Ammayi garu Serial Today Episode: అశోక్ దొరికిపోవడంతో తన బండారం బయటపడుతుందని కోమలి మళ్లీ పారిపోవడానికి రెడీ అవుతుంది.దీంతో ఆమెను విజయాంబిక,దీపక్ ఆపుతారు. బయట అంత సెక్యూరిటీ పెట్టుకుని నువ్వు ఎలా పారిపోతావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.ఈ సమస్యను మేం పరిష్కరించే వరకు నువ్వు కాస్త ఓపిక పట్టాలని చెప్పి వెళ్లిపోతారు. రూప బర్త్‌డే సందర్భంగా రాజు ఆమెకు మంచి గిప్ట్ ఇచ్చి విషెష్ చెబుతాడు.వాళ్ల అమ్మ విరూపాక్షి కూడా అక్కడి వచ్చి ఆమెను ఆశీర్వదిస్తుంది. ఈరోజు కోమలి బండారం బయటపెట్టి ఆమెను బయటకు గెట్టించివేయాలని రాజు..రూపతో అంటాడు. అది మీ బర్త్‌డేకి నేనిచ్చే పెద్ద గిఫ్ట్ అంటాడు. కోమలి బండారం బయటపెట్టడానికి బయలుదేరే సరికి నన్ను హత్య కేసులో ఇరికించారని...ఇవాళ కూడా వాళ్లు ఏదో ప్లాన్ చేస్తూనేఉండి ఉంటారని విరూపాక్షి భయపడుతూ ఉంటుంది. వాళ్లు ఏం చేసినా మనం తిప్పికొడదామని రాజు అభయమిస్తాడు. ఈరోజు ఎలాగైనా కోమలి సంగతి తేల్చాల్సిందే అంటాడు. అటు సూర్య కోమలి దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్‌డే రూప్ అని విషెష్ చెబుతాడు. నువ్వు త్వరగా రెడీ అయి కిందకు రా అని అంటాడు.ఇవాళ ఏదో సర్‌ప్రైజ్ ఉందని రాజు చెప్పాడని సూర్య కోమలికి చెబుతాడు.ఈమాట వినగానే కోమలి గుండెల్లో భయం మొదలవుతుంది. నువ్వు త్వరగా రెడీ అయి వస్తే..ఆ సర్‌ప్రైజ్ ఏంటోచూద్దామని అని చెప్పి వెళ్లిపోతాడు.కోమలి భయం చూసి విజయాంబిక వచ్చి ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది. రాజు ఏదో సర్‌ప్రైజ్ ఉందని చెప్పి మీ తమ్ముడు వెళ్లాడని...అందుకే భయపడుతున్నానని చెబుతుంది.నా బర్త్‌డే పేరు చెప్పి....అనాథ ఆశ్రమంలో ఉన్న వారందిరీ పిలుస్తారని, వాళ్లు వచ్చారంటే నా బండారం బయటపడుతుందని చెబుతుంది. మొన్న అంటే అశోక్‌ను అడ్డం పెట్టుకుని విరూపాక్షిని అరెస్ట్ చేయించారు...ఇవాళ నన్ను ఎవరు కాపాడతారని ఆమె నిలదీస్తుంది. ఈరోజు కూడా అశోక్ కాపాడతాడని దీపక్ అంటాడు. అదే మేం నీకు ఇచ్చే పెద్ద గిప్ట్ అని వారు అంటారు. నీ అశోక్‌ను బయటకు తీసుకొచ్చామని అంటారు. అయినే నేను అశోక్‌తో మాట్లాడొచ్చా అంటే...కుదరదనివారు చెబుతారు. కోమలి బ్రతిమాలడంతో దీపక్ అశోక్‌కు ఫోన్ చేసి అతనితో మాట్లాడిస్తారు. విజయాంబికాకు నన్ను పూర్తిగా బయటకు తీసుకొచ్చే సత్తాఉందని...మన పెళ్లి జరుగుతుందని,నువ్వు భయపడవద్దని అశోక్ ఆమెకు చెబుతాడు. దీంతో ఆమె అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత విజయాంబిక అశోక్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుంది.ఇవాళ ఇంట్లో రూప బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని...ఇళ్లంతా సందడిగా ఉంటుందని...ఆ సమయంలో నువ్వు వచ్చి రూపను చంపేయాలని చెబుతుంది. అంతమందిలో నేను ఎలా చేయగలనని అనగా...నీ సామర్థ్యం నాకు తెలుసని రెచ్చగొడుతుంది. నువ్వు ఈ రోజు ఆ రూపను చంపలేదంటే...నీ కోమలి చస్తుందని విజయాంబిక అశోక్‌ను బెదిరిస్తుంది. దీనికి అతను సరేనంటాడు.
రూప బర్త్‌డే సెలబ్రేషన్లకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటాయి. అటు ఆశ్రమం నుంచి బర్త్‌డే పార్టీకి బయలుదేరతారు. రూపను చంపడానికి అశోక్ సైతం గన్‌తో అక్కడికి చేరుకుంటాడు. ఇంతలో రూప కేక్ కట్ చేయడానికి కిందకు వస్తుంది. అటు గన్ తీసుకుని పొజిషన్ తీసుకోవడానికి అశోక్ వెళ్తుండటంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.