Podharillu Serial Today Episode: మాధవ్‌ పెళ్లిచూపులకు వెళ్లిన జ్యోతి..మహాకు ఫోన్‌ చేసి ఆయన మనసులో  ఇంకో అమ్మాయి ఉందని కాబట్టి ఆమెకే ఇచ్చి పెళ్లిచేయమని చెప్పడంతో....గాయత్రిని ఇచ్చి పెళ్లిచేయాలని మహాలక్ష్మీ నిర్ణయించుకుంటుంది. ఈ విషయం చక్రికి చెబుతుంది. ఈ పెళ్లి ఎన్నో అనార్థాలకు దారితీస్తుందని....ఎట్టిపరిస్థితుల్లోనూ గాయత్రి ఇల్లుదాటి బయటకు రాదని చెబుతాడు. ఆమె ఒప్పుకున్నా...మా అన్నయ్య మా గురించి ఆలోచించి ఒప్పుకోడని చెబుతుంది. అవన్నీ నేను చూసుకుంటానని మీరు పెళ్లికి ఏర్పాట్లు చేస్తే చాలని ఖరాఖండిగా చెబుతుంది. వాళ్లిద్దరూ ఒప్పుకుంటే పెళ్లి ఏర్పాట్లు గంటలో చేసేస్తామని చక్రి అంటాడు. దీంతో మహా గాయత్రికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతుంది. గుడికి వచ్చిన తర్వాత గాయత్రికి అసలు విషయం చెబుతుంది. దీంతో గాయత్రి షాక్‌ తింటుంది.  మా ఇంట్లో ఎదిరించి ఈ పెళ్లికి నేను రాలేనని చెబుతుంది. అయితే జీవితాంతం ఇష్టం  లేని వాడిని పెళ్లిచేసుకుని నువ్వు అక్కడ...మీ బావ ఇక్కడ ఏడుస్తూ ఉండండని చెబుతుంది. నేను కూడా అమ్మచాటు అమ్మాయినేని...కాని తెగించి బయటకు రాలేదా అని చెబుతుంది. మీ ఇంట్లోవాళ్ల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతుంది. మా బావ పెళ్లికి ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని....తప్పకుండా వస్తానని అంటుంది. అయితే ఈ రోజు సాయంత్రమే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాటిస్తుంది మహాలక్ష్మీ...అన్ని ఏర్పాట్లు చేసి నీకు ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది.                         మహాలక్ష్మీతోపాటు కేశవ్‌, కన్నా కలిసి మాధవ్‌తో పెళ్లి గురించి మాట్లాడతారు. అది విన్న మాధవ్‌ ససేమిరా అంటాడు. గాయత్రి పెళ్లి అయ్యేవరకు నేను ఎక్కడికి అన్నా వెళ్లిపోతానని అప్పటి వరకు ఇంటికిరానని చెబుతాడు. దీంతో మహాలక్ష్మీ మాధవ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇస్తుంది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పినప్పుడు నాకు ఏదో చెప్పారు కదా...మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటని నిలదీస్తుంది. నా మాట విననివాళ్లు ఉన్నప్పుడు ఇక నాకు ఈ ఇంట్లో పనేముందని....నేను నా దారి చూసుకుంటానని చెబుతుంది. ఆడపిల్ల తెగించి బయటకు వస్తాను అన్నప్పుడు నీకు ఏంటి ప్రాబ్లం అని అంటుంది. ఈ పెళ్లి తర్వాత వాళ్లు ఊరుకుని ఉండరని చెబితే...మరి మీ ఇంట్లో కూడా నలుగురు ఉన్నారు కదా ఆ మాత్రం ఎదిరించలేరా అని అంటుంది. మొత్తానికి మాధవ్‌ను పెళ్లికి ఒప్పిస్తుంది. ఈ విషయం గాయత్రికి చెప్పి ముహూర్తం సమయానికి గుడికి రమ్మని చెబుతుంది.                            గుడిలో చక్రి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అందరూ గుడికి వచ్చి గాయత్రి కోసం ఎదురుచూస్తుంటారు. అటు ఇంట్లో గాయత్రి బయటకు రావడానికి నానా తిప్పలు పడుతుంటుంది. ఆమెను ఒంటరిగా వదిలివెళ్లకుండా బామ్మన తోడుగా పెట్టి తాయరు బయటకు వెళ్తుంది.ఇంట్లో నుంచి పారిపోయేందుకు రెడీ అయిన గాయత్రి....బామ్మ నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అటు ముహూర్తం సమయం దగ్గరపడుతుండటంతో గుడిలో మహా టెన్షన్‌ పడుతుంది.