Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న వెళ్లిపోతుంటే దీప ఆపుతుంది. నీకు పెళ్లి సంబంధం రావడం సంతోషంగా ఉంది.. సుమిత్రమ్మను బాధ పెట్టకుండా పెళ్లి చేసుకో అని చెప్తుంది. దానికి జ్యోత్స్న అయితే నీ భర్తని ఇచ్చేయ్ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను అంటుంది.
దీప: కొందరికి ఎవరైనా చెప్తే జ్ఞానోదయం అవుతుంది. మరి కొందరికి అనుభవంతో జ్ఞానోదయం అవుతుంది. నీకు అనుభవిస్తే కానీ తెలియదులే.
జ్యోత్స్న: నా జీవితం గురించి నువ్వు వర్రీ అవ్వకు దీప. నా జీవితం నీ వల్లే అన్యాయం అయిపోయింది. వదిలి పెట్టను దీప. నిన్ను అంత తేలికగా వదిలిపెట్టను. అవమానించిందే కాకుండా చేతిలో స్వీట్ పెట్టారు.
సుమిత్ర: మీరు చెప్పిందే బాగుంది మామయ్య గారు.
దశరథ్: వద్దు సుమిత్ర.
పారిజాతం: ఎందుకు వద్దు. జ్యోత్స్న ఇక్కడే ఉంటే ఆ కార్తీక్ గురించే 24 గంటలూ ఆలోచిస్తుంది. పోనీ కంపెనీలో ఏమైనా పొడుస్తుందా అంటే అక్కడా నష్టాలే. మనం చూసిన సంబంధం చేసుకుంటుంది అంటే ఏం చేసిందో చూసింది కదా. అది ఇక ఇండియాలో వద్దు. అమెరికా పంపేయండి.
దశరథ్: మనసులో దాసు కోలుకునే వరకు జ్యోత్స్న ఇక్కడే ఉండాలి.
శివన్నారాయణ: అవన్నీ కాదు కానీ మీ భార్య భర్తలు ఏమంటారో చెప్పండి.
దశరథ్: వద్దు నాన్న జ్యోత్స్న ఇక్కడే ఉండని.
సుమిత్ర: అది కాదు అండీ.
దశరథ్: మనం ఉంటేనే అది ఇలా ఉంటే మనం లేకపోతే ఇంకెలా ఉంటుందో. కొంత టైం ఇచ్చి నచ్చచెప్పి దానికి పెళ్లికి ఒప్పిద్దాం.
శివన్నారాయణ: మేం నీకు శత్రువులం కాదు. మీ అమ్మకి మాట ఇచ్చాను నేను చచ్చేలోపు నీ పెళ్లి చేస్తా.
జ్యోత్స్న: నేను చచ్చినా చేసుకోను.
శివన్నారాయణ: నీ పెళ్లి చేసే నేను చస్తాను.
జ్యోత్స్న: నేను నీ మనవరాలిని నాది నీ పంతమే నేను చేసుకోను.
సుమిత్ర: జ్యోత్స్న మీ తాతయ్య పంతం మీ అత్తని దూరం చేస్తే నీ పంతం నీ జీవితాన్ని నాశనం చేస్తుందే అర్థం చేసుకో. పెళ్లి సంబంధం చూస్తాం చేసుకో. చేసుకోని తీరాలి అంటే.. నీ మాట ఇక ఈ ఇంట్లో చెల్లదు. నీకు ఉన్న దారి ఒక్కటే తల దించుకొని తాళి కట్టించుకోవడమే.
దశరథ్: జ్యోత్స్న ఇలా.. చూడమ్మా ఈ లోకంలో మనల్ని నిశ్వార్థంగా ప్రేమించేది తల్లిదండ్రులే మా నాన్న నన్ను ఎలా ప్రేమిస్తాడో నేను నిన్ను అలాగే ప్రేమిస్తా. నీ తప్పులను క్షమించి సరిదిద్దాలి అనుకుంటా. పోనీ నీ పెళ్లి ఇప్పుడు వాయిదా వేశామో అనుకో అప్పుడేం జరుగుతుంది ఏం జరగదు ఇప్పుడులానే గొడవ అవుతుంది అంతే ఇంకే మార్పు ఉండదు.
జ్యోత్స్న: ఒకే డాడీ నాకు కొంత టైం కావాలి.
దశరథ్: సరే నీకు కొంత టైం ఇస్తాం. దానికి డెడ్ లైన్ ఉండాలి కదా. దాసు పూర్తిగా కోలుకునే వరకు. మనసులో దాసు చెప్పే నిజం తెలిస్తే కానీ జ్యోత్స్న విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి.
పారిజాతం: దాసు ఎందుకు దశరథా..
దశరథ్: అంటే తమ్ముడు లేకుండా నా కూతురి పెళ్లి ఎలా అని .
పారు: నీకు వాడు అంటే ఎంత ఇష్టం. కానీ వాడిని కొట్టిన వాడు ఎవడో కానీ వాడి కాళ్లు విరిగిపోవాలి. లారీ గుద్దేయాలి.
దశరథ్: పిన్ని వాడు వాడు అంటున్నావ్ కొట్టింది ఆడవాళ్లు అయింటే..
జ్యోత్స్న: నో డౌట్ డాడీకి నా గురించి నిజం తెలిసిపోయింది.
దశరథ్: ఇక ఎన్నాళ్లో జ్యోత్స్న నా నుంచి తప్పించుకోలేదు.
దీప జ్యోత్స్న గురించి ఆలోచిస్తుంటుంది. తన వల్లే జ్యోత్స్న జీవితం నాశనం అయిందన్న మాటలు తలచుకొని బాధ పడుతుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి సత్యరాజ్‌కి రెస్టారెంట్ గురించి చెప్పానని సంతోషం మాట్లాడితే దీప డల్‌గా ఉంటుంది. కార్తీక్ చూసి జ్యోత్స్న గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. మీ అమ్మకి మేనకోడలు అంటే చాలా ఇష్టం అలాంటి ఆమె తను జ్యోత్స్నని తిట్టింది. జ్యోత్స్నది ఉడికిపోయే తనం.. తను కోరుకున్నది తనకి దక్కాలి అంతే అంటాడు. జ్యోత్స్న మిమల్ని కోరుకుంటుందని దీప అంటే దానికి కార్తీక్ నీ కూతురిని ఎవరైనా అడిగితే ఇస్తావా ఇవ్వవు కదా మరి నీ భర్తని ఎలా ఇస్తావు దీప అంటాడు. ఇక కార్తీక్ జ్యోత్స్నను పక్కన కూర్చొపెట్టుకోవడానికి చేయి పట్టుకుంటే దీప కార్తీక్ మీద పడిపోతుంది. దీప ఇబ్బంది పడితే భర్త మీదే పడ్డావు కదా ఏం కాదులే అంటాడు.
కార్తీక్ దీపని పక్కన కూర్చొపెట్టుకొని చేయి నొప్పిగా ఉంది నొక్కమంటాడు. దీప కార్తీక్ చేయి ఒత్తుతూ మైకంలో ఉండిపోతుంది. కార్తీక్‌ని తాకుతూ ఉంటే కార్తీక్ దీపని అలా చూస్తాడు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. మన ఇద్దరం మన గురించి ఆలోచించుకోవాలని అంటాడు. మనల్ని అవమానించి అందరికీ సమాధానం చెప్పినట్లు మనం గెలివాలి అని కార్తీక్ అంటే దీప మనసులో మనం గెలుస్తాం కార్తీక్ బాబు శౌర్యకి మీరు ఉన్నారు మీకు నేను ఉన్నాను అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!