గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
బాలుకి మీనా కారు గిఫ్ట్ గా ఇస్తుంది. ఇంటికి తీసుకొచ్చి అందరకీ చూపిస్తాడు బాలు. ఇంట్లో ప్రభావతి తప్ప అందరూ బాలు, మీనాకు కంగ్రాట్స్ చెపుతారు. అందరూ కారు వెనుక అమ్మ దీవెన అని రాసుకుంటే వీడుమాత్రం భార్య పేరు రాసుకున్నాడు అంటుంది. నీ దీవెనలు ఎక్కడున్నాయ్ శాపాలు తప్ప అని ఫైర్ అవుతాడు సత్యం. అమ్మలో సంతోషం లేదని బాధపడతాడు బాలు. తన సంగతి తెలిసిందే కదా అని సత్యం సర్ది చెబుతాడు. మీనాకు కాంప్లిమెంట్
అందరూ లోపలకు వెళ్లిపోయిన తర్వాత మీనాను పొగుడుతాడు సత్యం. వాడికి అమ్మప్రేమ లేని లోటు నువ్వు తీర్చుతున్నావు సంతోషంగా ఉందమ్మా అంటాడు సత్యం. అందరూ వాడిలో కోపాన్నే కానీ ప్రేమను చూడడం లేదు..నువ్వు మాత్రమే వాడిని అర్థం చేసుకున్నావని అంటాడు. నువ్వు వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తాడు
సంజయ్ టార్చర్
మౌనిక వ్రతం పూర్తిచేసి సంజయ్ కోసం ఎదురుచూస్తుంది. సంజయ్ రాగానే దీవించమని అడుగుతుంది. ఉపవాసం విరమిద్దాం అనుకునేలోగా కావాలనే నాన్ వెజ్ తినిపించే ప్రయత్నం చేస్తాడు సంజయ్.అక్షింతలు వేసినట్టే వేసి మౌనికను టార్చర్ చేస్తాడు. తల్లి వచ్చి అడ్డుకుని సంజయ్ కి క్లాస్ వేస్తుంది. మౌనిక ఏడుస్తుంది.
రోహిణికి వార్నింగ్
రోహిణి రూమ్ కి వెళుతుంది ప్రభావతి. నా గురించి మళ్లీ ఏం తెలిసిందో అనుకుంటుంది రోహిణి. ఈరోజు నీ మలేషియా వ్యవహారం ఏంటో తేల్చుకుందామని వచ్చానంటుంది ప్రభావతి. ఏం నాటకాలు ఆడుతున్నారా అందరూ కలసి? ఆకాశంలో చందమామను చూపి గోరుముద్దలు తినిపించాలి అనుకుంటున్నారా? అని ఫైర్ అవుతుంది. సడెన్ గా మా నాన్న ఎందుకు గుర్తొచ్చారని అడుగుతుంది రోహిణి. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థంకావడం లేదా...మీనా లెక్కెంత ఎలాంటి పేద ఇంటినుంచి వచ్చింది? పూలు అమ్ముకుని మొగుడికి కారు కొనిచ్చింది? రూపాయి రూపాయి పోగేసి, మాలలు అమ్మిన డబ్బు దాచింది, చదువుకోకుండానే భర్తకు కారు కొనిచ్చింది. నువ్వు అంతకు మించి చదువుకున్నావ్, గొప్పింటి నుంచి వచ్చావ్? తోడి కోడలు భర్త గురించి అంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్? పూలు అమ్మేదానికి ఉన్న తెలివితేటలు నీకు లేవా? పూలమ్మేదానికన్నా దిగువా అని ఫైర్ అవుతుంది? మాటల్లో కాదు చేతల్లో చూపించాలి అంటుంది ప్రభావతి.
