గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 11 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 11 Episode

Continues below advertisement

ముగ్గురు తోడికోడళ్లు కాఫీ కప్పు పట్టుకుని చర్చ పెడతారు. అంటీకి కాఫీ ఇచ్చావా అని రోహిణి అడిగితే..ఇచ్చాను షింక్ తాకిందని చెబుతుంది మీనా. అదేంటి అంటే..కాఫీని పారబోసారంటుంది. నవ్వుతుంది శ్రుతి. ఆంటీకి నీపై కోపం ఉందా అని శ్రుతి అడుగుతుంది. అవును బాలు ఎలా అంటే అలా మాట్లాడాడు కదా అని నోరుపారేసుకుంటుంది రోహిణి. అసలు తప్పు మనోజ్ చేశాడు..మీనా నగలు మింగేశాడు..అందుకోసం ఆంటీ సపోర్ట్ చేశారు. ఇది పెద్ద క్రైమ్..అలాంటప్పుడు మీనా ఏమీ మాట్లాడదు అనా తనని టార్గెట్ చేస్తున్నారు అని గట్టిగానే అడుగుతుంది.  ఆంటీ వింటే బాధపడతారు ఆపెయ్ శ్రుతి అనగానే..రోహిణి వెళ్లి చెబుతుందిలే అంటుంది. నేనెందుకు చెప్తా అని భుజాలు తడుముకుంటుంది రోహిణి... చెప్పవా అయితే నువ్వు మంచిదానేవే అని కాంప్లిమెంట్ ఇస్తుంది

ముగ్గురు తోడికోడళ్లు కలసి ప్రభావతి దగ్గరకు వెళ్లి ..సత్యంతో మాట్లాడేందుకు ప్రభావతిని ఒప్పించాలి అనుకుంటారు. అప్పుడు కూడా మీనాపైనే నిందలు వేస్తుంది. మొత్తం నీవల్లే జరిగిందంటూ సూటిపోటిమాటలంటుంది. తప్పు మీరు చేసి మీనాను అంటారేంటి..అయినా ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం...మీరు మీనాకు క్షమాపణలు చెప్పడం అంటుంది. అంతెత్తున లేస్తుంది ప్రభావతి. నేను కరెక్టే చెప్పాను..మీకు నచ్చింది చేయండి...పద మీనా అని తీసుకెళ్లిపోతుంది శ్రుతి. ఆ తర్వాత రోహిణి అక్కడే ఉండి..మీరే కాస్త తగ్గండి అత్తయ్యా అంటుంది. నేను మాట్లాడేందుకు ట్రై చేస్తున్నా..ఆయనే మాట్లాడడం లేదంటుంది ప్రభావతి. నేను కాసేపు కామాక్షి ఇంటికి వెళ్లొస్తా అని వెళ్లిపోతుంది.

Continues below advertisement

ఆ తర్వాత బాలు తన ఫ్రెండ్ తో కలసి సెకెండ్స్ లో కారు కొనేందుకు వెళతాడు. ఆ షోరూం ఓనర్ బాలుని చూడగానే.. నువ్వు గతంలో తీసుకొచ్చిన MLA ఓ కారు కొన్నాడు..ఆ తర్వాత తను మరో నలుగురిని పంపించాడు..నీవల్ల 5 కార్లు అమ్ముడయ్యాయ్ అంటాడు. నేను కారు కొనేందుకు వచ్చానని చెప్పడంతో రెండు కొత్త కార్లు వచ్చాయని చూపిస్తాడు. రెండు కార్లూ బావున్నాయి..ఏం కొనాలి అని ఆలోచనలో పడతాడు.. మీనాకు కాల్ చేసి రమ్మని చెబుతాడు. నేను కారు కొనేందుకు వచ్చానని చెప్పి..గతంలో కొన్న షోరూంలోనే ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు. 

