Brahmamudi Serial Today Episode:  పెళ్లి ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. ఇల్లంతా సందడిగా ఉంటుంది. రాజ్‌ మాత్రం ఒంటరిగా దూరంగా నిలబడి ఆలోచిస్తుంటాడు. ఇంతలో రాజ్‌ దగ్గరకు ఇందిరాదేవి, అపర్ణ వస్తారు.

ఇందిరాదేవి:  ఏంటి మనవడా నిశ్చితార్థం రింగ్‌ చూసుకుని సంబరపడిపోతున్నావా..?

రాజ్: మీకు కామెడీగా ఉందా నాన్నమ్మా

అపర్ణ: ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది ఈ నిర్ణయం తీసుకోక ముందు ఆలోచించాలి

రాజ్‌: కనకం గారు చెప్పినప్పటి నుంచి ఇంకా కంగారు పెరిగింది. ఆవిడేమో నాకు యామినికి రాసిపెట్టిలేదు. అందుకే అడ్డంకులు వస్తున్నాయి అంటుంది. కళావతి గారిని చేసుకోవడమే కరెక్టు అంటుంది

అపర్ణ: వాళ్లు వీళ్లు చెప్పడం కాదు. అసలు నీకు ఏమనిపిస్తుందో చెప్పు

రాజ్‌: ఈ పెళ్లి వద్దంటే యామిని ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు

వైదేహి:  అల్లుడు గారు ఏంటి అలా దూరంగా నిలబడ్డారు. వచ్చి యామినికి మెహందీ పెట్టు

ఇందిరాదేవి: వెళ్లు వెళ్లి మెహందీ అంట పెట్టు

రాజ్‌ దగ్గరకు వెళ్లగానే.. కావ్య వస్తుంది. కావ్యను చూసి రాజ్‌ అలాగే నిలబడిపోతాడు. వైదేహి బలవంతంగా రాజ్‌ను యామిని పక్కన కూర్చోబెడుతుంది.

అపర్ణ: ఏంటి అప్పు  ఏదో ప్లాన్‌ చేశావు అసలు మెహందీ పెట్టుకోవడానికి ఆ యామిని రాదన్నావు

అప్పు: వచ్చినా కూడా పెట్టించుకోవాలి కదా అత్తయ్యా.. ఏం జరుగుతుందో మీరే చూడండి

కానిస్టేబుల్‌ రౌడీని తీసుకుని యామిని ఇంటికి వస్తాడు. బయలే నిలబడి రౌడీ చేత యామినికి ఫోన్‌ చేయిస్తాడు. యామిని భయపడుతూ కాల్‌ లిఫ్ట్ చేస్తుంది.

రౌడీ: మేడం బెయిల్‌ మీద పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చేశాను. నాకు రెండు రోజుల టైం ఉంది. నేను కనక ఇప్పుడు దేశం వదిలి వెళ్లకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు. దానికి మీరే హెల్ప్‌ చేయాలి

యామిని:  ఓ అవునా నాకు మ్యారేజ్‌ ఫిక్స్‌ అయింది. రేపే నా పెళ్లి ఆ హడావిడిలో ఉన్నాను. నేను తర్వాత ఫోన్‌ చేయోచ్చా

రౌడీ:  నేను పారిపోవడానికి నాకు ఈ ఒక్కరోజే టైం ఉందంటే మీరు పెళ్లి అంటారేంటి..? మళ్లీ నేను రేపు స్టేషన్‌కు వెళ్లాలి. మీ కోసం మీ ఇంటి బయటే నేను వెయిట్‌ చేస్తున్నాను. మీరు వస్తే సెటిల్‌ చేసుకుందాం. లేకపోతే మళ్లీ స్టేషన్‌కు వెళితే నా  చేత ఆ పనులు చేయించింది మీరే అని నేను కోర్టులో చెప్పాల్సి వస్తుంది. మీ కోసం ఐదు నిమిషాలు వెయిట్‌ చేస్తాను

యామిని:  అవునా నేను వస్తున్నాను

వైదేహి: ఏమైంది యామిని

యామిని: మా ఫ్రెండ్‌కు ఏదో ప్రాబ్లమ్‌ వచ్చిందట నన్ను రమ్మంటుంది నేను వెళ్లి వెంటనే వస్తాను అమ్మా

ధాన్యం: బాగుంది యామిని కనీసం  ఈ మెహందీ ఒక్కటైనా సరిగ్గా జరుగుతుంది అనుకున్నాను. ఈ లోపల నువ్వే చెడగొట్టుకునేలా ఉన్నావు

ప్రకాష్‌: మా వాడు మెహందీ పెట్టడానికి రెడీ అయిపోయాడు ఈ టైంలో ఇంతకంటే ముఖ్యమైన పనేంటి..?

వైదేహి: అవును బేబీ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం.. ముందు మెహందీ కానివ్వు

యామిని: ఇంపార్టెంట్‌ పని అని చెప్పాను కదా మమ్మీ

ఇందిరాదేవి: ఆ పనేంటో మాకు చెప్పి వెళ్లు యామిని

కనకం: మాకు చెప్పకపోతే పోయావు. కనీసం నీకు కాబోయే మొగుడికైనా చెప్పమ్మా పెళ్లి చేసుకునే వాళ్ల మధ్య సీక్రెట్స్‌ ఉండకూడదు కదా

అంటూ కనకం చెప్పగానే అందిరినీ తిట్టి యామిని బయటకు వెళ్లి రౌడీని బెదిరించాలని చూస్తుంది. కానీ వాడే యామిని బ్లాక్‌ మెయిల్ చేస్తాడు. కోటి రూపాయలు ఇస్తే తాను దేశం వదిలివెళ్లిపోతానని చెప్తాడు. చాటు నుంచి కళ్యాణ్‌, అప్పు వింటుంటారు. ఇంతలో వైదేహి రావడంతో యామిని రౌడీకి సరేనని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడకు రాహుల్‌, రుద్రాణి వస్తారు. వారి వెనకాలే వచ్చిన స్వప్న కళ్యాణ్‌ వాళ్లకు రుద్రాణి, రాహుల్ తప్పించుకుని వచ్చారని చెప్తుంది. తర్వాత రుద్రాణిని యామిని తిడుతుంది. ఇప్పుడా వచ్చేది అంటూ అరుస్తుంది. మరోవైపు బ్యూటిఫుల్‌గా రెడీ అయిన కావ్యను చూసి స్వప్న అనుమానిస్తుంది. రాజ్‌కు పెళ్లి జరుగుతుంటే నీకు బాధగా లేదా అని అడుగుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రాజ్‌ కూడా కావ్యను అదే అడుగుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!