Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఫైల్స్ తీసుకెళ్తూ మిధున తనని ముప్పుతిప్పలు పెట్టడం గుర్తు చేసుకొని అసలు నువ్వు మా ఇంట్లో ఎలా ఉంటావో చూస్తాను అనుకుంటాడు. మిధున ఇంట్లో గిన్నెలు తోముటుంటుంది. శారద చూసి అంత గొప్పింటి బిడ్డ ఇలాంటి పనులు చేస్తుందా అన్నట్లు జాలిగా చూస్తుంది. ఇంతలో మిధున దగ్గరకు ఇద్దరు తోటికోడళ్లు వస్తారు.

సూర్య కాంతం మిధునను గోడకు పట్టిన బల్లి, జలగ ఇంటిని వదిలి వెళ్లడం లేదని సెటైర్లు వేస్తుంది. డాక్యుమెంట్లు దాచిపెట్టి దేవాని ఇంటికి రప్పించుకొని భలే నాటకం ఆడావు నీది మామూలు బుర్ర కాదని దెప్పిపొడుస్తుంది. ప్రమోదిని సూర్యకాంతంలో ఏం అనొద్దని చెప్పినా సూర్య కాంతం వినదు. మిధున కూడా రెండో తోటి కోడలికి ఇచ్చి పడేస్తుంది. 

సూర్యకాంతం: గిన్నెలు బండకేసి బాదినట్లు తోముతున్నావ్ మిధున మేడం. కొన్ని అంతే లేమ్మా ఎంత తోమినా అడుగు అంటిన మాడు. ఎంత చెప్పినా మిధున ఇంటి నుంచి పోవమ్మా మహా మొండి ఘటాలు. మిధున: ఏం చేస్తాం సూర్యకాంతం అక్క ఎంత తోమినా కొన్ని జిడ్డులు పోవు. ఎంత చెప్పినా కొన్ని నోళ్లు మూత పడవు మహా మొండి జిడ్డులు అక్క.సూర్యకాంతం: ఓ మై అమ్మమ్మో.. పోవే కుక్క అంటే అలాగే అక్క అన్నట్లు ఈ సూర్యకాంతాన్ని అంత మాట అంటావా.ప్రమోదిని: మిధున ఏంటమ్మా నువ్వు హాయిగా ఇంటికి వెళ్లావు కదా అక్కడుండకుండా మళ్లీ ఎందుకు వచ్చావు. ఇది నీ స్థాయికి సరిపోయే ఇళ్లు కాదమ్మా. మళ్లీ ఎందుకు వచ్చావు.మిధున: మూడు ముళ్లు కోసం అక్కా. ఎవరు ఎన్ని తిట్టినా ఎన్ని మాటలు అన్నా భరిస్తాను. సూర్యకాంతం: నాపరాయి బండ ఏం అనుకోవా. కాంతం మాటలకు మిధున తోమిన నీరు పడేస్తుంది. కాంతం ప్రశ్నిస్తే తోముతున్నా అని తెలిసి కూడా ఇక్కడే ఉన్నావు ఇక్కడికి రాకూడదు అన్న సెన్స్ లేకపోతే ఎలా అని మిధున అడుగుతుంది. దానికి కాంతం పురుషోత్తం అన్న డాక్యుమెంట్లు దాచి ఆడుకున్నావ్ నీకు ఉంటుంది చూడు అని చెప్తుంది.

కాంతం మాటలకు మిధున సీరియస్‌గా చూస్తుంది. చూపులతో చంపేస్తావా అని సూర్యకాంతం గొడవ పెట్టుకోబోతే ప్రమోదిని కాంతాన్ని తీసుకెళ్లిపోతుంది. ఇక దేవా  వెళ్తుంటే పురుషోత్తం అన్న ఫోన్ చేసి మరి డాక్యుమెంట్లు తీసుకెళ్లకులే ఇది ఎంత ముఖ్యమైనదో చెప్పాను.. నువ్వు నా నమ్మిన బంటు మరి నా రాజకీయ భవిష్యత్‌కి సపోర్ట్ చేయకుపోతే ఎలా అని అడిగితే దానికి దేవా ఈ తమ్ముడి మీద భరోసా ఉంచు అన్న నేను ఆఫీసర్‌తో మాట్లాడుతాను అని అంటాడు.  

సత్యమూర్తి మిధునని చూసి భార్యని పిలిచి ఈ అమ్మాయి మళ్లీ ఎందుకు వచ్చింది ఎవరు లోపలికి రానిచ్చారు అంటే ఇది నా ఇళ్లు కోడలిగా నా ఇంటికి నేను వచ్చానని అంటుంది. నువ్వు తెలివైన దానివో చదుకున్న మూర్ఖురాలివో తెలీదని.. రౌడీని భర్తగా అనుకోవడం అసహ్యంగా లేదా అంటే లేదని రౌడీలా ఉన్న వాడిలోనూ మంచి ఉంటుందని మామతో వాదిస్తుంది. దాంతో మూర్ఖులతో వాదించలేం అని సత్యమూర్తి అంటాడు. ఇళ్లు తాకట్టు పెట్టి నీ డబ్బు ఇచ్చేస్తాను అంటాడు. వద్దని మిధున అంటే పరాయి వాళ్ల డబ్బు నాకు అవసరం లేదని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు డాక్యుమెంట్ల పని పూర్తయిపోయావని దేవా పురుషోత్తానికి చెప్తాడు. ఈ తమ్ముడు ఉండగా నీకు తిరుగే లేదని అంటాడు. దాంతో పురుషోత్తం నువ్వు నాకు నమ్మకస్తుడవే కాదు నా సొంత తమ్ముడివి అని అంటాడు. మిధున అంతు చూస్తానని దేవా ఇంటికి బయల్దేరుతాడు. మరోవైపు ప్రమోదిని భర్తతో మిధున మొండిదే అనుకుంటే ఈ రోజుతో తెలివైనది అని తేలిపోయిందని భర్తతో చెప్తుంది. ఇప్పుడు మరి ఇంటి నుంచి వెళ్లదని వీలైనంత త్వరగా దేవాని తన వైపు తిప్పుకుంటుందని అంటే ప్రమోదిని భర్త అది జరగదు అంటాడు. పురుషోత్తంతో పెట్టుకోవడం వల్ల మిధునకు ప్రమాదం అంటాడు. 

భాను ఆటో తుడుస్తుంటే తల్లి వచ్చి దేవా మిధునని తీసుకొచ్చాడని దాన్ని పెళ్లాంలానే చూస్తున్నాడని దేవాని మర్చిపో అని భానుతో చెప్తుంది. భాను రగిలిపోతుంది. మిధున అంతు చూడాలని ఆవేశంగా వెళ్తుంది. మిధున బాలుతో ఆడుకుంటే ఎందుకు వచ్చావే అని అడుగుతుంది. మా ఆయనే తీసుకొచ్చారని మిధున చెప్తుంది. శారద వచ్చి గొడవ పడొద్దని చెప్తే భాను శారదతో నా గోడు నీకు కనిపించడం లేదా అత్త అంటుంది. ఇంతలో దేవా వచ్చి మిధున అని అరుస్తాడు. మిధున చప్పట్లు కొట్టి సైగ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!