Jagadhatri Serial Today Episode: సుజాత హత్యకేసు విచారణలో భాగంగా జేడీ, కేడీ వాళ్ల ఇంటికి వెళ్తారు. అక్కడవాళ్ల అమ్మను ఓదార్చి...అనుమానితుడైన గౌతమ్‌ను కలుస్తారు. సుజాత చనిపోయినరోజు వాళ్ల  ఇంటికి  ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తారు.కానీ తాను అసలు వాళ్ల ఇంటికే వెళ్లలేదని చెబుతాడు.అయితే అతను షూ సైజు, సంఘటనాస్థలంలో దొరికిని సిగిరెట్‌ ముక్కలు పోల్చిచూసి ఆ హత్యతో గౌతమ్‌క సంబంధం ఉండి ఉంటుందని జేడీ భావిస్తుంది. మర్యాదగా నిజం చెప్పకపోతే..స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పగా గౌతమ్‌ భయంతో వాళ్లను నెట్టేసి పారిపోతాడు. ఆ క్రమంలో జేడీ, కేడీ ఇద్దరూ గౌతమ్‌ను వెంబడిస్తారు. అతను తప్పించుకుని పారిపోతుండగా...ఓ కారు గుద్దుకుని తీవ్రంగా గాయపడతాడు. వెంటనే కేదార్‌ అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాడు.               భోజనానికి  అందరినీ పిలిచిన వైజయంతి....కౌషికిని  మాత్రం పిలవకపోయేసరికి సుధాకర్‌ భార్యను గట్టిగా మందలిస్తాడు. అబ్బోడు చిన్న తప్పు చేసినందుకే నెలరోజులపాటు అందరితో కలిసి భోజనం చేయవద్దని కండీషన్‌ పెట్టిన కౌషికి ఇప్పుడు మోసం చేసి కంపెనీ నడుపుతోందని తెలిసింది కదా...ఇప్పుడు ఈ అమ్మిని ఎన్ని రోజులు దూరం పెట్టాలని అడుగుతుంది. అది విన్న సుధాకర్‌ భార్యపై కోప్పడతాడు. కౌషికి తప్పు చేయలేదని నిన్నే చెప్పాను కదా మళ్లీ ఆమాటే అంటావని నిలదీస్తాడు. ఆ మాటలు విన్న కౌషికి నాకు  ఆకలిగా లేదని వెళ్లిపోతుంది.  అనవసరంగా ఆ దివ్యాంకతో గొడవలు వద్దని....ఆమెతో మాట్లాడుకుని కలిసిమెలిసిపోతే సాఫీగా కంపెనీ వ్యవహారాలు సాగించుకోవచ్చని అంటుంది. నాకు జేడీపై  నమ్మకం ఉందని..ఈ కేసు నుంచి నన్ను ఎలాగైనా బయటపడేస్తుందని అంటుంది.అప్పుడే దివ్యాంక తన ఛానెల్‌లో న్యూస్ చూపిస్తుంది. పారిశ్రామికవేత్త అయిన కౌషికిని కాపాడేందుకు జేడీ,కేడీ ఇద్దరూ కలిసి ఓ అమాయికుడిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని..అది తట్టుకోలేక అతను కారుకిందపడి ఆత్మహత్య చేసుకోబోయాడని అసత్య ప్రచారం చేస్తుంది.ఇది చూసిన నిషిక...ఇప్పుడు వాళ్లే చిక్కుల్లో పడ్డారని ఇక నిన్నేం కాపాడతారని అంటుంది. నిజం, న్యాయం నావైపు ఉన్నప్పుడు నేను ఎవరికీ భయపడాల్సిన పనిలేదని కౌషికి అంటుంది.                    ఆస్పత్రిలో జేడీ,కేడీ ఇద్దరూ గౌతమ్‌ గురించి చర్చించుకుంటారు.సుజాత కేసులో ఖచ్చితంగా ఇతనికి ఏదో తెలిసి ఉంటుందని అనుకుంటారు.అప్పుడే సాధు ఫోన్ చేసి దివ్యాంక న్యూస్‌లో అసత్య ప్రచారం చేస్తుందని చెబుతాడు. పైనుంచి వచ్చే ఒత్తిళ్లు నేను చూసుకుంటానని....మీ పని మీరు కానివ్వండని అంటాడు.ఇంతలో దివ్యాంక జేడీకి ఫోన్ చేసి బెదిరించాలని చూస్తుంది. ఒకసారి నా జోలికి వచ్చినందుకే నీ గతి ఏమైందో గుర్తు తెచ్చుకోమని ధాత్రి హెచ్చరిస్తుంది.ఈ కేసులో నేను ఎవరినిపడితే వాళ్లను అనుమానిస్తున్నానని...దయచేసి నా రేడియస్‌లోకి నువ్వు రావొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.                        కీర్తి బర్త్‌డే రావడంతో తండ్రిని పిలవాలని అలిగి కూర్చుంటుంది. జగధాత్రి, కేదార్ కూడా కౌషికిని బ్రతిమాలతారు. నువ్వు పిలిస్తే బావ తప్పకుండా వస్తాడని చెబుతార. అతన్ని రానివ్వకుండా చేసేందుకు నిషిక, యువరాజు,వైజయంతి ప్రయత్నించినా....ధాత్రి గట్టిగా పట్టుబట్టడంతో సరే ఫోన్ చేస్తానని కౌషికి అంటుంది.వెంటనే నిషిక దివ్యాంకకు ఫోన్ చేసి విషయం చెబుతుంది. దీంతో ఆమె సురేష్ వాళ్ల ఇంటికి వెళ్తుంది.  కౌషికి ఫోన్ చేయగా....సురేష్ ఫోన్ దివ్యాంక లిప్ట్ చేసి మాట్లాడుతుంది.అక్కడ నువ్వు ఎందుకు ఉన్నావని ధాత్రి నిలదీయగా....మాకుమాకు చాలా వ్యవహారాలు ఉంటాయని చెబుతుంది.ఆ మాటలు విన్న కౌషికి ఫోన్ కట్‌ చేస్తుంది. ఇదంతా దివ్యాం చేస్తున్న కుట్రని నువ్వు ఏమాత్రం నమ్మొద్దని జగధాత్రి కౌషికి చెబుతుంది.