Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మిత్ర చాలా టెన్షన్ పడతాడు. మనీషా మిత్ర పిల్లలతో స్కూల్‌కి వెళ్లకుండా తనతో గడపాలి అని ప్లాన్ చేస్తుంది. దేవయాని మిత్రని భయపెట్టాలని అందరి దగ్గరకు వెళ్లి మనీషాకి ఏమైందో ఏంటో ఒట్టి మనిషి కూడా కాదు.. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని దొంగ ఏడుపు ఏడుస్తుంది.
లక్ష్మీ టైం అయింది స్కూల్‌కి వెళ్దామని మిత్రతో అంటే మిత్ర మాత్రం మనీషా గురించి ముందు తెలియాలి అంటాడు. వివేక్‌ని బీచ్‌కి వెళ్లి వెతకమని చెప్పి తాను మరోవైపు వెతుకుతా అంటాడు. ఇంతలో జయదేవ్ వచ్చి అవసరం లేదని మనీషా తన అంకుల్ వాళ్ల ఇంటికి వెళ్లిందని చెప్తారు. మీకు ఎలా తెలుసు అని లక్ష్మీ అడిగితే మనీషా ఉదయం వెళ్లినప్పుడు చూశానని అంటారు. మనీషా అంకుల్‌కి కాల్ చేయమని చెప్తే మిత్ర నెంబరు లేదని అంటాడు. దాంతో జయదేవ్ దేవయానికి కాల్ చేయమంటాడు. మిత్ర మనీషాతో మాట్లాడి అక్కడే ఉండమని తాను పిల్లలను తీసుకొని స్కూల్‌కి వెళ్తారు. తన ప్లాన్ వేస్ట్ అయిపోయిందని మనీషా అనుకుంటుంది. జయదేవ్, రాజేశ్వరి దేవిలు మనీషాకు సపోర్ట్ చేయొద్దని దేవయానికి క్లాస్ ఇస్తారు.
స్కూల్‌లో పిల్లలకు రన్నింగ్ పోటీలు అవుతాయి. లక్ష్మీ జున్ను దగ్గరకు వెళ్లి మీ నాన్న కళ్లలో ఆనందం చూడాలి నువ్వే ఫస్ట్ రావాలి అని అంటుంది. జున్ను ముందు రోజుకు గొడవ పడిన అబ్బాయి జున్నుని పరుగు పందెంలో ఓడిస్తా అని చెప్పి చేతిలో ఇసుక పట్టుకుంటాడు. రన్నింగ్ పోటీ మొదలవుతుంది. మరోవైపు మనీషా అంకుల్‌తో కలిసి హాస్పిటల్‌కి వెళ్లి తన ప్లాన్ కోసం అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఓకే అంటే మిత్రకు అంకుల్ కాల్ చేస్తారని డాక్టర్‌తో మనీషా చెప్తుంది. డాక్టర్ ఓకే అంటుంది. ఇక పరుగు పందెంలో జున్ను కంట్లో మరో బాబు ఇసుక వేస్తాడు. జున్ను ఆగిపోతాడు. దాంతో లక్కీ రుమాలులో నీరు వేసి జున్నుకి విసురుతుంది. దాంతో జున్ను కళ్లు తుడుచుకొని రన్నింగ్‌లో ఫస్ట్ వస్తాడు. ఇక మనీషా అంకుల్ మిత్రకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో కంటిన్యూగా కాల్ చేయమంటుంది. మరోవైపు వివేక్‌కి ఓ కాల్ రావడంతో పక్కకు వెళ్తాడు.
మిత్ర కాల్ లిఫ్ట్ చేసి షాక్ అయి అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక వివేక్‌కి స్కూల్‌లో డాక్టర్ కనిపిస్తారు. వివేక్ మాట్లాడుతూ ఉంటే జాను చూస్తుంది. మూడు నెలలు జాగ్రత్తగా ఉండమని జానుకి డౌట్ రాకుండా చూసుకోమని వివేక్‌కి చెప్పడం జాను వింటుంది. డాక్టర్‌ని నిలదీయాలి అనుకుంటుంది. ఇక మనీషా డాక్టర్‌తో ఎవరు నిలదీసినా విషయం బయటకు రాకూడదని అంటుంది. మిత్ర రావడంతో డాక్టర్ అంకుల్ ప్లాన్ అమలు చేద్దామని అంటారు. మిత్రని చూసి అంకుల్ డాక్టర్ కాళ్లు పట్టుకొని మనీషా చెప్పినట్లే చేయండి అని బతిమాలుతాడు. ఏమైందని అడుగుతాడు. డాక్టర్ మిత్రతో మీరు వీళ్లకి చెప్పండి చూసి చూసి రెండు ప్రాణాలు ఎలా తీయాలి ఇలా చేయడం వల్ల మనీషా ప్రాణాలు కూడా పోతాయిని అంటుంది.
మనీషా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది కుదరలేదు ఇప్పుడు నీ బిడ్డని చంపుకోవాలని అనుకుంటుందని మిత్రతో చెప్తారు. ఇంతలో మనీషా మెలకువ వచ్చినట్లు నటించి అబార్షన్ చేసేశారా అని అడుగుతుంది. మిత్ర లోపలికి వచ్చి మనీషాని తిడతాడు. మిత్ర నీ సమస్యకి పరిష్కారం చూపాలని అంకుల్ అంటే.. దానికి మనీషా మిత్ర నాకు నా కంటే నీ పరువు ముఖ్యం అని అంటుంది. నా వల్ల నువ్వు తల దించుకోకూడదు అందుకే అబార్షన్ చేసుకుంటా అని అంటుంది. మిత్రకు నేనే ప్రాబ్లమ్ అవుతున్నా నా జీవితం ముగించేస్తా అని అబార్షన్ చేయించమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!