కోపంగా కామాక్షి ఇంటికి వస్తుంది ప్రభావతి. ఏమైంది వదినా అంటే..నాకు వస్తున్న కోపానికి ఆ ఇద్దరి పీకలపై కాలేసి తొక్కాలి అనిపిస్తోంది అంటుంది. అన్నయ్య ఇంకా మాట్లాడలేదా అని అడిగితే.. లేదంటుంది. సత్యం అన్నయ్య నీతో మాట్లాడకుండా ఉండలేరులే అని సర్దిచెబుతుంది కామాక్షి.శ్రుతి గురించి చెప్పి ఫైర్ అవుతుంటుంది. బాగా డబ్బున్న అమ్మాయి అని నెత్తిపై పెట్టుకుని తిరుగుతావ్ కదా అంటుంది కామాక్షి. దానిపై నేను ప్రేమ చూపిస్తాను కానీ నాపై దానికి ప్రేమ లేదంటుంది. ఇన్నాళ్లూబాలు ఒక్కడే అంటాడు అనుకున్నా..వాడికి తోడు ఇది వచ్చింది అంటుంది. శ్రుతి ముక్కుసూటిగా మాట్లాడుతుందని నీక్కూడా తెలుసు కదా అంటుంది కామాక్షి. ఇప్పుడు ఏకంగా పూలకొట్టుదానికి క్షమాపణలు చెప్పమంటోంది అంటుంది ప్రభావతి. డబ్బున్న అమ్మాయి కదా అంటుంది కామాక్షి. తనొక్కతేనా కోటీశ్వరురాలు..నా పెద్దకోడలు తండ్రి మలేషియాలో చాలా పోగేశాడు అయినా రోహిణి ఎప్పుడైనా అలా ప్రవర్తించిందా అంటుంది. నేను శ్రుతి కఠినంగా ఉండి ఉంటే తెలిసి వచ్చేది అంటుంది. డబ్బుంటే మాత్రం శ్రుతి ఏమైనా ఇస్తుందా ఏంటి.. రోహిణి నెలకు 5 వేలు ఇస్తోంది...ఇకపై శ్రుతిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అంటుంది. అయితే స్వామీజి దగ్గరకు వెళదాం అంటుంది. ఆ మనోజ్ గాడు చేసినదానికి సమస్యల్లో పడకుండా ఉండాలనకుంటే నీవల్ల ఇంకా సమస్యల్లో పడ్డా అంటుంది. 

పెళ్లి చూపులకు ఇద్దరు అందమైన అమ్మాయిల్ని కూర్చోబెట్టినట్టుంది అంటాడు బాలు. నీకు ఏది నచ్చిందని అడుగుతాడు రాజేష్.. నాకు ఇది నచ్చింది.. తప్పనిసరిగా మీనా మరొకటి ఎంచుతుంది..నాకు నచ్చింది తనకు నచ్చదు అంటాడు బాలు. ఇంతలో మీనా వచ్చి కార్లేవి అని అడుగుతుంది..ఇవి బర్రెలా అని సెటైర్ వేస్తాడు. తప్పకుండా నాకు నచ్చింది ఎంచదు అంటాడు బాలు. మీనా మరో కారు ఎంచుతుంది. నాకు నచ్చిన కారుకి రివర్స్ లో నచ్చుతుందని చెప్పాకదా అంటుంది. రెండో కారు కొనాలి అన్న ఆలోచన నీదే కదా అని రాజేష్ అంటాడు. ఇంట్లో పరిస్థితి బాలేని టైమ్ లో కారు కొని ఇంటికి తీసుకెళ్తే అత్తయ్య భరతనాట్యం  చేస్తారు అంటుంది మీనా. ముగ్గురం కోడళ్లు కలసి వెళ్లాం ఆమెతో మాట్లాడేందుకు..కానీ బాగా తిట్టింది అంటుంది. ఇప్పుడు ఇంట్లో గొడవ టైమ్ లో కారు కొని సంబరంగా చూపించగలమా అంటుంది. బాలు కూడా ఆలోచనలో పడతాడు.