Ammayi garu Serial Today Episode దీపక్‌ మందారానికి విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తే ఆ ప్లాన్‌ని రూప రాజులు తిప్పికొడతారు. దీపక్ ప్లాన్ పసిగట్టేసిన రూప రాజుతో చెప్పడంతో రాజు దీపక్‌ని ఫాలో అయి లాయర్‌తో విషయం చెప్పి మందారం ప్లేస్‌లో మౌనిక పేరు రాయిస్తాడు. ఆ లాయర్ నోటీసు ఇంటికి రావడంతో సూర్య ప్రతాప్ చూసి దీపక్, మౌనికలు మంచి నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకుంటారు. దీపక్ పక్షవాతం వచ్చినట్లు నటిస్తే రాజు బాబా గెటప్‌లో వచ్చి చితక్కొట్టిస్తాడు. 


రూప విజయాంబిక వాళ్లతో మాట్లాడుతుంటే మౌనిక తన సంతకం ఎలా వచ్చిందని అడుతుంది. దాంతో రూప మీర పాస్ పోర్ట్ వీసాల కోసం సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లు దొరికాయని చెప్పడంతో ముగ్గురు బిత్తరపోతారు. ఆ డాక్యుమెంట్లలోనే విడాకుల అప్లికేషన్ పెట్టేస్తుంది. రూప దాంతో తెలీకుండా మౌనిక, దీపక్‌లు సంతకాలు పెట్టేస్తారు. రూప ఆ విషయాలు చెప్పడంతో ముగ్గురు తల పట్టుకుంటారు. మోసం చేశావని నేను మీ నాన్నకి చెప్తాను అంటే రూప చెప్పమని అంటుంది. మందారానికి మీరు చేసిన ద్రోహం నేను చెప్తే మా నాన్న వినరు మీరు చెప్తే చెప్పు తీసుకొని కొడతారు అంటుంది. ఇక విడాకులు వస్తున్నాయి కాబట్టి విడాకులు తీసుకోండి కోర్టులో మీకు వేరే దారి లేదని అంటుంది. రూప వెళ్లిపోయిన తర్వాత మౌనిక దీపక్‌ వల్లే ఇదంతా జరిగిందని అరుస్తుంది. ఇప్పుడు తప్పించుకోవడానికి తనకు పక్షవాతం వచ్చినట్లు నటిస్తాను అని విజయాంబిక అంటే అది వర్క్ అవుట్ అవ్వదని తాను ఆ యాక్టింగ్ చేస్తానని అప్పుడు కోర్టుకు వెళ్లడం కుదరదని అంటాడు. 


దీపక్ పక్షవాతం ఇచ్చినట్లు పడిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు. రూప అది డ్రామా అని కనిపెట్టేస్తుంది. మందారం భర్త కోసం ఏడుస్తుంది. విజయాంబిక యాక్టింగ్ మొదలు పెడుతుంది. సడెన్‌గా ఇలా అయిందని అంటుంది. రూప మందారానికి ధైర్యం చెప్తుంది. రేపు కోర్టుకి వెళ్తాడులే నీకు న్యాయం చేస్తాడులే అంటుంది. ఇప్పుడు కోర్టు విషయం అవసరమా అని సూర్య ప్రతాప్ రూపని తిడతాడు. చంద్ర డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్ చూసి ఇప్పుడేం తెలీడం లేదని స్కాన్‌లు తీయాలని అంటారు.  ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని అంటాడు. దీపక్ మ్యానేజ్ చేమమని తల్లికి సైగ చేస్తాడు. విశ్వరూపం చూపిస్తాను అని మొదట్లోనే దొరికిపోయాడని అనుకుంటుంది. డాక్టర్ పవర్ ఫుల్ డోస్ ఇస్తున్నాను అని ఇంజక్షన్ ఇస్తాడు. దాంతో కోలుకోకపోతే ఇక అంతే అంటాడు. నయం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. ఈ లోపు మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు. విజయాంబిక ఏడుస్తుంటే రూప తండ్రితో మామయ్యతో చెప్తే బెటర్ అని అంటుంది. దీంతో సూర్యప్రతాప్ అక్కకి ధైర్యం చెప్పి బావని పిలుస్తానని అంటారు. దీంతో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


 Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!