Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ సీమంతానికి ఆరు ఊరంతా తిరిగి అందరిని ఆహ్వానిస్తుంది. ఆరు ఏ ఇంటికి వెళితే ఆ ఇంటికి గుప్త  కూడా వెళ్తాడు. ఆహ్వానించడం అంతా అయిపోయాక ఆరు హ్యాపీగా ఫీలవుతుంది.

Continues below advertisement

గుప్త:  ఏమిటి బాలిక గ్రామస్థులందరినీ నీ సహోదరి సీమంతానికి ఆహ్వానించితివా..?

ఆరు: మీ దయ వల్ల అందరినీ ఆహ్వానించాను గుప్త గారు థాంక్యూ సో మచ్‌.. నేను చనిపోయినా కూడా నా ఆత్మ పైకి వెళ్లకపోవడం.. నాకు ఇలాంటి అదృష్టం దక్కడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం

Continues below advertisement

గుప్త: ఏ జన్మలోనో కాదు ఈ జన్మలోనే నువ్వు  ఎన్నో పుణ్యకార్యములు చేసితివి అందులకే నీకీ వరము దక్కినది

ఆరు:  నేను ఏం మంచి చేశానో నాకు గుర్తు లేదు గుప్త గారు. కానీ నాకు దక్కిన ఈ వరము మరెవ్వరికీ దక్కలేదేమో

గుప్త:  సత్యము పలికితివి బాలిక ఈ రోజు నువ్వు చేసినది నభూతో న భవిష్యత్‌.. మునుపెన్నడు జరగనిది.. ఇకపై జరగనిది..

ఆరు:  ఎమోషనల్‌ అవుతూ ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన మీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను తీసుకోండి.. ( ఉంగరం తీసి ఇస్తుంది.)

గుప్త: అదేమిటి బాలిక గ్రామస్థులందరినీ ఆహ్వానించుటలోనే నువ్వు సంతృప్తి చెందితివా..? రేపటి నీ సహోదరి సీమంతం నీ చేతుల మీదుగా జరిపించవా..? నీ సహోదరికి నీ హస్తములతో గంధము పూయవా..? నీ సహోదరి చేతులకు గాజులు తొడగవా.? నీ చేతితో బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించవా..? తొలి ముత్తైదువుగా నీవు తాంబూలం స్వీకరించవా

ఆరు: నాకు అంత అదృష్టము ఉందా గుప్త గారు

గుప్త: ఆ అదృష్టము నీకు కలిగించుటకే కదా మా అంగుళీకము నీకు ఇచ్చినది. మా అంగుళీకముతో నువ్వు ఏమైనా చేయవచ్చును..

ఆరు: చాలా థాంక్స్‌ గుప్త గారు.. కానీ ఊరి వాళ్లు అంటే నన్ను ఎవ్వరూ చూడలేదు. కానీ మా వాళ్లు నన్ను చూస్తారు కదా..? గుర్తు పడతారు కదా..? మా నాన్న, మా ఆయన, చెల్లి, పిల్లలు అందరూ నన్ను చూస్తారు కదా..? వాళ్ల ముందు నేను ఎలా సీమంతం జరిపించగలను..

గుప్త: మరి నీ తెలివి తేటలు ఎటుల పోయినట్టు అది నీ ఉపాయంతో యోచన చేయవలెను నీకు అపాయం రాకుండా నువ్వే చూసుకోవలెను

ఆరు: మీరే ఏదైనా మార్గం చెప్పండి

గుప్త: అన్నియు నేనే చెప్పినచో నీ తెలివి బుద్ది కుశలత ఏమి చేయును

ఆరు: ఆలా అంటారేంటి గుప్త గారు..  సరే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. మీరు ఇచ్చిన వరాన్ని సద్వినియోగ పరుచుకుంటాను.. కానీ మా చెల్లికి పుట్టబోయే బిడ్డ పుట్టగానే చనిపోతుంది అని రాజు గారు అన్నారు..?

గుప్త: అది విధి అందులకే నీకు మరు జన్మ లేదని మా ప్రభువుల వారు చెప్పితిరి

ఆరు: పుట్టగానే చావడం ఏంటి గుప్త గారు అది ఒక జన్మేనా..? ఆ బిడ్డ మీద మా ఆయన, చెల్లి , మా నాన్న , పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల ఆశలు నిరాశ కావాల్సిందేనా..? వాళ్లు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాల్సిందేనా..?

గుప్త: బాలిక ఒకవేళ నీ వేలికున్న ఆ అంగుళీకముతో ఆ బిడ్డను బతికించే ప్రయత్నం చేయుదువా..? అలా చేసినచో మాకు ప్రమాదం సుమా..? నీ మస్తిష్కమున అటువంటి యోచన ఉన్నచో తక్షణమే మా అంగుళీకము మాకు ఇవ్వుము

ఆరు: అయ్యయ్యో మిమ్మల్ని ఎందుకు ప్రమాదంలో పడేస్తాను.. నా వల్ల మీకు ఏ హాని కలగదు..  నా గురించి మీకు తెలుసు కదా..?

గుప్త: ఆసాంతము తమ గురించి మాకు తెలియును కాబట్టే ముందు జాగ్రత్తగా చెప్పు చుంటిమి

ఆరు: మీ చెల్లిపై ఏ మాత్రం నమ్మకం లేదా గుప్తగారు

గుప్త: నమ్మకం ఎందుకు లేదు.. చాలా నమ్మకం ఉన్నది అదే స్థాయిలో అపనమ్మకం కూడా ఉన్నది.

ఆరు: అలాంటిదేం లేదు మీరు ప్రశాంతంగా ఉండండి.. మీరు ఇచ్చిన ఈ ఉంగరానికి హడ్రెండ్‌ పర్సెంట్‌ న్యాయం చేస్తాను

అంటూ ఆరు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గుప్త కంగారుగా బాలిక అని పిలుస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!