Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవాని రేప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. దేవాని నేను కాపాడుకుంటానని మిథున అత్తామామలకు చెప్పి ధైర్యం చెప్తుంది. దేవాని ఎస్‌ఐ ఈడ్చుకెళ్లి బోనులో వేస్తాడు. కానిస్టేబుల్స్ దేవాని చితక్కొట్టి కొడతారు.

Continues below advertisement


ఎస్‌ఐ దేవాతో ఎంత కొట్టినా నిజం ఒప్పుకోవేంట్రా అని అంటే నేనేం తప్పు చేయలేదు సార్ ఆ అమ్మాయి ప్రాబ్లమ్‌లో ఉంది అంటే వెళ్లాను అని దేవా చెప్తాడు. ఆపరా నీ నాటకాలు అని దేవాని ఎస్‌ఐ కొడతాడు. రౌడీషీటర్ అయిన నువ్వు తప్పు చేశావ్ ఆ అమ్మాయి మీద అత్యాచారం చే శావు అంటే ఆశ్చర్యం లేదు.. ఇన్నాళ్లకి కరెక్ట్ కేసులో దొరికావ్రా.. నెలలు నెలలు ట్రై చేయినా బెయిల్ రాకుండా చేస్తా. నీ వెనక పురుషోత్తం ఉన్నాడు నీకు సాయం చేస్తాడు అనుకున్నావ్‌ఏమో.. ఇది రేప్‌ కేసు ఏ పొలిటికల్ లీడర్‌ నీకు సాయం చేయరు. ఎందుకంటే ఈ కేసులో నీకు సాయం చేస్తే వాళ్ల లైఫ్‌నే పోతుంది. ఇక నీకు జీవితంలో బయటకు వచ్చే ఛాన్స్‌ లేనే లేదు అని అంటాడు.


శారద పూజ చేస్తూ తన కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు నా కొడుకుని కాపాడు అని మొక్కుకుంటుంది. మిథున అది చూస్తుంది. సత్యమూర్తి పేపర్‌ కోసం అడుగుతాడు. ఇంతలో ఆనంద్‌ పేపర్‌ తీసుకొస్తూ నాన్న నాన్న అని అరుస్తాడు. ఏమైందిరా అ ని అందరూ అడిగితే దేవా గురించి పేపర్‌లో ఇచ్చాడు. రేపు కేసులో అరెస్ట్ అయిన సత్యమూర్తి మాష్టారుగారి అబ్బాయి అని దేవా ఫొటో వచ్చిందని చూపిస్తాడు. అది చూసి సత్యమూర్తితో పాటు ఇంటిళ్లపాది షాక్ అయిపోతారు. పరువు పోయిందని సత్యమూర్తి చాలా బాధ పడతాడు. నలుగురిలో ఎలా తలెత్తుకొని తిరగాలి అని ఏడుస్తాడు. శారద కూడా ఏడుస్తుంది. 


మిథున మామయ్యతో దేవా ఏ తప్పు చేయలేదు అని మనందరికీ తెలుసు.. ఈ ఇంటి కోడలిగా దేవా భార్యగా దేవా ఏ తప్పు చేయలేదని నిరూపిస్తా. మీరు ధైర్యంగా తిరిగేలా చేస్తా ఏం బాధ పడకండి మామయ్య అని చెప్పి స్టేషన్‌కి వెళ్తాను అంటుంది. ప్రమోదిని మిథునకు దేవా కోసం బాక్స్ ఇస్తుంది. ఇక కాంతం డబ్బు కోసం ఈ విషయం త్రిపురకు చెప్తుంది. దేవా రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడని జరిగింది అంతా చెప్తుంది. ఇక కాంతం డబ్బు అడిగితే నువ్వు ఊహించలేనంత ఇస్తానని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. 


మిథున దేవా కోసం బాక్స్ తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తుంది. ఎస్ఐ మిథునని ఆపి దేవాని కోర్టులో హాజరు పరిచే వరకు తనని కలవకూడదు అని సాక్ష్యాలు తారు మారు చేసే ప్రయత్నం చేస్తారని కలవకూడదు అని చెప్తాడు. నా భర్త నిన్నటి నుంచి ఏం తినలేదు భోజనం ఇవ్వాలి అని మిథున అంటుంది. మిథున ఎంతకీ ఒప్పుకోకపోవడంతో మీరు జడ్జి గారి కూతురు అని ఇంత వరకు ఊరుకున్నా మేడం మీ స్థానంలో ఇంకొకరు ఉంటే  ఇంత వరకు మాట్లాడేవాడిని కాదు అని ఎస్ఐ అంటాడు. ఎస్‌ఐ కలవనివ్వకపోవడంతో మిథున ఎలా నా భర్తకి తిననివ్వకుండా చేస్తారో నేను చూస్తా అని పోలీస్‌ స్టేషన్ బయట కూర్చొంటుంది. 


త్రిపుర ఇంట్లో అందర్ని పిలిచి దేవాని రేప్ కేసులో అరెస్ట్ చేశారని చెప్తుంది. లలిత, అలంకృతలు దేవా అలాంటి వాడు కాదని అంటారు. రాహుల్, త్రిపురలు దేవాని వెనకేసుకురావడం ఆపమని వాడి వల్ల మనపరువు పోతుందని అంటారు. హరివర్ధన్ అందరితో ఏది జరిగినా మన మంచికే మిథున మన ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని ఏ దేవుడు ఆపలేడు అని అంటాడు.



మిథునని బయట మీడియా చూసి మీరు ప్రముఖ జడ్జి హరివర్థన్ గారి కూతురు కదా అని అడుగుతారు. మిథున అవును అని చెప్పగానే మీరు ఏంటి మేడం ఇక్కడ అని అడిగితే నా భర్తని అన్యాయంగా అరెస్ట్ చేశారని మిథున చెప్తుంది. కానిస్టేబుల్ ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి మీ ఉద్యోగానికి ఎసరు వచ్చే పరిస్థితి వచ్చిందని జడ్జి గారి కూతురు మీడియాతో మాట్లాడుతుందని చెప్తాడు. ఈ న్యూస్ వైరల్ అయి ఎస్పీకి తెలిస్తే మీ జాబ్ అంతే అంటాడు. మరోవైపు ఆదిత్య పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి మిథునని చూసి ఆ దేవాని నిన్ను శాశ్వతంగా దూరం చేస్తా అనుకొని మిథున దగ్గరకు వెళ్లి ఆ ఎస్‌ఐ నిన్ను రానివ్వడం లేదా నేను మాట్లాడుతా అని లోపల దేవా దగ్గరకు వెళ్లి దేవా నువ్వే భయపడకు దేవా ఇక నీ పని అయిపోయింది అంటాడు. దేవా షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.