వణికిపోతున్న రోహిణి
మనోజ్ ఒక్కజాబ్ కూడా సరిగా చేయడం లేదు, ఒక్క నెల జీతం అయినా తీసుకోకముందే వాళ్లే గెంటేస్తున్నారు, తను అయినా వచ్చేస్తున్నాడు అంటుంది. బాలు ఆటో నడపడం చూడలేక కారు కొనిచ్చింది? నీ భర్త ఉద్యోగం మానేసి ఉన్నప్పుడు నువ్వే వాడిని ముందుకు నడిపించాలి అంటుంది ప్రభావతి. మీనాన్నకు కాల్ చేయి అంటుంది . మానాన్న ఎక్కడున్నారో అంటుంది...ఎవడు ఎక్కడున్నా ఫోన్ వాడి జేబులోనే ఉంటుంది తీయ్ కాల్ చేయి అని ఫైర్ అవుతుంది. సరే అయితే మీ మావయ్యకు కాల్ చేయి అంటుంది. ఇప్పుడు మీటింగ్ లో ఉండి ఉంటాడు అంటుంది. ఎక్కడో మేక మాంసం వడ్డించుకుని తింటూ కూర్చుని ఉంటాడు అంటుంది. షాపుకి వెళ్లి నాకు చీర కొనేంత ఖాళీగా ఉన్న మనిషి నాకు ఫోన్లో దొరకడా అంటుంది. ఎన్నాళ్లని ఫోన్లో నిలదీస్తావ్..నా కొడుకు భవిష్యత్ కోసమే కాదు నీ కాపురం బావుండడం కోసం కూడా చెబుతున్నా..మనోజ్ కి బిజినెస్ పెట్టించాల్సిందే అదేదో తేల్చుకో అంటుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతోందని కన్నీళ్లు పెట్టుకుంటుంది రోహిణి.
కారు క్లీన్ చేసుకుంటున్న బాలు దగ్గరకు వచ్చి సరదాగా సెటైర్స్ వేస్తుంది మీనా. నాకోసం కారు కొని నాతోనే సెలెక్ట్ చేసి పూజ చేసేవరకూ చెప్పకుండా దాచింది అంత గొప్ప నాభార్య అంటాడు బాలు. పూలకొట్టు పెట్టి నాకు తెలియకుండా ఓపెన్ చేయించారు అంత గొప్ప నా భర్త అంటుంది మీనా. ఇద్దరూ ఒకర్నొకరు పొగుడుకుంటారు. ఈరోజు నువ్వు తినిపించు అని అడుగుతాడు బాలు. సరే అంటుంది మీనా..
మౌనికకు ఓదార్పు
మౌనికకు కాల్ చేస్తాడు బాలు. వదినకు నీకు శివకు నీకు గొడవ అయిందట కదా అంటుంది..ఎందుకులేమ్మా వాడిగురించి అనేస్తాడు. ఆ శివగాడు అని మౌనికతో చెప్పబోతుంటాడు..అంతలోనే ఆపేస్తాడు. మీనా కారుకొనిచ్చిన విషయం సంతోషంగా చెప్తాడు. ఇలాంటి భార్య ఉంటే ఎంతటి మూర్ఖుడు అయినా మారిపోతాడు అంటాడు. బంగారం కొనుక్కోకుండా నాకోసం కారు కొనిపెట్టింది. నా భర్త నా ఇల్లు అనుకుంది నన్ను వదిలిపెట్టి పోలేదు. దేనికైనా ఓర్పు కావాలి అంటాడు. కాల్ కట్ చేసిన తర్వాత మీనా ఆ మాటలు విని నన్ను ఇంతాబాగా అర్థం చేసుకున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఆ తర్వాత మౌనికా బ్యాగ్ తీసుకొచ్చిన సంజూ తల్లి ఈ నరకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోమని చెబుతుంది
గుండెనిండా గుడిగంటలు జూన్ 19 ఎపిసోడ్ లో... శ్రుతికి నల్లపూసలు గుచ్చడం గురించి మాట్లాడుతుంది ఆమె తల్లి. బాలుని రెచ్చగొట్టి ఆ కుటుంబంలో గొడవ పెట్టి శ్రుతి, రవి ఇంటికి వచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తుంది శ్రుతి తల్లి..