Lakshimi Raave Maa Intiki Serial Today Episode: కోమాలో ఆస్పత్రిలో ఉన్న తన భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లేందుకు ప్రియంవద రౌడీలతో అక్కడికి వస్తుంది. బెడ్‌పై ఉన్న అతన్ని కుర్చీలో కూర్చోబెడుతుంది. రౌడీల నుంచి ముప్పు పొంచి ఉంటుందని భయపడి ఆస్పత్రికి పరుగెత్తుకుని వచ్చిన శ్రీలక్ష్మీని చూసి ప్రియంవద, రౌడీలు దాక్కుంటారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న మనిషి కుర్చీలో ఉండటం చూసి శ్రీలక్ష్మీ భయపడుతుంది. వెంటనే డాక్టర్‌ను పిలిచి నిలదీస్తుంది. ఇతనిపై ఆస్పత్రిలో హత్యాప్రయత్నం జరిగిందని చెబుతుంది.అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి సెక్యూరిటీ పెంచుతామని డాక్టర్ చెబుతాడు. అవసరం లేదని..ఇతన్నీ సీక్రెట్ ప్లేస్‌లో ఉంచి నేనే వైద్యం చేయిస్తానని శ్రీలక్ష్మీ చెబుతుంది. ఆ మాటలు విన్న ప్రియంవద కోపంతో రగిలిపోతుంది. శ్రీలక్ష్మీ గట్టిగా చెప్పడంతో డాక్టర్ కూడా సరేనంటాడు. వెంటనే శ్రీలక్ష్మీ అతన్ని తీసుకుని బయటకు వచ్చి కారులో ఎక్కించుకుని వెళ్లిపోతుంది. ప్రియంవద బయటకు వచ్చేప్పటికీ శ్రీలక్ష్మీ కనిపించకపోవడంతో చిందులు తొక్కుతుంది. ఎలాగైనా అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి తీసుకురమ్మని రౌడీలను ఆదేశిస్తుంది. శ్రీలక్ష్మీ ఆతన్ని ఓ ఆస్పత్రిలో చేర్పించి ఎవరికీ తెలియకుండా వైద్యం చేయిస్తుంది. అయితే కోమాలో ఉన్న అతన్ని బెడ్‌పై పడుకోబెడుతుండగా....అతని ఛాతిపై పడి ఉన్న బ్రాస్‌లెట్ తీసుకుని పరిశీలనగా శ్రీలక్ష్మీ చూస్తుంది. ఇది ప్రియంవద అమ్మగారి బ్రాస్‌లెట్‌లా ఉందని అనుకుంటుంది. ఆమె బ్రాస్‌లెట్ ఇతని వద్దకు ఎలా వచ్చిందని ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. కాలేజీకి వెళ్లేందుకు బస్టాఫ్‌లోఉన్న శ్రీలక్ష్మిని కాలేజీలో దింపుతానని విక్రమ్ అడుగుతాడు.దీనికి ఆమె రానని చెబుతుంది. ఏదోవిధంగా ఆమెకు మాటలు చెప్పి విక్రమ్ తన బైక్‌పై శ్రీలక్ష్మీని ఎక్కించుకుని కాలేజికి వస్తాడు.అప్పుడే అక్కడ త్రిషతోపాటు ప్రెండ్స్‌తో మాట్లాడుతున్న మ్యాడీ వాళ్లిద్దరినీ చూస్తాడు. కాలేజీలో ఏ అమ్మాయికి పడని విక్రమ్‌ను ఈ ఎర్రబస్సు పడేసిందంటే గ్రేట్ అని త్రిష అంటుంది. ఏం మాట్లాడుతున్నావని మ్యాడీ అడగ్గా....మొన్న విక్రమ్ మా దగ్గరకు వచ్చి శ్రీలక్ష్మీ గురించి చాలా వివరాలు అడిగాడని చెబుతుంది. అతనికి శ్రీలక్ష్మీ అంటే చాలా ఇష్టంలా ఉందని చెబుతుంది.శ్రీలక్ష్మీకి కూడా ఇష్టంలేకపోతే అతని బైక్ ఎందుకు ఎక్కుతుందని లేనిపోనివి ఎక్కించి చెబుతుంది. దీంతో మ్యాడీ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక శ్రీలక్ష్మీ పని ఇవాళ్టితో అయిపోయిందని త్రిష ఆనందపడిపోతుంది. క్లాస్‌రూమ్‌కు వెళ్తున్న శ్రీలక్ష్మీని పక్కకు లాక్కెళ్లి మ్యాడీగట్టిగా నిలదీస్తాడు. ఎవడి బైక్ పడితే వాళ్ల బైక్ ఎక్కి కాలేజీకి రావడమేనా అని అడుగుతాడు. తాను విక్రమ్ బైక్ ఎక్కినందుకు అయ్యగారికి ఎక్కడో కాలిందని లక్ష్మీకి అర్థమవుతుంది. మ్యాడీని ఏడిపించడానికి ట్రై చేస్తుంది. ఏం చేస్తాం తమరికి పెళ్లాన్ని కాలేజీకి తీసుకురావాలంటేనే నామోషీగా ఉందని...ఎక్కడపడితే అక్కడ రోడ్డుపై వదిలేసి వస్తే ఇలాగే ఎవరో ఒకరి బైక్ ఎక్కి రాకతప్పదు కదా అని అంటుంది. అలా ఎవరి బైక్‌పై పడితే వాళ్ల బైక్ ఎక్కడానికి వీళ్లేదని మ్యాడీ అనగా...అయితే రేపటి నుంచి తమరే కాలేజీకి బైక్‌పై తీసుకురమ్మని అంటుంది. అలాంటిది కుదరదని మ్యాడీ అంటే....మరి నేను కూడా టైంకు కాలేజీకి రావాలంటే ఇలాంటివి తప్పదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. త్రిష విక్రమ్ దగ్గరకు వెళ్లి అతనికి లేనిపోని ఆశలు కల్పిస్తుంది. మీరు శ్రీలక్ష్మీని బైక్‌పై ఎక్కించుకుని తీసుకురావడం మేం చూశామని చెబుతుంది. తనకు కూడా మీరంటే ఇష్టం లేకపోతే బైక్ ఎందుకు ఎక్కుతుందని చెప్పి రెచ్చగొడుతుంది. ఆ తర్వాత ఈ గొడవను మరింత పెద్దది చేసేందుకు విక్రమ్‌కి శ్రీలక్ష్మీ రాసినట్లు లవ్‌లెటర్ రాయిస్తుంది.
Lakshimi Raave Maa Intiki Serial Today April 8th: శ్రీలక్ష్మీని బైక్ ఎక్కించుకుని కాలేజీకి వచ్చిన విక్రమ్....లక్ష్మీని అల్లరిపాలు చేయడానికి త్రిషవేసిన ఎత్తుగడ ఏంటి?
Ajay Kumar | 08 Apr 2026 11:04 PM (IST)
Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 8th: శ్రీలక్ష్మీని బైక్ ఎక్కించుకుని కాలేజీకి వచ్చిన విక్రమ్....లక్ష్మీని అల్లరిపాలు చేయడానికి త్రిషవేసిన ఎత్తుగడ ఏంటి?

లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్