Chinni Serial Today Episode మధు కిడ్నాప్ అయ్యాయిందని తెలిసి మ్యాడీ శ్రేయతో జరగబోయే పూజని వదిలేసి వెళ్లిపోతుంటే నాగవల్లి మ్యాడీని ఆపుతుంది. ఓ ఆడపిల్ల జీవితం అమ్మా అని మ్యాడీ అంటే ఇక్కడ కూడా ఓ ఆడపిల్ల జీవితమేరా పూజ ఆగిపోతే శ్రేయకి ఎంత కష్టం వస్తుందో నీకు పట్టదా అని అంటుంది. దానికి మ్యాడీ ముందు మధుని కాపాడి తన తల్లిదండ్రులకు అప్పగించి తర్వాత శ్రేయతో పూజ చేస్తా అని చెప్పి వెళ్లిపోతాడు.
సుబ్బు, స్వరూప, చంటి మధు కోసం బాధ పడుతూ ఉంటారు. మధుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఏడుస్తారు. ఇంతలో మ్యాడీ రావడంతో సుబ్బు ఏడుస్తాడు. చంటీ మధు ఎలా కిడ్నాప్ అయ్యిందో మ్యాడీకి చెప్తాడు. కారు రంగు కూడా చెప్పడంతో మ్యాడీ వెతకడానికి వెళ్తానని అంటాడు. ఇక సుబ్బురావుతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అంటాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మధు శవం గుట్ట దగ్గర ఉంది అని చెప్తాడు. సుబ్బారావు వాళ్లు ఏడుస్తూ వెళ్తారు. లోహిత మధు చనిపోయిందని విషయం నాగవల్లి వాళ్లకి చెప్తుంది. ఎవరో మధుని చంపేసి ఆ చెరువులో పడేసినట్లు ఉన్నారని అంటుంది.
నాగవల్లి శ్రేయతో చూశావా శ్రేయ అది చేసిన పాపాలకు దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో నీకు మ్యాడీకి ఇక ఏ అడ్డు లేదు అంటాడు. మ్యాడీ మధు తల్లిదండ్రుల్ని తీసుకొని శవం దగ్గరకు వెళ్తాడు. ఆ బాడీ డ్రస్ చూసి చంటి ఏడుస్తూ అక్క డ్రస్సే అది అమ్మా అని ఏడుస్తాడు. ఇక అక్కడే పడి ఉన్న పట్టీని మ్యాడీ తీస్తాడు. అది స్వరూప చూసి ఇది నా కూతురిదే.. శవంలా ఉన్న నా కూతురిని చూడలేను అని కుప్పకూలిపోయి ఏడుస్తుంది. మధు లాంటి మంచి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని మ్యాడీ అంటాడు. ఇక పోలీసులు బాడీ గుర్తించడానికి పిలుస్తారు. మ్యాడీ అందర్నీ తీసుకొని వెళ్తాడు.
మ్యాడీ బాడీ చూసి తను మన మధు కాదు అంటాడు. సుబ్బు వాళ్లు కూడా చూసి తను మా కూతురు కాదు అని అంటాడు. మరో వ్యక్తి ఆ అమ్మాయిని గుర్తు పట్టి మా ఇంటి పక్కనే అంటాడు. ఇక మ్యాడీ మధుని తాను కనిపెడతా అని సుబ్బు వాళ్లని ఇంటి దగ్గరకు చేర్చేతాడు. ఇక నాగవల్లి మధుకి కాల్ చేస్తుంది. మధు బాడీ అనుకున్నాం కానీ అది కాదు మమ్మీ మధు బతికే ఉందని అంటాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. సూర్యోదయంలోపు వచ్చేయమని నాగవల్లి మ్యాడీకి చెప్తుంది. మధుని సంజు కిడ్నాప్ చేయిస్తాడు. సంజు తన మనుషులతో దాన్ని అక్కడే ఉంచరా.. రేపు ఎలా ఎక్కడికి మార్చాలో చూద్దాం అని అంటాడు. సంజు ఫ్రెండ్స్ టీ తాగడానికి వెళ్తామని అనుకోవడం మధు వింటుంది.
మ్యాడీ ఇంటికి వచ్చిన తర్వాత శ్రేయ, మ్యాడీ పూజ చేస్తారు. మ్యాడీ మధు గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో చేయి కాల్చుకుంటాడు. ఎవరి కోసం ఆలోచిస్తూ అంత పరధ్యానంగా ఉన్నాడు మ్యాడీ కొంపతీసి మధు కోసం ఆలోచిస్తున్నాడు అని అంటుంది. ఎవరి గురించి ఆలోచించకుండా హోమం పూర్తి చేయ్ అని నాగవల్లి చెప్తుంది. మ్యాడీ, శ్రేయ హోమం పూర్తి చేస్తారు. ఇక మధు అక్కడే ఉన్న ఫోన్ తీసుకొని మ్యాడీకి మెసేజ్ చేసి లోకేషన్ పెడుతుంది. మ్యాడీ మెసేజ్ చూసి మధు ఎక్కడుందో తెలిసిపోయింది తనని సేవ్ చేస్తా అని అంటాడు. సుబ్బుకి కాల్ చేసి మధు దొరికిపోయిందని కాపాడటానికి వెళ్తున్నా అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.