Ammayi garu Serial Today Episode: రాజు ఎప్పుడూ తనను తన అమ్మాయిగారిలా చూసుకోలేదని కోమలి సూర్యవద్ద ఏడుస్తూ నాటకం ఆడుతుంది. దీనికి రుక్మిణియే కారణమని చెబుతుంది. అసలు రాజుకు నా మీద ప్రేమే లేదని...నేను తనని మోసం చేయడానికి వచ్చినట్లు చూస్తున్నాడని చెబుతుంది. ఆస్పత్రికి తీసుకెళ్లమని రాజును అడిగితే...ఈ రుక్మిణి అడ్డుపడి నానా మాటలు అంటోందని చెబుతుంది. తన స్థానాన్ని నేను ఎక్కడ లాక్కుంటానోనని తనకి భయమని...అందుకే మెల్లగా నా రాజును నా నుంచి దూరం చేసిందని అంటుంది. నా బిడ్డను కూడా నా నుంచి దూరం చేసిందని ఏడుస్తుంది. రాజు భార్య స్థానంలో రుక్మిణి ఉన్నంత వరకు రాజు నన్ను పట్టించుకోడని కోమలి చెబుతుంది. ఇలాంటి బతుకు నేను బతకలేకపోతున్నానని అంటుంది. ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదని రాజును అడిగితే నన్నే తిడుతున్నాడని అంటుంది.ఇంతలో రాజు కల్పించుకుని ఏదో చెప్పబోతుండగా...సూర్య అతన్ని ఆపుతాడు. నా రాజును నాకు ఇవ్వు నాన్నా అంటూ కోమలి నాటకాన్ని రక్తికట్టిస్తుంది. ఈ రుక్మిణీని మా జీవితాల నుంచి బయటకు పంపించమని వేడుకుంటుంది. నా రాజుకు.ఈరుక్మిణీకి విడాకులు ఇప్పించమని కోరుతుంది. ఆ మాటలకు రూపతోపాటు అక్కడ ఉన్నవాళ్లంతా షాక్‌కు గురవుతారు. మీరు కూడా నాకు న్యాయం చేయకపోతే చచ్చిపోతానని బెదిరించడంతో నీ జీవితాన్ని నేనే నిలబెడతానంటూ సూర్య మాటిస్తాడు. రూప చనిపోయిందనుకునే రాజును నీకు ఇచ్చి పెళ్లి జరిపించానని...కానీ న్యాయంగా నీకన్నా ముందే రూప రాజును పెళ్లి చేసుకుందని సూర్య అంటాడు.అక్కడ మూడు జీవితాలు ఉన్నాయని...ఇక్కడ నీ ఒక్క జీవితమే ఉంది కాబట్టి నువ్వు రాజును విడిచి వెళ్లిపోవాలని అంటాడు. నీ జీవితాన్ని నేను నిలబెడతానని అంటాడు. రాజుకు విడాకులు ఇవ్వాలని కోరతాడు.తనమీద ఒట్టు వేయించుకుంటాడు. ఇంతలోరాజు అడ్డుతగలగా...అతన్ని ఆపుతాడు. నేనే నీతో రుక్మిణీని పెళ్లికి ఒప్పించానని...ఇప్పుడు అలాగే విడాకులు కూడా అడుగుతున్నానని అంటాడు. నీ లైఫ్‌లోకి ముందు వచ్చింది రూపనేనని...దాని తర్వాతే ఎవరైనా అంటాడు.రుక్మిణిని పెళ్లిచేసుకోమన్నప్పుడు ఎలాగైతే మాట్లాడకుండా తాళి కట్టావో...ఇప్పుడు కూడా అలాగే విడాకులు ఇవ్వమని ఆదేశిస్తాడు. నువ్వు ఎదురు మాట్లాడితే నామీద ఒట్టే అంటాడు. ఇంతలో విరూపాక్షి కల్పించుకుని రుక్మిణీకి ఎవరు న్యాయం చేస్తారని నిలదీస్తుంది.రాజుతో నాకు పెళ్లి చేయండని రుక్మిణీ నిన్ను కోరలేదు. పాతకేళ్లుగా తన తండ్రి తనని ఏం అడగలేదని...నువ్వు అడిగిన వెంటనే రాజుతో తాళి కట్టించుకుంది. రాజును భర్తగా అంగీకరించి జీవితాన్ని ఊహించుకుంది. ఇప్పుడు రూప భర్తను రూపకి ఇవ్వాలి అంటే...మరి రుక్మిణి భర్తను రుక్మిణికి ఎవరు ఇస్తారని అడుగుతుంది. మంచి సంబంధం చూసి రుక్మిణీకి నేనే పెళ్లి చేస్తానని సూర్య అంటాడు.నీకు నచ్చినప్పుడు పెళ్లి చేయడానికి..నచ్చనప్పుడు విడాకులు ఇవ్వడానికి అంతా నీ ఇష్టమేనా అని నిలదీస్తుంది. ఇది ఓ ఆడపిల్ల మనసు అని నీఇష్టానుసారం ఏదీఅంటే అది చేస్తానంటే కుదరదని అంటుంది.
విడాకులు ఇవ్వడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అంటుంది. ఆ మాటలకు విజయాంబిక ఎంతో సంతోషపడుతుంది.ఇప్పుడిప్పుడే కలుసుకుంటున్నసూర్య,విరూపాక్షి మధ్య గొడవ జరగడంతోఆమె మనసులోచాలా ఆనందపడిపోతుంది. విడాకులు ఇవ్వదని చెప్పడానికి నువ్వెవరు అని విరూపాక్షిని సూర్య ప్రశ్నిస్తాడు. నేను తనకు తల్లినని ఆ హక్కుతోనే చెబుతున్నానని అంటుంది. విడాకులు ఇవ్వడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని అంటుంది. నా మాటకే మళ్లీ ఎదురు చెబుతున్నావా అని సూర్య కోప్పడతాడు. నా బిడ్డ జీవితం కోసం దేనికైనా వెనకాడనని విరూపాక్షి అంటుంది. విడాకులు ఇప్పించి తీరతానని సూర్య అంటే...అది ఎప్పటికీ జరగనివ్వనని విరూపాక్షి బదులిస్తుంది. దీంతో కోపంతో సూర్య తన తమ్ముడిని పిలిచి లాయర్‌ను పిలిపించమని చెప్పి వెళ్లిపోతాడు. కోమలి గురించి నిజం అందరికీ తెలిసేలా చేయకపోతే...నీకు నిజంగానే కోర్టులో విడాకులు వస్తాయని విరూపాక్షి తన కూతురుతో చెప్పి బాధపడుతుంది. కానీ కోమలి గురించి నిజం తెలిసిన అశోక్‌ను కూడా వాళ్లే బంధించారని...ఆమె ఏడుస్తుంది. అశోక్ వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటుంది. నువ్వేమీ భయపడకని...కోమలికి టైం దగ్గరపడే అది ఇంత గొడవ చేస్తోందని విరూపాక్షి అంటుంది. రాజు,రూపలకు విడాకులు రాబోతున్నాయని విజయాంబిక, దీపక్,కోమలి సంబరపడిపోతుంటారు. ఆస్తి నీ పేరుకు రాగానే..మనం అనుకున్న విధంగా పంచుకుందామని విజయాంబిక అంటుంది. అటు సూర్యా కూడా విరూపాక్షి మీద కోపంగా ఉంటాడు. ఇన్నిరోజులు నాపై గౌరవం,ప్రేమఉన్నట్లు నటించి ఈరోజు తన బుద్ధి చూపించిందని అనడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.