MeghasandesamSerial Today Episode: శారద, పూరిని రెడీ చేస్తుంటే గగన్‌ వెళ్లి ఒక ఇంపార్టెంట్‌ విషయం మాట్లాడాలి బయటకు వెళ్దాం పద అంటాడు. దీంతో పూరి అంత ఇంపార్టెంట్‌ ఏంటి అన్నయ్యా నా ముందే మాట్లాడుకోవచ్చు కదా అంటుంది. అదేం లేదు ముందు నువ్వు రెడీ అవ్వు అంటూ శారదను బయటకు తీసుకెళ్తాడు గగన్‌.

Continues below advertisement

శారద: నన్ను టెన్షన్‌ పెట్టకురా ఏమైందో చెప్పు..

గగన్‌: అదే నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు.

Continues below advertisement

శారద: చెప్పు పర్వాలేదు.. నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. పూరి పెళ్లి నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాము.. మంచి సంబంధం కుదిరింది. ఇంకా ఏం చెప్తావురా నాకు

గగన్‌: ఇది మంచి సంబంధం. కానీ మన ధృవకు ఒక చెల్లి ఉందని చెప్పాను కదా..?

శారద: అవును చెప్పావు..?

గగన్‌: ధృవ మన పూరిని పెళ్లి చేసుకోవడానికి ఒక కండీషన్‌ పెట్టాడమ్మా..?

శారద: కండీషనా..? కండీషన్‌ ఏంటి..? చెప్పు గగన్‌..

గగన్‌: ధృవ చెల్లిని నేను పెళ్లి చేసుకోవాలట.

అని గగన్‌ చెప్పగానే.. శారద షాక్‌ అవుతుంది.

శారద: గగన్‌ ఏం మాట్లాడుతున్నావు. నువ్వు అతని చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి..? నీ భార్య భూమి ఉంది కదా..?

గగన్‌: అమ్మా భూమికి నాకు సంబంధం లేదు. అంతా అయిపోయింది అని చెప్పాను.

శారద: నీకైమైనా పిచ్చా..? అంతా అయిపోవడం ఏంటి..? బయటకు పంపిచేస్తే అంతా అయిపోయినట్టేనా..?

గగన్‌: అది కాదమ్మా..? ఇదిగో ఇది చాలా మంచి సంబంధం అమ్మా. ధృవ చాలా మంచి వాడు. మన పూరికి ఈ సంబంధం ఖాయం కావాలమ్మా..

శారద: గగన్‌ నువ్వు పూరికి మంచి సంబంధం తీసుకురా నేను కాదనను. కానీ ఇది కాకపోతే ఇంకోటి తీసుకురా అంతేకానీ పూరికి పెళ్లి చేయడం కోసం నా కోడలి గొంతు కోస్తావా..? నేను అసలు ఒప్పుకోను..

 గగన్‌: అమ్మా వాళ్లు ఆల్‌రెడీ బయలుదేరారు అమ్మా.. దగ్గరకు వచ్చి ఉంటారు.

శారద: ఈ విషయం నువ్వు నాకు ముందు చెప్పావా…

గగన్‌: నువ్వు ఒప్పుకుంటావనే ధైర్యంతో

శారద: ఈ విషయం నేను ఎలా ఒప్పుకుంటానురా..? భూమికి అన్యాయం జరుగుతుంటే నేను ఎలా ఒప్పుకుంటాను. ఈరోజు కాకపోయినా రేపైనా భూమి గురించి నిజం తెలుసుకుంటావు. ఇద్దరు ఒక్కటవుతారని ఆశతో ఉన్నానురా.. అలాంటిది నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే భూమికి అన్యాయం చేసినట్టు కాదా..? నా కొడుకు ఎలాంటి తప్పు చేయడానికి నేను ఒప్పుకోను వద్దు ఈ సంబంధం కాన్సిల్‌ చేయ్‌.

గగన్‌: లేదమ్మా నాకు ఈ సంబంధం క్యాన్సిల్ చేయడం కుదరదు. ధృవ లాంటి మంచి భర్తను పూరికి తీసుకురాలేనమ్మా..? ఎందుకంటే ధృవకు చెల్లెలు అంటే ప్రాణం అమ్మా.. చెల్లిని అంత ప్రాణంగా ప్రేమించే వాడు. నా చెల్లిని కూడా బాగా చూసుకుంటాడు.

శారద: అలాగని భార్య ఉండగా ఇంకో అమ్మాయిని..

గగన్‌: అమ్మా నా చెల్లికి పెళ్లి జరగాలంటే నేను ఈ పెళ్లి చేసుకోవాలి. నా చెల్లెలి కోసం మాత్రమే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఫ్లీజ్‌ అమ్మా అర్థం చేసుకో అమ్మా..

శారద: నీ చెల్లెలు సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదురా..? కానీ భూమి కూడా ఒక ఆడపిల్లేగా దాని గొంతు ఎందుకు కోయాలనుకుంటున్నావు..?

గగన్: ఇంత చిన్న విషయాన్ని నువ్వెందుకు అంత సీరియస్‌గా తీసుకుంటున్నావు..? నేను అప్పుడే చెప్పాను కదా భూమి నా భార్య కాదు అని మేము ఎప్పటికీ  కలవము అని ఎప్పటికీ భూమిని నేను క్షమించను అమ్మ. నా బాధ అర్థం చేసుకో అమ్మ. పూరి కూడా మంచి భర్త దొరికి సంతోషంగా ఉండాలని నీకు లేదా అమ్మా..?   

అంటూ గగన్‌ నిలదీయగానే శారద డైలమాలో పడిపోతుంది. గగన్‌ కు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తుంది. అప్పుడే ధృవ తన చెల్లెలిని తీసుకుని గగన్‌ ఇంటికి వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!