Nindu Manasulu Serial Today Episode రంజిత్‌, ఐశ్వర్యని స్కూటీ నేర్పిస్తానని అంటాడు. ఇంతలో సిద్ధూ అక్కడికి వచ్చి విష్ చేస్తాడు. ఐశ్వర్య సిద్ధూతో మీ కోసం అంత కష్టపడి సాయం చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని అంటుంది. నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే ఒట్టి థ్యాంక్స్ ఎందుకని పార్టీ కూడా ప్లాన్ చేశా అంటాడు. 

Continues below advertisement

ఐశ్వర్య ఎగ్జైట్ అవుతుంది. ఇంతలో ప్రేరణ వచ్చి పార్టీ లేదు ఏం లేదు అవసరం అయితే కేఫ్‌కి వచ్చి  కాఫీ తాగి వెళ్లు అంటుంది. ఇక రంజిత్ ఐశ్వర్యని డ్రైవింగ్ నేర్పిస్తా అని స్కూటీ ఎక్కిస్తాడు. ఇక ప్రేరణ సిద్ధూని ఇంకా తాను రెడీ అవ్వలేదని ఇంట్లోకి తీసుకెళ్లి వెయిట్ చేయమని అంటుంది. గణ విజయానంద్ ఇంటికి వచ్చి విజయానంద్‌తో మామయ్య గారు అని పిలుస్తాడు. ఏం నటిస్తున్నారు మామయ్య గారు..నటన గురించి మీ దగ్గరే నేర్చుకోవాలి అంటాడు. నేను ఏం నటించా అని విజయానంద్‌ అంటే.. నాతో నిశ్చితార్థం ఒప్పుకొని మీ కొడుకుతో క్యాన్సిల్ చేయించారని అంటాడు. నన్ను అనుమానించకు గణ ఇప్పుడు కూడా నా కూతురితో నీ పెళ్లి ఎంత ఘనంగా చేయాలా అని ఆలోచిస్తున్నా అని అంటాడు.

గణ విజయానంద్‌తో నా పెళ్లి మీ ఇంట్లోనే చేయండి అని అంటాడు. ఇక్కడెందుకు అని విజయానంద్ అడిగితే నాకు మీతో బంధం మాత్రమే ముఖ్యం ఆడంబరాలు కాదు అంటాడు. వీడేంటి ఇంత మంచిగా మాట్లాడుతున్నాడని విజయానంద్ మనసులో అనుకుంటాడు. ప్రేరణ సిద్ధూతో కాసేపు వెయిట్ చేయ్ కాఫీ తీసుకొస్తా అంటుంది. సిద్ధూ అలా షాక్‌లో ఉండిపోతాడు. ఏమైందని ప్రేరణ అడిగితే గతంలో ఇదే కాఫీ ఇవ్వడానికి ఎంత రచ్చ చేశావో తెలుసా అని ఫ్లాష్‌బ్యాక్ గుర్తు చేస్తాడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అంటుంది. 

Continues below advertisement

నిజమే ప్రేరణ అని సిద్ధూ ఎమోషనల్‌గా మాట్లాడుతాడు. మన మనసు అర్థం చేసుకొని మనతో నడిచే వరకు మన జీవితంలోకి రానంత వరకు మనకు పరిస్థితులు అనుకూలించవు.. కానీ ఎప్పుడు అలాంటి వారు మన జీవితంలోకి వస్తే అన్నీ మారిపోతాయి అని అంటాడు. నీ జీవితంలో అలాంటి వారు తారసపడ్డారా అని ప్రేరణ అడిగితే ఎదురుగా నిలబడి ఉన్నారు అని సిద్ధూ ప్రేరణని అంటాడు. ప్రేరణ నువ్వు పరిచయం అవ్వనంత వరకు నేను అందరూ ఉన్న ఒంటరిని నీ పరిచయంతోనే నాకు అందరూ దగ్గరయ్యారు. అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు. 

ప్రేరణ చేతులు పట్టుకొని నీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను అని అంటాడు. నేను కూడా నీకు రుణ పడి ఉన్నాను అని ప్రేరణ చెప్పి మనసులో నువ్వు మా నాన్నని కాపాడి మాకు పెద్ద సాయం చేశావ్ అనుకుంటాడు. ఇక సిద్ధూ మనసులో ప్రేరణ సాయంతో నిశ్చితార్థం ఆపాను.. ఇక పెళ్లి ఎలా అయినా ఆపాలి అని అనుకుంటాడు. ఇక సిద్ధూ ఇంట్లో గణ, సాహితిల పెళ్లికి ముహూర్తం పెడతారు. శుక్రవారమే మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తారు. నాలుగు రోజుల్లో పెళ్లి అంటే కష్టం కదా అని మంజుల అంటే గణ మనసులో వెంటనే జరిగిపోవాలని పంతులుకి ఇన్‌డైరెక్ట్‌గా బెదిరిస్తాడు.

గణ బెదిరింపుతో పంతులు శుక్రవారమే మంచిది అని తర్వాత ముహూర్తాలు లేవు అని చెప్తాడు. దాంతో మంజుల ఆ ముహూర్తం ఫిక్స్ చేయమని చెప్తుంది. మంజుల నాలుగు రోజుల్లో పెళ్లి అంటే పెళ్లి మండపం అవి ఇవీ ఎలా అని మంజుల అనుకుంటే దానికి విజయానంద్ పెళ్లి మన ఇంట్లోనే జరిపించాలని గణ అడిగాడని చెప్తాడు. దానికి మంజుల గ్రాండ్‌గా వేరే చోట జరిపిద్దాం అని అంటాడు. ఇక్కడే ఎందుకు అని అందరూ అడిగితే దానికి గణ నా దృష్టిలో ఇది ఇళ్లు కాదు నా దేవత పుట్టిపెరిగిన దేవాలయం.. ఇక్కడైతే నాకు మంచి జ్ఞాపకాలు ఉంటాయని అంటాడు. మంజుల, సాహితి గణ మాటలకు పొంగిపోతారు. విజయానంద్ మనసులో నటనలో నాకు మించిపోయి ఉన్నాడని అనుకుంటాడు.

కుమార్ డల్‌గా ఉంటే సిద్ధూ, ప్రేరణ  వెళ్లి ఏమైందని అడుగుతారు. దానికి కుమార్ ఎంత కష్టపడి నిశ్చితార్థం ఆపానురా మీ అమ్మ పెళ్లి అని షాక్ ఇచ్చారేంటి అంటాడు. జరిగిపోయిన వాటిని వదిలేయ్ అని ప్రేరణ అంటుంది. మనం వదిలేసినా ఆ గణ వదలడు అని అప్పుడే అక్కడికి వస్తున్న గణ, సాహితిలను కుమార్ చూపిస్తాడు. సాహితి వచ్చి అన్నయ్యని హగ్ చేసుకుంటుంది. మీ అన్నాచెల్లెళ్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలి దాని కోసం నేను ఏమైనా చేస్తా అని గణ వెటకారంగా అంటాడు. సాహితి సిద్ధూతో పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని నాలుగు రోజుల్లో పెళ్లి అని చెప్తుంది. పెళ్లి మీ ఇంట్లోనే సిద్ధూ బావ అని గణ అంటాడు. సిద్ధూ కోపంగా చూస్తాడు. ఇక సాహితి సిద్ధూకి వెడ్డింగ్ కార్డులు ఇచ్చి వీటిలో ఏది బాగుందో సెలక్ట చేయ్ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.