Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మేడ మీద కూర్చొని మిథున తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటే మిథున భోజనం తీసుకొని వస్తుంది. దేవా వద్దని అంటే ఆకలితో నువ్వు ఉండలేవు తిను అంటుంది. నా ఆకలి అర్థమైన నీకు నా కోపం అర్థం కావడం లేదా.. కోపం వెనక ఉన్న బాధ నీకు అర్థం కావడం లేదా.. నీ కారణంగా ఇప్పటి వరకు నాకు నా వాళ్లకి మనస్శాంతి దూరం అయింది. ఇప్పుడు ప్రాణాలు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. నా ప్రాణాల మీద నాకు భయం లేదు రౌడీగా మారినప్పుడే ప్రాణాల మీద ఆశ వదిలేశా కానీ నా వాళ్ల ప్రాణాలకు మీ వారు హాని చేస్తారేమో అని భయంగా ఉందని దేవా అంటాడు. 

మిథున దేవాతో ఇది నీ కుటుంబం మాత్రమే కాదు నా కుటుంబం కూడా నా కుటుంబం మీద ఈగ కూడా వాలనివ్వను అని మిథున అంటే ఏయ్ ఆపు నీతో మాట్లాడి మాట్లాడి నేను అలసి పోయాను. నీకు చెప్పి చెప్పి నా సహనం పోయింది. నువ్వు ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ లోకంలో నువ్వు నాకు నచ్చని ఏకైక వ్యక్తివి. నువ్వు ఎంత కాలం ఇక్కడ ఉన్నా నేను భార్యగా ఒప్పుకోను అర్థం చేసుకో వాస్తవంలోకి వచ్చి ఆలోచించు అంటాడు. నువ్వు నిజంగా నేను, నా వాళ్లు బాగుండాలి అని కోరుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. దానికి మిథున అదే నీ భయం అయితే మీ ఎవరికీ అవ్వకుండా నేను ముందుంటాను. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. నీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే నీ కంటే క్షణం ముందు నేను ప్రాణాలు వదిలేస్తా అని చెప్తుంది. 

నేత్ర అందంగా రెడీ అవుతుంది. ఇంతలో ఓ వ్యక్తి కాల్ చేస్తే దేవా ఎదిరింట్లో ఉన్నా దేవాతో పరిచయం చేసుకున్నా వారంలో దేవాని ట్రాప్ చేస్తా మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోతుంది రిలాక్స్ అని చెప్తుంది. ఇక మిథున స్నానం చేసి వచ్చి గదిలో చీర కట్టుకుంటే దేవా వస్తాడు. మిథునని చూసి వేరే వైపు తిరిగి షర్ట్ వేసుకొని రెడీ అవుతాడు. అప్పుడే మిథున దేవాని చూసి కంగారు పడుతుంది. నువ్వు ఎప్పుడు వచ్చావ్ అంటుంది. నేను టైం చూడలేదు కానీ వచ్చి చాలా టైం అయిందని అని దేవా అంటాడు. చాలా సేపా అంటే చూసేశావా.. బుద్ధి ఉందా నీకు తలుపు కొట్టి రావచ్చు కదా అని మిథున అంటే నీకు బుద్ధి ఉందా తలుపులు వేసి ఉన్నావా బర్లా తెరిచి ఉంచావ్ సిగ్గు లేదా అని అంటాడు. దాంతో మిథున ఈ గదికి ఎవరూ రారు అని డోర్ క్లోజ్ చేయలేదు అని అంటుంది. ఎవరూ ఈ గదికి రారు కానీ నేను వస్తాను అని తెలిసి కూడా ఎందుకు డోర్ వేయలేదు అని దేవా అంటాడు. మిథున డోర్ వేయడం మర్చిపోయాను అయినా నువ్వు మంచోడే కానీ కొంటె కృష్ణుడువి ఏంటి అంటే దేవా మిథునతో నేను లోపలికి వచ్చా కానీ కనీసం నీ వైపు కూడా చూడలేదు. ఓ ఆడపిల్ల చీర మార్చుకుంటే చూసే అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. ప్రతీ ఆడపిల్లలోనూ మా అమ్మని చూస్తాను అని చెప్పి దేవా వెళ్లిపోతాడు. 

