Bigg Boss 9 Telugu Thanuja AV Promo : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగు చివరిదశకు చేరుకుంది. దీనిలో భాగంగా టాప్ 5 కంటెస్టెంట్ల స్పెషల్ ఏవీలు ప్లే చేస్తున్నాడు బిగ్​బాస్. నిన్న ఇమ్మాన్యుయేల్ ఏవీ ప్లే చేయగా.. ఈరోజు తనూజకు చెందిన స్పెషల్ ఏవీ ప్రోమోను ప్లే చేశాడు. ఈ ప్రోమో ఫుల్ ఎమోషనల్​గా సాగింది. మరి ఈ ప్రోమో హైలెట్స్ ఏంటి? తనూజ గురించి బిగ్​బాస్​ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. తనూజ స్పెషల్..

తనూజ స్పెషల్ ఏవీ ప్లే చేసేందుకు పిలిచాడు బిగ్​బాస్. అక్కడ బిగ్​బాస్ సెటప్ చూసి.. తనూజ మైమరచిపోయింది. అన్ని ఫోటోలు చూస్తూ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. తనూజ.. తెరపై మీ నటన.. మీరు పలికించిన భావాలు.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు అని చెప్పారు. అలాగే బిగ్​బాస్​ తనూజ కోసం స్పెషల్​గా కాఫీని కూడా అక్కడ పెట్టారు. దానిని చూసి తనూజ హ్యాపీగా ఫీల్ అయింది. 

Continues below advertisement

బిగ్​బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు. ఇలాంటి కథన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని.. టాప్ 5లో ఒకరిగా నిలిచి.. ఎంత చిచ్చర పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. చిన్న విషయాలకు మనసు నొచ్చుకుని.. దూదిలాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం.. కత్తికి రెండు వైపులా పదునుగా ఉండే మీ వ్యక్తిత్వం.. అంటూ బిగ్​బాస్ చెప్పేసరికి థ్యాంక్యూ బిగ్​బాస్ అని చెప్తుంది తనూజ. 

ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి.. కుటుంబ సభ్యురాలిగా మారిన విధానమే తనూజ పుట్టస్వామి. అదే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది అని చెప్పగా.. ప్రేక్షకుల ప్రేమే తనని ఇక్కడి వరకు తీసుకువచ్చిందని చెప్పింది తనూజ. దీంతో తనూజ స్పెషల్ ఏవీ ప్రోమో ముగిసింది. ఈరోజు ఇంకెవరి ప్రోమో రానుందో.. ఎదురు చూడాల్సిందే.