Nindu Manasulu Serial Today Episode సిద్ధూ విజయానంద్‌ని లాక్కొచ్చి నువ్వు ఇంకా మారవా.. కాసేపట్లో నీ కన్న కూతురికి ఓ నీచుడితో పెళ్లి జరగబోతుంది. వాడి గురించి నీకు అంతా తెలిసినా నీ ప్రాణంగా చూసుకున్న నీ కూతుర్ని వాడి కాళ్లు కడిగి నువ్వే తనని కట్టబెట్టబోతున్నావ్.. ఓ రకంగా నువ్వే తనని బతికుండగానే చంపేస్తున్నావ్.. అని అంటాడు. సిద్ధూ అలా అనొద్దు అని విజయానంద్ అంటాడు.
సిద్ధూ దానికి రేపు జరగబోయేది అదే నేను మాట్లాడుతుంటే నీకు నీ కూతురి జీవితం కళ్ల ముందు కనిపిస్తుందా.. ఎందుకు నాన్న తెలిసి తెలిసి నా జీవితం నాశనం చేశావ్ అని రేపు సాహితి నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి.. నా స్వార్థం కోసం నేను చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి ఇలా చేశాను అని చెప్పగలవా.. సాహితి దూరం అవుతుందనే తట్టుకోలేకపోతున్నావ్.. మరి తను కష్టాలు పడితే తట్టుకోగలవా.. ఇప్పటికైనా మించి పోలేదు పెళ్లి ఆపు.. నాకు తండ్రిని దూరం చేశావ్.. దానికి నిన్ను చంపేయాలి అని నాకు ఉన్నా సాహితికి తండ్రిని దూరం చేయకూడదు అని ఆగుతున్నా.. ఇప్పటికైనా పెళ్లి ఆపు అసలేం జరిగిందో చెప్పు.. గణ సాహితి మెడలో తాళి కడితే ఎవరూ తన జీవితాన్ని కాపాడలేరు నిజం చెప్పు అని సిద్ధూ అడుగుతాడు.
విజయానంద్ గణ చేసిన బ్లాక్ మెయిల్ గుర్తు చేసుకొని చెప్పేస్తా అనుకుంటాడు. విజయానంద్ చెప్పే టైంకి మామయ్యా అంటూ గణ ఎంట్రీ ఇస్తాడు. మీతో మాట్లాడాలి అని విజయానంద్‌ని తీసుకెళ్లిపోతాడు. తర్వాత సిద్ధూ ప్రేరణకు కాల్ చేసి వర్ష గురించి అడుగుతాడు. వర్ష కనిపించడం లేదని ప్రేరణ అంటే నేను వస్తా లేటు అయితే నా చెల్లి జీవితం నాశనం అయిపోతుందని అంటాడు. ప్రేరణ రావొద్దని గణకి ప్లాన్ తెలిసిపోతుంది అంటుంది. ప్రేరణ సిద్ధూతో మాట్లాడుతూ ఓ గేటు వెనక దాక్కున్న వర్షని చూస్తుంది.
వర్షని ప్రేరణ కలుస్తుంది. ప్రేరణని వర్ష హగ్ చేసుకొని ఏడుస్తూ గణ నన్ను మోసం చేశాడు అని చెప్తుంది. సిద్ధూతో ప్రేరణ వర్షని మాట్లాడిస్తుంది. ముహూర్తం టైంకి వర్షని తీసుకొస్తా అని ప్రేరణ అంటుంది. ఇక గణ విజయానంద్‌ని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చొపెట్టి తాను కింద కూర్చొని ఏంటి మామయ్య ఏం చేస్తున్నావ్.. నీ కొడుకు కానీ కొడుకు సెంటిమెంట్‌కి నా గురించి చెప్పేయాలి అనుకున్నావా.. తప్పు కదా.. సాహితి తండ్రివి కాబట్టి నీ ఎమోషన్స్ నీకు ఉంటాయ్,, కానీ సిద్ధూ ఊరుకుంటాడా.. తండ్రిని నువ్వే చంపావని తెలిస్తే తండ్రి కాని తండ్రిని క్షమిస్తాడా అని విజయానంద్‌ని భయపెడతాడు. ఇద్దరం ఎవరి స్వార్థం కోసం వాళ్లు కలిసే తప్పు చేశాం.. సిద్ధూకి నిజం తెలిస్తే ఇద్దరినీ వదలడు.. నిన్ను చంపేస్తాడు అని భయపెడతాడు. దాంతో విజయానంద్ నిజం చెప్పకుండా ఆగిపోతాడు.
