Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఇంటి దగ్గర పెళ్లి వేడుక కోసం టెంట్ వేయడానికి కొంతమంది వస్తే కాంతం, రంగం వాళ్లని ఆపి.. దేవా పారిపోయాడు పెళ్లి జరగదు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భాను, రేణుక ఆ మాటలు విని షాక్ అయిపోతారు.
భాను కాంతంతో ఏం మాట్లాడుతున్నావ్ అక్కా పెళ్లి ఆగిపోవడం ఏంటి అని అంటే దానికి కాంతం రేపే ముహూర్తం దేవా ఇంకా ఇంటికి రాలేదు.. అంటే పెళ్లి ఇష్టం లేదు అనే కదా అంటుంది. భాను చాలా కంగారు పడుతుంది. రేణుక సత్యమూర్తి, శారదల్ని వెతుక్కుంటూ వెళ్తుంది. దేవా ఇంకా రాలేదు అంటే పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతుంది. దేవా ఇంకా రాలేదు అందరికీ రేపే పెళ్లి అని చెప్పుకున్నాం.. పెళ్లి జరగకపోతే నేను నా కూతురు పందిట్లో మీ ఎదురుగానే చనిపోతాం అని రేణుక చెప్తుంది. సత్యమూర్తి, శారదలు దేవా ఎక్కడికీ పారిపోలేదు.. దేవా అలాంటి వాడు కాదు.. ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని భాను వాళ్లకి చెప్తారు.
దేవా మిథునకు తనకు పెళ్లి జరగడం గుర్తు చేసుకొని మిథున తనకు దూరం అయిపోతుందని చాలా బాధ పడుతూ ఉంటాడు. ఇంతలో మిథున జ్యూస్ తీసుకొని దేవా దగ్గరకు వచ్చి ఇస్తుంది. మిథున చేతులు పట్టుకొని దేవా సారీ చెప్తాడు. సారీ ఎందుకు అని మిథున అడుగుతుంది.
దేవా: నేను చాలా పెద్ద తప్పు చేశాను మిథున పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా.. నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు నేను మాత్రమే ఎందుకు గుర్తొచ్చాను అని అడిగావు కదా.. ఆ క్షణం నాకు సమాధానం తెలీలేదు కానీ ఇప్పుడు తెలిసొచ్చింది.. నువ్వు నా భార్యవి మిథున.. దైవసాక్షిగా వేదమంత్రాల సాక్షిగా నేను తాళి కట్టిన నా భార్యవి.. నిన్ను నేను ఇంట్లో నుంచి పంపేశా కానీ నా భార్యగా మాత్రం దూరం చేసుకోలేకపోయాను.. మన బంధాన్ని మాటల్లో మాత్రమే తెంపేశాను కానీ మనసులో మన బంధం అలాగే ఉండిపోయింది. అందుకే ఆ క్షణం నీకు కాల్ చేశాను.. పద మిథున మనం మన ఇంటికి వెళ్లిపోదాం.. ఈ క్షణం నుంచి ప్రాణం పోయే వరకు నిన్ను వదలను పద మిథున.. ప్రాణం లేకపోయినా బతుకుతా కానీ నువ్వు లేకుండా బతకలేను.. మిథున: దేవా ప్లీజ్ ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో.దేవా: నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు.. కన్నీరు పెట్టుకున్నావ్.. నీలాంటి భార్య నాకు దొరకదు..నిన్ను కోల్పోతే నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. ఇక నీ కోసం మాత్రమే బతుకుతా మిథున.. ఇది నువ్వు ఇచ్చిన పునర్జన్మ.మిథున: సారీ దేవా.. ప్రాణం పోయిన తర్వాత ఆక్సిజన్ తెస్తే ప్రయోజనం ఉండదు. తెల్లారితే నా పెళ్లి. దేవా: ఇంకా పెళ్లి కాలేదు కదా మిథున.మిథున: మొన్న నువ్వు నన్ను గెంటేసినప్పుడు మా నాన్న నాకు ఒక మాట అడిగారు. అతనితోనే చావు అయినా బతుకు అయినా అని వెళ్లావు.. ఇప్పుడు అతనే నిన్ను గెంటేశాడు నీ బతుకుకి అర్థమేంటి అని అడిగారు. కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు మేం అంతా చనిపోవాలా అని అడిగారు. ఇప్పుడు నేను నీతో వస్తే జరిగేది అదే..దేవా: మీ ఇంట్లో వాళ్లని నేను ఒప్పిస్తా.మిథున: మొన్నటిలా ఇంట్లో నుంచి గెంటేయవు అని గ్యారెంటీ ఏంటి అని అడిగితే.. మా వాళ్లు నిన్ను నమ్మే స్టేజ్ ఎప్పుడో పోయింది దేవా.. కాదు నువ్వే పోగొట్టుకున్నావ్. నన్ను కన్న పాపానికి వాళ్ల ప్రాణాలు కూడా బలితీసుకొని ఆ పాపం కూడా మూటగట్టుకోలేను.
దేవా చాలా బతిమాలుతాడు. మిథున దేవాతో నిజంగా నేను నా కుటుంబం బాగుండాలి అని కోరుకుంటే ఇక ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని అనేస్తుంది. నిన్ను పెళ్లి కూతురిలా చూసి తట్టుకోలేకపోతున్నా నా ప్రాణం పోయేలా ఉంది ఇక నీకు వేరే వాళ్లతో పెళ్లి అయితే.. నా ప్రాణం కాపాడినందుకు థ్యాంక్స్.. ఇక నేను బయల్దేరుతా అని దేవా అంటాడు. నీకు ప్రాణ హాని ఉంది జాగ్రత్త అని మిథున చెప్తుంది. దేవా ఏడుస్తూ మిథునని చూస్తూ వెళ్లిపోతాడు. మిథున కూడా ఏడుస్తుంది.
దేవా ఇంటి నుంచి బయటకు వెళ్లడం త్రిపుర చూస్తుంది. ఇంట్లో వాళ్లందరినీ పిలిచి దేవా మన ఇంట్లోనే ఉన్నాడు. అది కూడా మిథున గదిలోనే ఇన్ని రోజులు ఉన్నాడు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.