Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక, సుభాష్‌ కలిసి విహారి వంద కోట్లు కొట్టేస్తారు. పద్మాక్షికి ఇంట్లో అందరికీ ఆ విషయం చెప్తుంది. వసుధ పద్మాక్షితో లక్ష్మీ ఎన్నటికీ ఆ తప్పు చేయదు అని అంటుంది. వంద కోట్లు అంటే విహారి ఎంత బాధ పడతాడో అని యమున మనసులో అనుకుంటుంది. 

ఆఫీస్‌లో అందరూ బోనస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నామని లక్ష్మీ వల్ల తమ ఆశలు నాశనం అయిపోయావని అందరి ఉసురు లక్ష్మీకి తగులుతుందని అందరూ లక్ష్మీని నువ్వేం బాగు పడవు అంటారు. చారుకేశవ వచ్చి ఉద్యోగుల మీద కోప్పడతాడు. లక్ష్మీ ఆ డబ్బు తీయదు తన అలాంటిది కాదు అని అంటాడు. ఆమె సహకారం లేకుండా ఆమె వేలిముద్రలు ఎలా తీసుకుంటారు. ఎంత హాకర్లు అయినా మాత్రం ఓటీపీ చెప్పకుండా తీసుకోరు ఇంత పెద్ద కంపెనీలో ఆమె సహకారం లేకుండా ఎలా అని అందరూ తిడతారు. 

సహస్ర, అంబిక లక్ష్మీనే వంద కోట్లు మాయం చేసింది దాన్ని ఎలా ఇక్కడ ఉంచుతున్నారు దాన్ని ఇక్కడ నుంచి తరిమేయాలని చెప్పడానికి వెళ్తారు. విహారి వంద కోట్లు పోయావని బాధ పడతాడు. అంబిక విహారి దగ్గరకు వెళ్లి లక్ష్మీ విషయంలో ఎందుకు ఇంత ప్రేయారిటీ ఇస్తున్నావ్.. గతంలో నేను ఉద్యోగంలో పెట్టిన నా ఫ్రెండ్‌ సిమెంట్ ఇసుక తీసేశాడని పోలీసుల్ని పంపేశావ్.. నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశావ్ ఇప్పుడు లక్ష్మీని ఎందుకు ఏం అనడం లేదు. లక్ష్మీని ఎండీ పదవి నుంచి తీయడానికి ఇంత ఆలోచిస్తున్నావ్ నాకు ఓ న్యాయం దానికి ఓ న్యాయమా.. నేను బోర్డు మెంబర్‌ని ఆన్సర్ చెప్పమని అంటాడు. 

విహారి తన మామయ్యని పిలిచి లక్ష్మీని సస్పెన్స్ చేస్తున్నట్లు పేపర్స్ రెడీ చేయమని అంటాడు. లక్ష్మీ ప్రాణం పోయినా ఇలా చేయదు అని చారుకేశవ అంటాడు. డబ్బు కోసం తనేం కొందరిలా గడ్డి తినదు అంటాడు. అంబిక చారుకేశవతో వాదిస్తుంది. లక్ష్మీని సస్పెండ్ చేయమని పేపర్స్ రెడీ చేయమని విహారి చెప్తాడు. అంబికకు సిద్ధార్ద్ కాల్ చేసి తనకు ఇవ్వమన్న డబ్బు ఇవ్వమని అంటాడు. ఇప్పుడు నీకు చెప్పిన డబ్బు ఇచ్చేస్తా ఇంకెప్పుడు నా జోలికి రావొద్దని అంటుంది. కోట్లు సిద్ధార్ద్‌కి ట్రాన్సఫర్ చేస్తుంది. 

అంబిక సిద్ధార్ద్‌తో మాట్లాడుతుంటే చారుకేశవ వస్తాడు. అంబిక షాక్ అయిపోతుంది. మొత్తం వినేశాడా అని టెన్షన్ పడుతుంది. ఏంటి ఇది అంబిక అని చారుకేశవ అడగ్గానే మొత్తం వినేసిందని అనుకుంటుంది. కానీ చారుకేశవ వచ్చి అంబికతో లక్ష్మీ మీద ఎందుకు అంత పగ పెంచుకున్నావ్ అని అంటాడు. విహారి లక్ష్మీని పిలిచి సహస్ర, అంబిక, చారుకేశవ, మేనేజర్ ముందు లక్ష్మీకి సస్పెండ్ లెటర్ ఇస్తాడు. వంద కోట్ల ఇష్యూ క్లియర్ అయిన వరకు ఆఫీస్‌కి రావొద్దని చెప్పి పేపర్లు లక్ష్మీ చేతిలో పెట్టి సంతకం పెట్టమని అంటాడు. లక్ష్మీ ఏడుస్తుంది. లక్ష్మీ సంతకం పెడుతుంది. విహారి కూడా ఓకే చేస్తాడు. 

అంబిక లక్ష్మీతో ఆఫీస్‌కి సంబంధించిన వస్తువులు ఇచ్చేయమని అంటుంది. ఇక సహస్ర అన్నీ యాక్సెస్‌లు తీసుకోమని మేనేజర్‌కి చెప్తుంది. లక్ష్మీ ఐడీ కార్డ్‌, ల్యాప్‌టాప్ అన్నీ ఇస్తూ ఎమోషనల్ అయిపోతుంది. విహారికి అన్నీ అప్పగించి దండం పెట్టి వెళ్తుంటే అంబిక ఆపుతుంది. దండం పెట్టి వెళ్లిపోతుంటే సరిపోతుందా అని అంబిక అంటే దానికి లక్ష్మీ ఒక్క రూపాయి పోతే నేను ఊరుకోను అలాంటిది వంద కోట్లు నా వల్ల పోయావి అంటే ఊరుకుంటానా ఇది ఎవరు చేశారో కనిపెడతా అప్పుడు ఆఫీస్‌లోకి అడుగుపెడతా అని అంటుంది. లక్ష్మీ ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!