Illu Illalu Pillalu Serial Today Episode రామరాజుకి ఓ కస్టమర్‌ కాల్‌ వస్తుంది. ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో రామరాజు వల్లీని చూసి ఆయనతో మా కోడలు ఎంఏ ఇంగ్లీష్ చేసింది.. ఇంగ్లీష్ అదరగొడుతుంది అని చెప్పి వల్లీని పిలుస్తాడు. 

Continues below advertisement

వల్లీ టెన్షన్ పడుతూ రామరాజు దగ్గర మాత్రం యా.. యా.. అంటూ మాట్లాడుతుంది. నర్మద, ప్రేమలు కూడా వల్లీ యాయాలు చూసి నవ్వుకుంటారు. తెలుగులో మాట్లాడురా అని బతిమాలుతుంది. అది చూసి తిరుపతి, రామరాజు వల్లీ ఇంగ్లీష్ దంచేయకుండా ఇదేంటి ఇలా బతిమాలుతుంది. యాయా తప్ప ఇంకేం ఇంగ్లీష్‌లో మాట్లాడటం లేదు ఏంటా అని అనుకుంటారు. ఇంతలో ప్రేమ, నర్మద రామరాజు వాళ్ల దగ్గరకు వస్తారు. ప్రేమ ఫోన్ లాక్కొని ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. రామరాజు చూసి మురిసిపోతాడు. 

తిరుపతి ప్రేమని చూసి ఇది కదా ఇంగ్లీష్ అంటే యాయా కాదు అంటాడు. రామరాజు వల్లీతో ఏంటమ్మా నువ్వు నిజంగా ఎంఏ ఇంగ్లీష్ చదివావా.. ప్రేమ చూడు ఎలా మంచి నీరు తాగినట్లు మాట్లాడింది అని అంటాడు. అతను చెప్పింది నాకు అర్థమవ్వలేదు మామయ్య లేదంటే ఇంగ్లీష్‌లో మాట్లాడి అవతల వారిని విస్తరాకులా మడతపెట్టేస్తా అని అంటుంది. దానికి నర్మద అక్క నీ ఇంగ్లీష్‌ వినాలి అని ఉంది.. రెండు ముక్కలు మాట్లాడు అని అంటుంది. రామరాజు కూడా మాట్లాడమని అంటాడు. వల్లీ తెగ టెన్షన్ పడిపోతుంది. ఇంతలో వేదవతి వచ్చి భోజనం చేయాలి అని తీసుకెళ్లిపోతుంది. నా చదువు గురించి ఫుల్లుగా డౌట్ వచ్చేసింది నా పరిస్థితి ఏంట్రా అని వల్లీ అనుకుంటుంది. 

Continues below advertisement

సాగర్ గవర్నమెంట్ జాబ్ కొనడానికి మామ చెప్పిన 20 లక్షల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సాగర్ దగ్గరకు చందు వచ్చి ఏమైందని అడుగుతాడు. ఇంతలో ధీరజ్ కూడా వస్తాడు. ఇద్దరూ సాగర్‌కి విషయం అడుగుతారు. సాగర్ అర్జెంటుగా 20 లక్షలు కావాలి అని చెప్తాడు. ఇద్దరూ షాక్ అయిపోతారు. అంత అవసరం ఏంట్రా అని చందు అడిగితే చెప్పలేను అని అంటాడు. ఎందుకు ఏంటి అని అడగొద్దురా.. నా పర్సనల్‌రా అని అంటాడు. చందు చెప్పరా పర్సనల్ ఏంట్రా అని అంటే పది లక్షలు అవసరం అయితే నువ్వు మాకు చెప్పావా అని అంటాడు. ఏదో ఒకటి చేద్దాంరా అని ధీరజ్ అంటే నువ్వు ఏం చేయొద్దురా మొన్న ఎంత వరకు వచ్చిందో చూశావు కదరా నువ్వు ఏం చేయకు అను చందుని సాయం చేయమని అంటాడు. చందు నా వల్ల కాదురా నాన్నకి తెలిసిపోతుందని అంటాడు.

నాన్న నాన్న ఎటు పోయినా నాన్న అడ్డు వస్తాడురా ఏం పనీ చేయనివ్వడు అని అంటాడు. నాన్నకి చెప్పరా నీకు కావాల్సింది 20 లక్షలు అది నీ స్థాయికి మించిరా అని చందు అంటే దానికి సాగర్ నా స్థాయికి మించి.. నా స్థాయి 20 లక్షలు కూడా చేయదా.. థ్యాంక్స్‌రా నా అవసరం నేను చూసుకుంటా అని చెప్పి సాగర్ వెళ్లిపోతాడు. 

వల్లీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని 30 రోజుల్లో ఇంగ్లీష్ అనే బుక్ ఒక్క రోజులో నేర్చుకోవాలని కుస్తీలు పడుతుంటుంది.  ఎలా అయినా ఇంగ్లీష్ నేర్చేయాలి అని ఐ కమ్.. యూ కమ్ అని మొదలు పెడుతుంది. ఉదయం వల్లీ లేచి బయటకు వెళ్లే సరికి నర్మద, ప్రేమ, తిరుపతి, అమూల్య గుమ్మం ముందు నిల్చొని గుడ్ మార్నింగ్ చెప్తారు. ఏంటి ఇలా పొద్దు పొద్దున్నే వచ్చేశారు అని వల్లీ అడిగితే బాబాయ్కి నీ మీద అనుమానం వచ్చింది క్లియర్ చేయడానికి  వచ్చామని నర్మద, ప్రేమ చెప్తారు. కస్టమర్ కేర్ వాడితో నువ్వు యాయా తప్ప ఇంకేం మాట్లాడలేదు.. కదా అప్పుడు నుంచి బాబాయ్ మతి పోయిందంట.. పొట్ట చించినా నీకు ఇంగ్లీష్ ముక్క రాదని అంటున్నారు అని చెప్తారు.

ఇప్పుడు నువ్వు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడు అని రెచ్చగొడతారు. దాంతో వల్లీ మాట్లాడుతా అని చెప్తుంది. జానీ జానీ ఎస్‌ పాప అని పాట పాడుతుంది. అది విని తిరుపతి నీకు ఇంగ్లీష్ వచ్చమ్మా సూపర్ అని వెళ్లిపోతాడు. ఇంగ్లీష్‌లో నాలుగు మాటలు మాట్లాడు అంటే పాట పాడి వెళ్లిపోతుందా దీనికి నా చేతుల్లో ఉంది అని ప్రేమ అనుకుంటుంది. మరోవైపు విశ్వ అమూల్యని ఎలా అయినా పెళ్లికి ఒప్పించాలి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.