Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఉదయం కసరత్తులు చేస్తుంటాడు. అటుగా వెళ్తన్న అమ్మాయిలు దేవాని అలా చూస్తూ ఉంటారు. మిథున దేవా కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. దేవా కోపంగా చూస్తాడు. దేవాని ఇమిటేట్ చేస్తుంది. దూరం నుంచి ఓ అమ్మాయి దేవాని చూడటం చూసి చీర కొంగు అడ్డుగా పెట్టి ఆమెకు దేవా కనిపించకుండా చేస్తుంది. ఇక ఎదరుగా మరో అమ్మాయి కనిపించడంతో మీ పని చెప్తా అని చేయి చూపించి కిందకి వెళ్తుంది.
మిథున ఆ అమ్మాయిల దగ్గరకి వెళ్లి ఏంటి మా ఆయన్ను చూస్తున్నారు వెళ్లండి అని పంపేస్తుంది. తర్వాత దేవా బాడీ మీద తన చీర కొంగు కప్పుతుంది. ఏయ్ ఏం చేస్తున్నావ్ బుర్రందా నీకు అని దేవా మిథునని తిడతాడు. తర్వాత మిథున టవల్ తీసుకొచ్చి దేవా మీద కప్పుతుంది. జబ్బలు కనిపించేలా ఈ బట్టలు ఏంటి దిష్టి తగులుతుంది అని తెలీదా.. నీ కండల ప్రదర్శనకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీ ప్రదర్శన ఇంట్లో పెట్టుకో అని అంటుంది. నా మొగుడిని ఎవరైనా వంకర దృష్టితో చూస్తే నాకు మండిపోతుంది అంటుంది. నువ్వు నన్ను మొగుడు మొగుడు అంటే నాకు మండిపోతుంది అని దేవా అంటాడు.
దేవా పుషప్స్ చేస్తుంటే మిథున కావాలనే రెచ్చగొడుతుంది. వంద కేజీలు అయినా వీపు మీద పెట్టుకొని పుషప్స్ చేయగలను అని దేవా అంటే అంత సీన్ లేదు అని అంటుంది. కావాలనే దేవాని రెచ్చగొడుతుంది. నా ఇగో హర్ట్ చేశావ్ ఇంటిలోపల ఉన్న వంద కేజీల రైస్ బ్యాగ్ తీసుకో అప్పుడు నీ నోటికి తాళం వేస్తా అంటాడు. అంత అవసరం లేదు 50 కేజీల ఉన్న నన్ను ఎక్కించుకొని పుషప్స్ చేయ్ నీ సత్తా చూస్తా అని రెచ్చగొడుతుంది. దాంతో దేవా చేసి నీ నోరు మూయిస్తా వచ్చి కూర్చొ అంటాడు. మిథున దేవా వీపు మీద కూర్చొంటుంది.
దేవా పుషప్స్ చేస్తుంటే మిథున ఎంజాయ్ చేస్తుంది. కోతలు కూస్తావ్ కదా ఇప్పుడు ఏమంటావ్ అని దేవా అంటే నీ సత్తా నాకు తెలుసు మొగుడ్స్ కానీ నీ పొగరు అణచాలని ఇలా కావాలని నిన్ను రెచ్చగొట్టా అని అంటుంది. మిథున వెళ్లిపోగానే దేవా అమ్మ శాడిస్ట్ ఎంత ప్లాన్ చేశావే అనుకుంటాడు. ఇక కాలనీకి కొత్తగా వచ్చిన నేత్ర దేవాని టార్గెట్ ఫిక్స్ అనుకుంటుంది.
హరివర్దన్ ఫారన్ నుంచి ఇంటికి వచ్చి మిథునకు నల్లపూసల తంతు జరిపించారా అని లలితను ప్రశ్నిస్తాడు. ఆ రౌడీ వెధవతో ఫంక్షన్ చేయిస్తారా.. నా కూతుర్ని నేను ఎలా ఇంటికి తీసుకురావాలా అని నేను చూస్తే మీరు శాశ్వతంగా ఆ ఇంటికి కోడలిగా చేస్తారా అని అరుస్తాడు. త్రిపుర మనసులో మామయ్య గారికి చెప్పిన మేటర్ బాగానే బ్లాస్ట్ అవుతుంది అనుకుంటుంది. లలిత భర్తకి నచ్చచెప్పాలని ప్రయత్నిస్తే హరివర్దన్ లలిత మీద అరుస్తూ మాట్లాడే హక్కు కోల్పోయావు అని తిడతాడు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాకాబట్టి కొన్ని లిమిట్స్ దాటలేకపోయా ఇప్పుడు వృత్తిని పక్కన పెట్టి ఓ ఆడపిల్ల తండ్రిలా ఆలోచించి కేవలం వారం రోజుల్లో నా కూతుర్ని నా దగ్గరకు తెచ్చుకుంటా అంటాడు.
