Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున కనిపించకపోయే సరికి దేవా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తాడు. మిథున నీకు ఏమవుతుందని పోలీస్ అధికారిణి (బిగ్‌బాస్ యష్మీ) అడుగుతుంది. లవ్‌ మ్యారేజ్‌నా అరేంజ్‌డ్ మ్యారేజ్‌నా అని అడిగితే దేవా గుడిలో పెళ్లి అయిందని అంటాడు. దేవా డిటైల్స్ అన్నీ అపర్ణ తెలుసుకుంటుంది. కంప్లైంట్ తీసుకుంటుంది. నిన్నే వచ్చి ఈరోజే మిస్ అయింది అంటే తేల్చుకోవాల్సిన విషయమే అని అంటుంది. 

దేవా అపర్ణతో తను చాలా మంచిది  మేడం. తన గురించి ఎంత వెతికినా ఏ క్లూ దొరకలేదని అందరం తన గురించి చాలా టెన్షన్ పడుతున్నామని ఎలా అయినా వెతకమని అంటాడు. అతి త్వరలోనే తనని వెతికి పడతామని నీ పని మీదే ఉంటానని అపర్ణ అంటుంది. దేవాని పంపిన తర్వాత ఇతని మాటల్లో ఏదో తేడాగా ఉంది ఎంక్వైరీ దేవా దగ్గర నుంచే తేల్చాలని అనుకుంటుంది. 

సూర్యకాంతం త్రిపురకు ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అడుక్కు తింటావని మెసేజ్ చేస్తుంది. త్రిపుర కాల్ లిఫ్ట్ చేస్తుంది. కాంతం త్రిపురకు డబ్బు డిమాండ్ చేసి ఓ నిజం చెప్తానని మిథున మిస్ అయింది అని ఊరంతా వెతికినా కనిపించడం లేదని అంటుంది. తను చెప్పిన మేటర్‌కి ఎన్ని కోట్లు ఇస్తారని అడుగుతుంది. త్రిపుర చాలా కంగారు పడుతుంది. మామయ్య గారు అనుకుంటూ లోపలికి పరుగులు తీసి అందరికీ విషయం చెప్తుంది. దేవాని తీసుకొని నానమ్మ ఊరు వెళ్లింది మిస్ అయిందని చెప్పడంతో హరివర్దన్ టెన్షన్‌ పడతాడు. లలిత మిథున మిస్ అవ్వదు అని చెప్పడంతో త్రిపుర కోపంగా అందుకేనా ఆ మాస్టారు ఫ్యామిలీ మొత్తం హడావుడిగా ఆ ఊరు వెళ్లారు అని అడుగుతుంది. 

లలిత వెంటనే వియ్యపురాలికి కాల్ చేస్తుంది. శారద మిథున కనిపించడం లేదని చెప్పడంతో షాక్ అయిపోతుంది. హరివర్దన్ కుప్పకూలిపోతాడు. ఇదంతా ఆ రౌడీ గాడు దేవా చేశాడని మిథున మన ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తుందని ఛాలెంజ్‌లో ఓడిపోయి ఇంటికి వచ్చేస్తుందని ఆ రౌడీగాడే ఇలా చేసుంటాడని నా కూతురికి ఏమైనా అయితే ఆ రౌడీ గాడిని వాడి కుటుంబాన్ని వదను అంటాడు. త్రిపుర వెంటనే ఊరు వెళ్లి మిథున కోసం వెతుకుదామని అంటుంది. 

దేవా మిథున కోసం రోడ్లంతా తిరుగుతూ ఉంటాడు మిథున నీకు ఏమైనా అవుతుందని అనే ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నా అని అనుకుంటాడు. ఇంతలో ఆటోలో ఎవరో మిథునలా ఉంటే పరుగులు తీస్తాడు. చాలా దూరం పరుగులు తీసిన తర్వాత మిథున కాదని తెలిసి రోడ్డు మీదే ఓ మూలన కూలబడి పోతాడు. అప్పుడే అటుగా వచ్చిన దేవా తండ్రి సత్యమూర్తి చూసి కొడుకు దగ్గరకు వెళ్లి కొడుకుకు చేయి అందిస్తాడు. దేవా షాక్ అయిపోతాడు. తండ్రి చేయి అందుకొని వెనకాలే వెళ్లి స్కూటీ ఎక్కుతాడు. మనసులో నాన్న ఇప్పుడు సంతోషపడాలో బాధ పడాలో అర్థం కావడం లేదు అనుకుంటాడు. 

మిథున కనిపించడం లేదని కాంతం డ్యాన్స్ చేస్తుంది. పని మనిషి కూడా మిథున గారు కనిపించడం లేదని బాగా సంతోషంగా ఉన్నారు కదా అని కాంతంతో కలిసి చిందులు వేస్తుంది. బేబీ చూడటంతో కాంతం నాటకం మొదలు పెడుతుంది. మిథున కనిపించడం లేదని ఏడుస్తున్నా అంటుంది. బేబీ కాంతాన్ని వాయించి చితక్కొడతానని అంటుంది. కాంతం ఎప్పటిలా దులిపేసుకొని చిందులేస్తుంది.

హరివర్దన్ ఫ్యామిలీతో పాటు బేబీ ఇంటికి వస్తాడు. రావడం రావడమే గేట్ తన్ని దేవా అని అరుస్తాడు. దేవా ఎక్కడా అని అడిగితే దేవా లేడని  మిథునని వెతకడానికి వెళ్లాడని సత్యమూర్తి చెప్తే ఏంటి వాడు నా కూతుర్ని వెతకడానికి వెళ్లాడా నా కూతురు కనిపించకుండా ఉండటానికి కారణమే వాడు నువ్వు ఓ మాస్టారు అయి పనికిమాలిన రౌడీ కొడుకుని వెనకేసుకురావడానికి సిగ్గు లేదా అని సత్యమూర్తి కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. మిమల్ని ఇలా షర్టు పట్టుకొని ఓరేయ అనడం ఏంటి అండీ సంస్కారం లేకుండా అని అంటుంది. దానికి హరివర్దన్ మీ పెంపకానికి మీకు సిగ్గు పడాలి. బంగారం లాంటి నా కూతురి మెడలో తాళి కట్టి దాని జీవితం నాశనం చేశాడని కోప్పడతాడు. ఇంతలో దేవా వస్తాడు. 

హరివర్దన్‌ దేవాని చూసి చాలా ఆవేశపడతాడు. దేవాని చూసి గన్‌ తీసి దేవాకి గురి పెడతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో సత్యమూర్తి దేవా కంటే ముందు వచ్చి గన్‌ ముందు నిల్చొంటాడు. జడ్జి గారు మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి మీకు మిథున మీద ఎంత ప్రేమ ఉందో మాకు అంతే ఉందని అంటాడు. హరి చాలా ఆవేశ పడి గన్ దేవా చేతిలో పెట్టి నన్ను చంపేయ్‌రా నువ్వు దాని మెడలో తాళి కట్టగానే సగం ప్రాణం పోయింది ఇప్పుడు ఆ ప్రాణం కూడా పోయింది. నా కూతురు నా ప్రాణంరా నా కూతురికి ఏమైనా అయితే నేను బతకలేనురా అని హరివర్దన్ ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!