Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవాని తన గదిలోనే ఇంట్లో ఎవరికీ తెలీకుండా దాస్తుంది. మిథునని చూసి రిషి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మిథున కళ్లు చూసిన రిషి రాత్రంతా నిద్ర పోలేదా అని అడుగుతాడు. మళ్లీ ఫీవర్ వచ్చిందా.. బాగానే ఉన్నావా.. హాస్పిటల్‌కి వెళ్దామా అని చాలా కేర్ చూపిస్తాడు. కళ్లతో దుమ్ము పడింది అని మిథున చెప్తుంది.
రిషి నీ విషయంలో ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో.. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత నిన్ను కళ్లలో పెట్టి చూసుకుంటాడని రాహుల్ అంటాడు. టిఫెన్ చేయమని మిథునని లలిత చెప్తే గదిలోకి తీసుకెళ్లి తింటానని అంటుంది. మొదటి సారి ఇలా గదిలోకి తీసుకెళ్తా అని చెప్పడం చాలా వింతగా ఉంది.. ఈ వింత వెనక కారణం ఏంటో అని త్రిపుర అడుగుతుంది. తను ప్రశాంతంగా గదిలో తింటుంది. ఎందుకు ఇలా ప్రశ్నలు అక్క వదిలేయండి అని చెప్పి మిథునని టిఫెన్ తీసుకెళ్లమని రిషి చెప్తాడు.
మిథున ఎక్కువ టిఫెన్ ప్లేట్‌లో పెట్టడంతో త్రిపుర మిథునతో టిఫెన్ ఇద్దరికా ఒకరికా అంత పెట్టావ్ అంటుంది. లలిత కూడా నిజంగానే షాకింగ్‌గా ఉంది అంటుంది. సరిపోకపోతే మళ్లీ కిందకి రాలేను కదా.. ఎందుకు ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలో చూస్తారు. నేను ఇంత టిఫెన్ తింటే ఎవరికైనా ప్రాబ్లమా అని అడుతుంది. అవే కాదు అంతకు డబుల్ తీసుకెళ్లినా ప్రాబ్లమ్ లేదు కానీ కాస్త వింతగా ఈరోజు ప్రవర్తిస్తున్నావ్ అదే ఆశ్చర్యంగా ఉందని త్రిపుర అంటుంది. రిషి త్రిపురని ఆపి తనని ప్రశాంతంగా తిననివ్వండి నీకు ఎన్ని కావాలి అంటే అన్ని తీసుకెళ్లు మిథున అని రిషి అంటాడు. మిథున టిఫెన్ తీసుకెళ్తుంది.
మిథున ప్రవర్తనలో ఏదో తేడాగా ఉందని త్రిపుర అనుకుంటుంది. మిథున పడుకొని ఉన్న దేవాని నిద్ర లేని టిఫెన్ చేయడానికి లేపుతుంది. దేవా లేచి కూర్చొవడానికే చాలా ఇబ్బంది పడతాడు. టిఫెన్ తినలేకపోవడంతో మిథున తీసుకొని తినిపిస్తుంది. దేవా ఇబ్బంది పడితే ఏం పర్లేదు తిను అని తినిపిస్తుంది. అసలు ఎవరు వాళ్లు.. నిన్ను చంపేయాలి అన్న పగ ఏంటి అని అడుగుతుంది. పోస్టర్లు వేసిన వాడి గురించి తెలిసింది.. వాడిని పట్టుకోబోతే కాల్చేసి పారిపోయాడని అంటాడు. నిన్ను చంపాలి అని చూస్తున్నారు అంటే ఇది చాలా పెద్ద విషయం అని అర్థమైంది. దీని వెనక పెద్ద కుట్ర ఉంది.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. నేను జాగ్రత్తగా ఉండటం కంటే వాడు ఎవడో తెలుసుకోవాలి.. ఇప్పుడు మిస్ అయ్యాడు కానీ వాడు ఎవడో తేల్చుతా అని దేవా అంటాడు.
మిథున దేవాతో నీకు తెలిసి వాళ్లు.. అయిన వాళ్లు అంత మంది ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నీకు నేనే ఎందుకు గుర్తొచ్చాను.. నీ ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నాకే ఫోన్ చేయాలి అని నీకు ఎందుకు అనిపించింది అని దేవాని అడుగుతుంది. దేవా షాక్ అయిచూస్తాడు. కొంతమందికి కాల్ చేశా లిఫ్ట్ చేయలేదు.. కొంతమందికి కాల్ కలవలేదు.. నీ నెంబరు కనిపించింది అందుకే చేశా అని అంటాడు.
భాను దేవా కోసం వెతుకుతూనే ఉంటుంది. రాత్రి గ్యారేజ్ దగ్గరకు వెళ్తుంది. గ్యారేజ్‌తో దేవా ఎక్కడ నిన్నటి నుంచి ఇంటికి రాలేదు అని దేవా ఫ్రెండ్స్‌ని అడుగుతుంది. వాళ్లు తమకు తెలీదు అంటారు. మీకు తెలీకపోవడం ఏంట్రా అని అడుగుతుంది. పోస్టర్ వేసిన వాడి కోసం వెళ్లాడు.. తర్వాత మాకు కాల్ చేయలేదు.. ఇక్కడికి రాలేదు అని అంటారు. భాను షాక్ అయిపోతుంది. మిథున ఫ్యామిలీనే దేవాని ఏదో చేసుంటారని వాళ్లని వదిలిపెట్టను అని వెళ్తుంది.
భాను ఉదయం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దేవా కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తుంది. దేవా కనిపించడం లేదా అని ఎస్‌ఐ నవ్వుతాడు. దేవా కనిపించకుండాపోవడానికి జడ్జి కుటుంబమే కారణం అని హరివర్థన్ గన్ తీసుకొని రావడం పోస్టర్ల వెనక ఏదో కుట్ర ఉందని కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్‌కి భాను మొత్తం చెప్పి కంప్లైంట్ తీసుకోకపోతే ధర్మా చేస్తా మీడియాతో చెప్తా అని అంటుంది. పోలీస్ కంప్లైంట్ తీసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.