Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మీద ఆదిత్య మనిషి అటాక్ చేస్తే మిథున కాపాడుతుంది. డాక్టర్‌కి ఆ విషయం చెప్పడంతో దేవాకి చాలా ప్రమాదం ఉందని.. దేవా మీద మళ్లీ అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఈ హాస్పిటల్‌లో ఉంచినా.. వేరే హాస్పిటల్‌లో ఉంచినా ప్రమాదమే అందుకే వాళ్లు అడుగుపెట్టడానికి వీల్లేని ప్లేస్లో దేవాని ఉంచాలని డాక్టర్ చెప్తారు. అంత సేఫ్ ప్లేస్ ఏం ఉందా అని మిథున ఆలోచనలో పడుతుంది.
దేవా కోసం దేవా కుటుంబంతో పాటు భాను, వాళ్ల అమ్మ కూడా కంగారు పడుతూ ఇంట్లో దిగులుగా కూర్చొని ఉంటారు. ఆనంద్, శ్రీరంగం మొత్తం వెతికి వచ్చి ఎక్కడా దేవా లేడు అని చెప్తారు. శారద, సత్యమూర్తి, భాను చాలా కంగారు పడతారు. కాంతం నవ్వుతూ తప్పిపోయిన కోడిపిల్లని వెతకడంలో అర్థముందికానీ గంప కింద నుంచి పారిపోయిన కోడిపిల్లని వెతకడంలో అర్థం లేదు అంటుంది. దేవాకి ఈ పెళ్లి ఇష్టం లేదు.. మిథునా మేడంని మర్చిపోలేక జంప్ అయిపోయాడని నవ్వుతుంది. శారద కోడల్ని కొట్టడానికి చేయి ఎత్తి ఆగిపోతుంది. పోనీలే అని ఊరుకుంటే నోటికొచ్చినట్లు వాగుతావా.. చంపేస్తా అని అంటుంది.
సూర్యకాంతం మాట్లాడిన దాంట్లో తప్పేముంది వదిన.. కనీసం పెళ్లి బట్టలు కూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు.. నిజంగానే దేవాకి పెళ్లి ఇష్టం లేదు అని భాను తల్లి రేణుక అంటుంది. భాను చాలా ఏడుస్తుంది. అడుగడుగునా నా రాజా నన్ను మాయ చేస్తున్నాడు.. పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయ చేసి పారిపోయాడు. నేను చచ్చిపోతే చూడటానికే ఇలా చేస్తున్నాడేమో అని ఏడుస్తుంది. సత్యమూర్తి భానుతో నీకు ఇప్పటికే మాట ఇచ్చాను ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది.. వాడు ఎక్కడున్నా ముహూర్తం టైంకి పెళ్లి జరిపిస్తా నువ్వు బాధ పడకుండా ఇంటికి వెళ్లు అని సత్యమూర్తి చెప్తారు. శారద కూడా మాటిస్తుంది.
మిథున దేవాని ఎవరూ చూడకుండా తన గదికి తీసుకొస్తుంది. తన గదిలోనే ఓ మూలకి ఎవరి కంటా పడకుండా పడక ఏర్పాటు చేస్తుంది. దేవాని తీసుకెళ్లి అక్కడ పడుకో పెడుతుంది. దేవా జరిగింది అంతా గుర్తొచ్చి ఉలిక్కి పడి లేస్తాడు. మిథునని చూసి కంగారు పడతాడు. మిథున అని అంటే మిథున వద్దని నోరుమూస్తుంది. మెల్లగా మాట్లాడమని అంటుంది. నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావ్ మిథున అంటే నిన్ను కాపాడటానికి అని అంటుంది. వేరే ఎక్కడైనా నన్ను పడేయాల్సింది కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని దేవా అడిగితే నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లా.. అక్కడ కూడా నీ మీద అటాక్ చేశారని జరిగింది చెప్తుంది. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావని అంటుంది. ప్రస్తుతం నీకు ఈ ప్లేస్ కంటే ప్రపంచంలో ఎక్కడా సేఫ్ ప్లేస్ లేదు.. నువ్వు ఇక్కడున్నావని ఎవరికీ తెలీదు.. ఒక వేళ తెలిసినా జడ్జిగారి ఇంట్లోకి రావడానికి ఎవరూ ధైర్యం చేయరు.. అని మిథున చెప్తుంది.
దేవా మిథునతో నన్ను ఇక్కడికి తీసుకురావడానికి మీ వాళ్లు ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతాడు. నువ్వు భలే జోకులేస్తావ్ దేవా వాళ్లకి తెలిస్తే ఊరుకుంటారా.. అందుకే ఎవరికీ తెలీకుండా తీసుకొచ్చా అని మిథున అంటుంది. ఇక్కడికి తీసుకురావడం చాలా పెద్ద ప్రమాదం కదా.. తెలిసి కూడా ఎందుకు తీసుకొచ్చావ్ అని దేవా అడిగితే నువ్వు క్షేమంగా ఉండాలనే ఆలోచించా అని అంటుంది. నా కారణంగా నువ్వు ప్రాబ్లమ్‌లో పడకూడదు నేను వెళ్లిపోతా అని దేవా అంటే మిథున వెళ్లనివ్వదు.
సత్యమూర్తి, శారద వీధి వీధి తిరుగుతూ దేవా కోసం వెతుకుతూ ఉంటారు. చివరకు గుడికి వెళ్లి దండం పెట్టుకుంటారు. దేవాకి ఏం జరిగిందో ఏంటో అని శారద చాలా కంగారు పడుతుంది. వాడి జీవితం ఇలా అయిపోవడానికి వాడే కారణం అని సత్యమూర్తి అంటాడు. ఒకప్పుడు ఒక మంచి విద్యార్థి.. కన్నవాళ్లకి దేశానికి మంచి పేరు తెస్తాడు అంటే వీధి రౌడీ అయిపోయాడు.. అంతటితో ఆగాడా ఒకమ్మాయి మెడలో తాళి కట్టి ఆమె జీవితం నాశనం చేశాడు. అక్కడితో ఆగాడా.. తనని జీవితం నుంచి గెంటేశాడు.. ఏం జరిగిందో ఏంటో వాడే భానుని పెళ్లి చేసుకుంటా అన్నాడు. తీరా పెళ్లి పనులు మొదలవ్వగానే పారిపోయాడు అని అంటాడు. దేవా పారిపోయే మనిషి కాదు అని శారద అంటుంది. దేవాకి ఏదో హాని జరిగిందని అనిపిస్తుందని శారద ఏడుస్తుంది.
హరివర్థన్ ఇంట్లో అందరూ టిఫెన్‌కి కూర్చొంటారు. మిథున ఇంకా రాలేదు అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. అలంకృత బావ మీద సెటైర్లు వస్తుంది. నువ్వు రాకపోయి ఉంటే బావ ఉపవాసం చేసేవాడని అంటుంది. మిథున కళ్లు చూసి రిషి రాత్రంతా పడుకోలేదా ఏంటి అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.