మిథున దేవా మీద కూర్చొన్న మూమెంట్స్ గుర్తు చేసుకొని మురిసిపోతూ టీ చేస్తుంది. ప్రమోదిని వచ్చి అబ్బో ఏంటి మీ ఆయనకు ఈ లవ్‌టీ అని మిథున మీద సెటైర్లు వేస్తుంది. దేవా టీ అడుగుతాడు. నేను ఇస్తే తీసుకోరు నువ్వు ఇవ్వు అక్క అని మిథున అంటే ప్రమోదిని తీసుకెళ్లి ఇస్తుంది. ఇప్పుడే అడిగాను కదా వదిన అంతలోనే తెచ్చావ్ అంటే తను ఆల్రెడీ పెట్టేసింది అని అంటుంది. తానా అని దేవా అంటే అదే నా కోసం పెట్టుకున్నా అని అంటుంది. దేవా ఇంకా ప్రశ్నలు వేస్తే మిథున చాటుగా చూస్తుంది. ఇచ్చినప్పుడు తాగేయాలి ప్రశ్నలు అడగకూడదు అంటుంది. ఇక టీ ఎలా ఉంది అని ప్రమోదిని అడిగితే సూపర్ అని దేవా అంటాడు. పొగిడేస్తాడు. మిథున ఎగిరి గెంతులేస్తుంది.
దేవా ప్రమోదినితో రోజూ పెట్టే టీకీ ఈ టీకీ తేడా ఉంది అంటాడు. మిథున ప్రమోదినిని సతాయిస్తే ప్రమోదిని మిథునని తీసుకొచ్చి బాబు నీ పొగడ్తలు అన్నీ తను చెప్పు తనే టీ చేసింది అంటుంది. దాంతో దేవా మిథున చేసిందా అనుకొని ఏం బాలేదు అంటాడు. బాగుంది అని చెప్పేశావులే అంటుంది. ఇక నేత్ర దేవా వాళ్ల ఇంటికి వస్తుంది. ఆపరేషన్ నేత్రలో మొదటి అడుగు అని ఎంట్రీ ఇస్తుంది. లోపలికి రావొచ్చా అని నేత్ర అడిగితే ఈ వయ్యారి ఏకంగా ఇంట్లోకి వచ్చేసిందేంటి అని కాంతం అనుకుంటుంది. రంగం వెళ్లి పిలిస్తే కాంతం నా కాపురం హారతి కర్పూరం అయిపోతుందని రంగాన్ని ఆపుతుంది.
నేత్ర తనో సాఫ్ట్ వేర్ అని ఇక్కడకు కొత్తగా వచ్చానని పరిచయం చేసుకొని మాస్టారు గురించి చాలా మంది గొప్పగా చెప్పారు మీ ఆశీర్వాదం గురించి వచ్చానని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక నేత్ర దేవాకి షేక్ హ్యాండ్ ఇచ్చి పేరు తెలుసుకుంటుంది. దేవాతో నేత్ర మాట్లాడటంతో మిథున ఉడికిపోయి తను షేక్ హ్యాండ్ ఇచ్చి దేవా వైఫ్ అని పరిచయం చేసుకుంటుంది. మిథునతో నేత్ర మీ భర్త చాలా హాండ్‌సమ్‌గా ఉన్నారని అంటుంది. మిథున ఉడికిపోతుంది. ఇక తన ఇంటికి సామాను వచ్చాయని ఎవరైనా సాయంగా వస్తే బాగున్ను కానీ నాకు ఎవరూ తెలీదు అంటుంది. రంగం ముందుకు వస్తే కాంతం ఆపేస్తుంది. దాంతో ఆనంద్‌ని వెళ్లమంటే పని ఉంది అంటాడు. దాంతో సత్యమూర్తి దేవాని పంపమని శారదతో చెప్తాడు. మిథున దేవాకి వెళ్లొద్దని సైగ చేస్తుంది. దేవా మిథునతో నువ్వు వద్దు అన్నావ్ కదా వెళ్తా అని నేత్రతో వెళ్తాడు. మిథున దగ్గరకు సూర్యకాంతం వచ్చి నాకు ఎందుకో భవిష్యత్‌లో పెద్ద సినిమా కనిపిస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?