దాటదు అనుకుంటాడు

శ్రుతి ఇంకా పురిటినొప్పులకు డబ్బింగ్ చెప్పిన విషయమే గుర్తుచేసుకుని డిస్ట్రబ్ అవుతుంది. ఇంతలో రవి వచ్చి హగ్ చేసుకోగానే లాగిపెట్టి కొడుతుంది. ఎందుకు ఇలా కోపంగా ఉన్నావ్ అంటాడు. నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటుంది శ్రుతి. నువ్వు ఈ మాత్రందానికే బాధపడుతున్నావ్..ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ టైమ్ లో వచ్చే నొప్పి ఎలా ఉంటుందో తెలుసా అంటుంది. నీ తలకు ఏమైనా దెబ్బతగిలిందా అంటాడు. ఇప్పట్లో పిల్లల్ని కనొద్దు అంటుంది శ్రుతి. డబ్బింగ్ చెప్పిన విషయం చెప్పి బాధపడుతుంది శ్రుతి. పెయిన్ నేను అనుభవించలేను కదా అంటాడు రవి. నాకు ఇప్పట్లో పిల్లలు వద్దు అనేస్తుంది. నువ్వు ఎలాగూ చెప్పావ్ కదా రెండేళ్లు ఆగుదాం అని ...అలాగే ఆగుదాంలే అంటాడు. నేను ఎప్పటికీ కనను అంటుంది. పిల్లల్ని కనడం కామన్ థింగ్ అంటాడు రవి. నేను మరో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలా అంటాడు రవి. సరోగసికి వెళదాం..నేను నొప్పులు పడలేను అంటుంది. షాక్ అవుతాడు రవి

అప్పటివరకూ కారుకొనుక్కున్న ఆనందంలో ఉన్న బాలు బాధగా ఇంటికి చేరుకుంటాడు. మౌనిక ఎందుకు అలా చేసిందో అర్థంకాక అదే విషయాన్ని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మీనావచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. మౌనిక కనిపించింది..నేను పలకరించేందుకు వెళితే ఈయనెవరో నాకు తెలియదు అనేసింది? ఆ సంజూగాడు ఏమైనా బెదిరింది ఉంటాడా? అంటాడు. పరిస్థితి మొత్తం మీనాకు అర్థమవుతుంది కానీ బయటపడితే బాలు వెళ్లి సంజూని చంపేస్తాడని ఆగిపోతుంది. ఏదో చికాకులో ఉండి ఉంటుందిలెండి..వదిలేయండి అనేస్తుంది మీనా. బాలులో మాత్రం సందేహం అలానే ఉండిపోతుంది

'అఖండ 2' లో అష్టవామన (8 మంది బాల బ్రాహ్మణులు) బలి గురించి పురాణాల్లో ఉందా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అఖండ 2లో బాలకృష్ణ శక్తి వెనుకున్న లాజిక్ ఇదేనా! రామాయణంలో బల, అతిబల విద్యల ప్రాముఖ్యత ఏంటి?