గణ రౌడీలకు కాల్ చేసి వర్ష దొరికిందా అని అడుగుతాడు. ఇంకా లేదు అని రౌడీలు చెప్పడంతో త్వరగా దాన్ని వెతికి చంపేయండి అని అంటాడు. ఇక మంజుల ప్రేరణని రెడీ చేస్తూ పెళ్లి కూతురిగా కూతుర్ని చూసి మురిసిపోతుంది. సిద్ధూ, విజయానంద్ కూడా సాహితి దగ్గరకు వస్తారు. సాహితితో సిద్ధూ నీకు అంతా మంచే జరుగుతుందమ్మా అని అంటాడు. మళ్లీ ఏమైనా చేస్తున్నావా అని మంజుల అడుగుతుంది. నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోవడం లేదమ్మా అని అంటాడు. విజయానంద్ లోలోపల సాహితి జీవితం నాశనం చేస్తున్నా అని చాలా బాధపడతాడు. సిద్ధూ కూడా తండ్రిని చూసి నీ జీవితం నాశనం చేసేస్తున్నాడు అని అనుకుంటాడు.
సాహితి తండ్రి, అన్నతో మీ ఇద్దరూ ఎప్పటికీ కలవరు అనుకున్నా కానీ నా పెళ్లిలో మీ ఇద్దరూ కలిసి ఇలా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. సిద్ధూ అందరితో నేనేం చేసినా మీ మంచికే చేస్తా అంటాడు. ఇక పంతులు పిలుస్తున్నారు అని విశ్వాసం సాహితి వాళ్లని పిలుస్తాడు. గణ వర్ష దొరకలేదు అని టెన్షన్గా రౌడీలతో మాట్లాడుతుంటే సిద్ధూ వెళ్లి నవ్వుతాడు. బాగానే నటిస్తున్నావ్ అని అంటాడు. మీ పార్టనర్ ప్రేరణ రాలేదు మీరు పిలవలేదా అని అడుగుతాడు. నా మంచి కోరే ఫ్రెండ్ తను నేను పిలవకపోయినా వస్తుంది. ప్రస్తుతం తను ఒక ముఖ్యమైన పనిలో ఉంది అది అయిన తర్వాత వస్తుంది అని అంటాడు. ఈ పెళ్లి ఎవరూ ఆపలేరు అంటున్నావ్ కదా మరి నీ ముఖంలో ఈ టెన్షన్ ఏంటి అని అడుగుతాడు. నీ కళ్లలో ఏంటి అంత కాన్ఫిడెంట్ ఉంది మీరు అనుకున్నది జరుగుతుందా అని అడుగుతాడు. కచ్చితంగా జరుగుతుంది కాసేపట్లో మీకే తెలుస్తుంది అని అంటాడు.
గణ సిద్ధూతో నా పెళ్లిని ఎవరూ ఆపలేరు అని అంటాడు. సిద్ధూ గణని ఒంటరిగా ఉన్న తన తండ్రి దగ్గరకు తీసుకెళ్లి మీ నాన్న ఎవరో తెలియకపోయినా అతన్ని నేను కాపాడాలి అని హాస్పిటల్‌కి తీసుకెళ్లా.. దీనిబట్టి నీకు ఏం అర్థమైంది.. మనకు పరిచయం లేని వాళ్లకి కూడా సాయం చేయాలని.. నాకు తెలియని మీ నాన్న కోసం అంత చేసిన నేను నా వాళ్ల కోసం ఎంతకైనా వెళ్తాను అని తెలీదా అని అంటాడు. నేను అంతే బావగారు నేను అనుకున్నది జరగడానికి అడ్డుగా ఉన్నవాళ్లని లేపేస్తా అంటాడు. ఇంతలో మంజు అక్కడికి వస్తుంది. దాంతో గణ ప్రేరణతో కలిసి బావగారు పెళ్లి ఆపాలి అనుకున్నారు కదా దాని కోసం సారీ చెప్పడానికి వచ్చారు అని గణ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.