మిథున తనలో తాను నా మొరటు మొగుడు బంగారం అని అనుకుంటుంది. కిచెన్‌లో శారద వంట చేస్తుంటే కాంతం దుమ్ము దులుపుతూ ఉంటుంది. ప్రమోదినికి కూరగాయలు కోయమని చెప్తుంది. మిథున వచ్చి అత్తయ్యా అనగానే ఏమ్మా టీ కావాలా అంటుంది. దాంతో కాంతం నేను పని చేస్తున్నా నాకు ఏం అనలేదు కానీ మేడం రాగానే అడిగేస్తుందని ఫీలైపోతుంది. మిథున అత్తతో నేను మా పుట్టింటికి వెళ్తా అని చెప్తుంది. శారద కంగారు పడి ఎందుకమ్మా అని అడుగుతుంది. కాంతం మిథునతో మంచి పని చేస్తున్నారు మిథునా మేడం అంటుంది. ఈవిడ వల్ల దేవా ప్రాణాలు పోకూడదు అని మనమంతా సంతోషంగా ఉండాలని దుకాణాన్ని వాళ్ల ఇంటికి పర్మినెంట్‌గా సర్దేస్తున్నారన్నమాట అని అంటుంది. 

మిథున కాంతంతో ఇది నా అత్తవారిల్లు చావు అయినా బతుకు అయినా ఇక్కడే. అత్తయ్య సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నా ఆయనతో పాటు మీరంతా ప్రశాంతంగా ఉండటం కోసం వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది. ప్రమోదిని కాంతంతో ఏడ్వొద్దు కాంతం అని సెటైర్లు వేస్తుంది. బయట దేవా బండి తుడుస్తుంటే మిథున వెళ్లి నేను డ్రాప్ చేయమని చెప్తా అని సీట్ తుడుస్తున్నావా అని అంటే నిన్ను ఎక్కించుకోవాలంటే సీట్ సగం చింపేసుకుంటా అని అంటాడు. దేవా డ్రాప్ చేయను అని చెప్పి వెళ్లిపోతాడు. దేవా కోసం ఎదురు చూస్తున్న నేత్ర తన స్కూటీ గాలి తీసేసి దేవాకి లిఫ్ట్ అడుగుతుంది. ఆఫీస్‌కి ఫస్ట్‌ డే జాయినింగ్ అంటూ నేత్ర బతిమాలితే దేవా ఒప్పుకొని ఎక్కించుకుంటాడు. 

పోలీస్ అధికారి రోడ్డు మీద ఉంటూ మిథున గురించి ఆలోచిస్తుంటాడు. మిథున నచ్చేసిందని తనని వదలను అనుకుంటాడు. ఇంతలో దేవాని చూసి వీడు వచ్చాడు అంటే నా దిల్‌కా దడఖన్ వచ్చేసుంటుందని బండి అపుతాడు. దేవాని చూసి ఈరోజు కొత్త పార్టీని తీసుకొచ్చావ్ అది ఏదిరా అని అడుగుతాడు. దాంతో దేవా తనని అది ఇది అంటే బాగోదు అని తిడతాడు. నేత్రిని చూసి నువ్వు ఎంత మందిని తెచ్చినా ఆ కత్తి వేరురా తనది పడి చచ్చిపోయే అందంరా తన కోసం యుద్ధాలు చేసినా పర్లేదురా. అలాంటి అందం ఆశ్వాదించకపోతే జీవితమే వేస్ట్‌రా అంటాడు. తన గురించి తప్పుగా మాట్లాడొద్దు అంటే అర్థం కాదా అని దేవా అరుస్తాడు. అంత అందగత్తె నీ లాంటి లోఫర్‌ గాడికి ఎలా పడిపోయిందిరా.. నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోవు అది నీ చుట్టూ తిరగడం ఏంట్రా అని పోలీస్ అడుగుతాడు. తనని ఎలా పడేశావో చెప్పరా కనీసం తన రేటు అయినా చెప్పరా అని పోలీస్ అంటే దేవా అతని షర్ట్ పట్టుకొని ఇంకొక్క మాట తన గురించి అంటే చంపేస్తా అంటాడు. మితునకు నేనున్నాను. ఒక కోటలా సైనికుడిలా నేనున్నాను తన వరకు వెళ్లాలి అంటే నన్ను దాటుకొని వెళ్లాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తియిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి జైలులో చిత్రహింసలు.. సూపర్ ఉమెన్‌తో అంబిక 60 లక్షల డీల్!