Podharillu Serial Today Episode: మహా తీసుకొచ్చిన గోల్డ్‌మెడల్స్‌ చూసి ప్రతాప్‌ ఆమెను అభినందిస్తాడు. నువ్వు చాలా గ్రేట్‌ తల్లి నీ గొప్పతనం తక్కువ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నీలాగే మీ నాన్న గ్రేట్ అనిపించుకోవాలంటే...నీ పెళ్లి చాలా గ్రాండ్‌గా చేయాలి కదా అంటాడు. నీ కమ్యూనిటీ కోసం నా ఆశలు వదులుకోవాలా అని మహా అంటుంది. ఇంతలో  వదిన తరఫు తల్లిదండ్రులు నీ పెళ్లి అయిన తర్వాత కూడా నువ్వు జాబ్‌ చేయవచ్చు కదా అంటూ ఉచిత సలహాలు ఇస్తారు.  పెళ్లికి ముందు నువ్వు జాబ్‌కు  వెళ్లి అక్కడ ఎవరినైనా ప్రేమించి ఇంటికి తీసుకొస్తే....మీ నాన్న తలెత్తుకుని తిరగగలడా అని అంటారు. ఇవి జస్ట్ పెళ్లి చూపులే కదా నువ్వు వాళ్లకు నచ్చాలి, వాళ్లు నీకు నచ్చాలి కదా వాళ్లు ఇంటికి పిలిచి ఇప్పుడు కాదంటే కుదరదమ్మా అంటూ బుజ్జగిస్తాడు. నువ్వు రెడీ అయి వచ్చి వాళ్ల ముందు కూర్చోమని చెప్పి ప్రతాప్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Continues below advertisement

                 చిన్నప్పటి నుంచి మాధవ్‌ను ఇష్టపడుతున్న గాయత్రి...ఇప్పటికీ  అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. బావతో పెళ్లి జరగాలంటూ  దేవుడి గుడిలో మొక్కుకుంటుంది.  ఇంతలో వాళ్ల ప్రెండ్‌ వచ్చి మీ మాధవ్‌ బావకు పెళ్లిచూపులని చెబుతుంది. తొందరగా వెళ్లి ఆపకపోతే  మీ బావ పెళ్లి చూపులకు వెళ్లిపోతాడని చెబుతుంది. దీంతో ముడుపు మర్చిపోయామని...ఇంటికి వెళ్లి తీసుకొస్తానని చెప్పి గుడిలో నుంచి వెళ్లిపోతుంది. నేరుగా మాధవ్‌ వద్దకు వెళ్లి నిలదీస్తుంది. నేను ఉండగా...నువ్వు ఇంకో అమ్మాయిని చూడటానికి ఎలా వెళ్తావని అడుగుతుంది. నీకు అన్నీ తెలుసని...మీ అమ్మ ఒప్పుకుంటే నేను బయట సంబంధాలు ఎందుకు చూసుకుంటానని అంటాడు. నువ్వు మాఇంటికి వచ్చావని తెలిస్తేనే మీ అమ్మ ఒప్పుకోదు...అలాంటింది కోడలిగా ఎలా పంపిస్తుందని అనుకుంటున్నావ్ అంటాడు. మరికొద్దిరోజులు ఆగొచ్చు కదా అని గాయత్రి అడగ్గా...ఇప్పటికే  చాలా లేట్‌ అయ్యిందని చిన్నా అంటాడు. ఇంతలో నారాయణ,చక్రి అక్కడికి వచ్చి మీ అమ్మను ఎదిరించి రా మీ పెళ్లి మేం చేస్తాం అంటారు. నా బతుకు ఇంతే అంటూ గాయాత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.   

                             పెళ్లిచూపులకు మహాను రెడీ చేయడానికి వదిన హారిక రాగా...ఆమెతో వాదిస్తుండగా తల్లి లలిత అక్కడికి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదా అని అంటుంది. పెళ్లి కొడుక్కి రెడ్‌ కలర్‌ అంటే అస్సలు నచ్చదంటా కాబట్టి ఆ శారీ కట్టుకోవద్దని చెప్పి తొందరగా  రెడీ అవ్వమని వెళ్లిపోతుంది. ఇంతలో పెళ్లిచూపులకు పెళ్లివారు వస్తారు.తల్లి లలిత పైకి వెళ్తుంది. అక్కడమహా నగలు వద్దని మారం చేస్తుంది. నీకు ఎలా అనిపిస్తే అలా  రెడీ అవ్వు అంటూ తొందరపెట్టి కిందకు తీసుకొస్తుంది. పెళ్లికొడుకు,పెళ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకోవడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.

Continues below advertisement