Ammayi garu Serial Today Episode: అమ్మాయిగారిని ఎవరు చంపాలనుకుంటున్నారోనని రాజు ఆలోచిస్తుంటాడు. విజయాంబిక,దీపక్‌పై అనుమానం కలుగుతుంది. మనం రూపను గానీ, సూర్యను గానీ చంపమని పంపితే...ఆ వెధవ అశోక్‌గాడు కోమలిని కాల్చాడేంటిరా అని విజయాంబిక తన కొడుకును అడుగుతుంది. నాకు అదే అర్థం కావడం లేదని దీపక్‌ అంటాడు. కోమలికి ప్రమాదం తప్పిందని  డాక్టర్‌ చెప్పడంతో  సూర్య కాస్త తేలికపడతాడు. ఒక్కొక్కరూ లోపలికి వెళ్లి ఆమెను పలకరిస్తారు. ఆమెను రెస్ట్‌ తీసుకోమని చెప్పి సూర్య వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రూప.....బాడీలో బుల్లెట్‌ దిగి బతికిపోయావు. అనాథ ఆశ్రమం వాళ్లు చెప్పిన నిజం విన్నాక....మా నాన్నే నీ గుండెల్లో బుల్లెట్ దింపేవాళ్లని అంటుంది. ఆ  దేవుడే నిన్ను కాపాడాడని రూప అంటుంది. నన్ను ఆ దేవుడు కాపాడలేదని...నేనే కాపాడుకున్నానని కోమలి సమాధానమిస్తుంది. నన్ను ఎవరైనా షూట్‌ చేయాలంటే తలమీదో, గుండెలమీదో కాల్చాలి కదా... కానీ నాకు ఎలాంటి అపాయం కలగకుండా కాల్చాడంటే మీకు ఇంకా అర్థం కాలేదా ఇదంతా నా ప్లాన్ అని  చెబుతుంది. ఇంతలో విజయాంబిక కల్పించుకుని నీ ప్లాన్ అదిరిపోయింది రూప అంటుంది. మీరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా  మాతో ఇలాగే ఉంటుందని విరూపాక్షి, రూప,రాజుతో అంటుంది. మీ యాక్షన్‌కు మా రియాక్షన్ మీరు ఊహించని రీతిలో ఉంటుందని హెచ్చరిస్తుంది. దీంతో వారు బయటకు వెళ్లిపోతారు.                      మనం ఎన్ని ప్లాన్స్ వేసినా..ఏదో ఒక రూపంలో  కోమలి తప్పించుకుంటుందని  రూప రాజుతో అంటుంది. తనను కాపాడుకోవడం కోసం ఒకరిని చంపడానికే సిద్ధపడింది అనుకున్నాం కానీ...తాను చావడానికి కూడా వెనకాడటం లేదని అంటుంది. మన టైం బాగాలేనప్పుడు  మనం కొంతకాలం సైలెంట్‌గా ఉండటమే మంచిదని విరూపాక్షి సలహా ఇస్తుంది. మీ నాన్న ఎలాగూ కోమలినే రూప అని నమ్ముతున్నారు. మనం నేరుగా వెళ్లి విషయం చెబితే...కోమలిపై దాడి చేయించింది కూడా మనమేనని  అనుమానిస్తారని అంటుంది. కొంతకాలం కోమలి జోలికి వెళ్లకుండా  ఉంటే మంచిదేమోనని అంటుంది. దీనికి రాజు ససేమిరా  అంటాడు. మనం కోమలిని వదిలేస్తే...ఆమె మరింత బలపడుతుందని చెబుతాడు. దెబ్బమీద దెబ్బ తగుతుంటేనే...తనకు ఊపిరి ఆడక బయటకు వస్తుందని అంటాడు. మరి ఎలా బయటపెట్టగలమని అంటే...రేపు ఒకసారి అనాథ శరణాలయంలో ఉన్న వాళ్లందిరనీ ఇంటికి పిలిపిద్దామని రాజు అంటాడు. ఈ విషయం బయటకు తెలియనీయకూడదని అంటాడ. వాళ్లు వస్తున్నారని తెలియబట్టే...కోమలి ఇలాంటి ప్లాన్ వేసిందని అంటాడు. అదే వాళ్లు వస్తున్నారని తెలియకపోతే...వాళ్లు ఎలాంటి ముందస్తు ప్లాన్స్ వేసుకోరని చెబుతాడు. ఎవరికీ తెలియకుండా  వాళ్లను ఇంటికి పిలిపించాలని చెబుతాడు. దీంతో విరూపాక్షి ఆశ్రమానికి ఫోన్ చేస్తుంది.                                  అనాథ ఆశ్రమం నుంచి వాళ్లంతా వచ్చే సమయానికి సూర్య ఇంటిలోనే ఉండేలా విరూపాక్షి పథకం వేస్తుంది. సూర్య బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తుంది. కొంతమంది ముఖ్యమైన వాళ్లు నీతో మాట్లాడటానికి ఇంటికి వస్తున్నారని నువ్వు ఇంట్లో ఉండగలవా అని అడుగుతుంది. ఆయన సరేనంటాడు. అయితే ఈ విషయం విజయాంబిక, దీపక్‌ చాటుగా వింటారు. ఇంతలో రూప కోమలి దగ్గరకు వెళ్లి అనాథ ఆశ్రమం నుంచి నీ గురించి చెప్పడానికి చాలామంది వస్తున్నారని...ఈరోజు నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదని చెబుతుంది. ఈ మాటలకు కోమలి కంగారుపడుతుంది. రూప చెప్పిన మాటలు విజయాంబిక, దీపక్‌ కూడా వింటారు. దీంతో కోమలి వాళ్ల దగ్గరకు పరుగెత్తికెళ్లి...ఏం చేయమంటారని అడుగుతుంది. దీంతో వాళ్లు ఓ నవ్వు నవ్వుతారు. నేను దొరికిపోతే మీరు కూడా దొరికిపోతారని చెప్పగా...కాసేపట్లో అన్ని విషయాలు నీకు తెలుస్తాయిలే అని విజయాంబిక అంటుంది.                                  ఇంతలో రాజుకు ఫోన్ రావడంతో కంగారుగా కిందకు పరుగెత్తుకుంటూ వచ్చి టీవీఆన్‌ చేస్తాడు. అందులో బ్రేకింగ్ న్యూస్‌లో  రాత్రికిరాత్రే అమ్మ అనాథ శరణాలయం కాలి బూడిదైపోయిందని రావడం చూసి అందరూ షాక్‌ తింటారు. గాఢ నిద్రలో ఉన్న 30మంది అనాథలు సజీవ దహనమయ్యారని న్యూస్‌లో చెప్పడం విని విరూపాక్షి  కన్నీళ్లు పెట్టుకుంటుంది.