Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా బాధ పడుతూ ఉంటే సత్యమూర్తి దేవా పక్కనే వచ్చి కూర్చొని ఏమైందని అడుగుతాడు. ఏం లేదని దేవా చెప్పడంతో మిథునని మర్చిపోలేకపోతున్నావా అని అడుగుతాడు. నువ్వు నిజంగా మిథునని లవ్ చేస్తున్నావా.. నీ మనసులో నిజంగా మిథున అంటే ఇష్టం ఉందా.. అని తండ్రి అడగగానే దేవా అలాంటిది ఏం లేదు అని అంటాడు.

Continues below advertisement

మిథునని అసలు నేను ఎందుకు ప్రేమిస్తాను నాన్న అని దేవా అంటాడు. అయితే మిథున వెళ్లిపోయినప్పటి నుంచి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావ్‌రా.. నువ్వే కదరా మిథునని పంపేశావ్ అంటాడు. మీరు భలే ఉన్నారు నాన్న మిథున వెళ్లిపోయినప్పటి నుంచి నేను ప్రశాంతంగా ఉన్నాను. తల మీద భారం దిగిపోయింది అని దేవా అంటాడు. దానికి సత్యమూర్తి చిన్న బాబు నిజంగా ఈ మాటలు నీ మనసు నుంచే వస్తున్నాయా.. అని అడగగానే అవును నాన్న అంతే కాదు తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా.. ఎందుకంటే తను ఉండాల్సిన చోటు వేరు.. తన జీవితం వేరు.. నా వల్ల తను గమ్యం లేని శూన్యం కాకూడదు.. అందుకే తన జీవితం బాగుండాలి అని తనని పంపేశాను. మిథున కోసం నేను బాధ పడటం లేదు నాన్న నేను తన కోసం బాధ పడుతున్నా అని మీరు బాధ పడకండి.. నేను బాగున్నాను.. దయచేసి మీరు ఏదేదో ఊహించుకోకండి అని దేవా అంటాడు.

సత్యమూర్తి దేవాతో చిన్నబాబు నువ్వు చెప్పింది నిజం అయితే ఓకే కానీ నీలో భరించలేని బాధ ఉంటే మాత్రం నీలో నువ్వు కుమిలిపోవద్దు.. ఒక తండ్రిగా నీకు నేను చెప్పేది కోరుకునేది అదే.. అని వెళ్లిపోతాడు. దేవా చాలా బాధ పడతాడు. ఉంది.. మిథున అంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది.. మిథునని దూరం చేసుకున్నందుకు ప్రాణం పోయేంత బాధ ఉండి అని ఏడుస్తాడు. 

Continues below advertisement

ఆదిత్య చెప్పిన వాళ్లు మిథున, దేవాల పోస్టర్లు మొత్తం అతికిస్తారు. షాపింగ్ చేసి వచ్చిన భాను ఆ పోస్టర్ చూస్తుంది. భాను షాక్ అయిపోతుంది. ఈ పోస్టర్ ఎవరు వేసుంటారే అని తన ఫ్రెండ్‌ని అడుగుతుంది. ఆమె భానుతో ఇది దేవా పనే అయింటుంది. దేవా గురించి పోస్టర్ వేయించే ధైర్యం ఎవరికైనా ఉందా.. అప్పట్లో కూడా ఇలాగే వేయించాడు మర్చిపోయావా అని భానుకి చెప్తుంది. భాను దేవానే పోస్టర్లు వేయించాడని అనుకుంటుంది. వెంటనే ఆ పోస్టర్‌ని చింపి తీసుకొని ఆవేశంగా దేవా ఇంటికి బయల్దేరుతుంది. దారిలో చాలా చోట్ల పోస్టర్లు చూసి చిరాకు పడుతుంది. 

మిథున ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. అలంకృత మిథున, రిషిల చేతులు కలుపుతూ డ్యాన్స్ చేస్తుంది. ఇంటి బయట పందిరి రాటకు ఏర్పాట్లు జరుగుతాయి. రిషి, మిథున పందిరి రాటకు ముడుపు కడతారు. పందిరి రాట ఏర్పాటుతో పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చుని పంతులు చెప్తారు.  

ఆదిత్య మిథున, దేవాల పెద్ద పోస్టర్ ఎదురుగా పెట్టుకొని ఏంటి పెళ్లి పనులు మొదలయ్యావా.. పెళ్లి జరుగుతుందా.. మిథున నా భార్య అలాంటిది వేరే ఎవరితో పెళ్లి జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానా.. ఆదిత్య అన్నింటినీ గ్రహణంలా మింగేస్తాడు. ఈ పెళ్లిని రాహువులా అడ్డు పడి ఆపేస్తాడు అని అనుకుంటాడు. 

దేవా ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలవుతాయి. పసుపు దంచడానికి ఏర్పాట్లు చేస్తారు. పాట పాడుతా అని కాంతం కాలరాత్రికి చందమామకి ముడి పెట్టే మూఢ లోకం అని పాట పాడుతుంది. ఈ పాట ఏంటే అని శారద కాంతాన్ని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.