Chinni Serial Today Episode దేవా చిన్ని ఫొటో బాలరాజుకి ఇచ్చి త్వరలోనే చిన్నిని కూడా చంపేస్తా అంటాడు. బాలరాజు చిన్ని ఫొటోని హగ్ చేసుకొని నా చిన్ని తల్లికి అలా ఎప్పటికీ జరగనివ్వను అని అంటాడు. 

Continues below advertisement

మధు తల్లికి అబ్ధికం జరిపించి ఏడుస్తుంది. సుబ్బు, స్వరూపలు మధుకి ఓదార్చుతారు. ఇంతలో మ్యాడీ అక్కడికి వస్తాడు. ఇంత మంచి అమ్మకి దూరం అవ్వడం నా దురదృష్టం అయితే ఇంత బాగా చూసుకునే మీకు దగ్గర అవ్వడం నా అదృష్టం అంటుంది. మ్యాడీ వాళ్ల వైపు రావడం చూసి మధు వాళ్లు చాలా కంగారు పడతారు. మ్యాడీ దగ్గరకు రాకుండా స్వరూప అడ్డుకుంటుంది. మా అక్క ఆబ్దికం బాబు తనకు పిల్లలు లేకపోవడంతో మధు ఆబ్దికం జరిపించింది అని అంటుంది. 

మ్యాడీ నీతో ఏదో మాట్లాడాలి అని వచ్చాడు వెళ్లమ్మా అని మధుని పంపిస్తారు. మ్యాడీ వెళ్తూ మీ అమ్మ అక్కయ్యా అంటే నీకు అమ్మతో సమానం.. పైగా నిన్ను కూతురిలా చూసుకున్నారు.. అలాంటిది నేను ఇక్కడి వరకు వచ్చి మీ అమ్మకి ఆ పిండానికి నమస్కారం చేసుకోకుండా వెళ్లిపోకూడదు కదా అని కావేరి ఫొటో దగ్గరకు వెళ్తాడు. మ్యడీ వెళ్లే సరికి పెద్ద గాలి వీచి ఫోటో కింద పడిపోతుంది. మ్యాడీ ఫొటో తీసి షాక్ అయిపోతాడు. మధు వాళ్లు చాలా కంగారు పడతారు. తీరా చూస్తే ఫొటో మీద కుంకుమ నీళ్లు పడిపోతాయి.. దాంతో మ్యాడీ కావేరి ముఖం చూడలేకపోతాడు. కార్యక్రమం అయిన వరకు తుడొద్దు అని స్వరూప చెప్పి మధు, మ్యాడీలను మాట్లాడుకోమని పంపేస్తారు.             

Continues below advertisement

నాగవల్లి కోపంగా మ్యాడీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వెళ్లి మ్యాడీకి చిన్ని మీద కోపం ఉన్నప్పుడే శ్రేయతో పెళ్లి జరిపిస్తే బెటర్ అని అంటుంది. అందరూ అదే కరెక్ట్ అంటారు. నేను అదే అనుకుంటున్నా త్వరగా నిశ్చితార్థం జరిపించేస్తా అని అంటుంది. ఎంగేజ్మెంట్‌కి మధు రాకుండా చూడమని అంటుంది. నాగవల్లి లోహితతో నేను మధు మీద కోపంగా ఉండటానికి ఒక కారణం ఉంది.. మరి నీకు ఏం కోపం ఉంది.. పైగా నీకు వరుణ్‌కి దగ్గరుండి పెళ్లి చేసింది మరి నీకు కోపం ఎందుకు.. నీకు మధుకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అని అడుగుతుంది. శ్రేయని బాధ పెట్టేవాళ్లు నాకు శత్రువులు అవుతారు అని అంటుంది. లోహితతో వసంత మీ వాళ్లు ఇప్పటి వరకు రాలేదు.. నిశ్చితార్థానికి కచ్చితంగా వాళ్లు రావాలి రమ్మని చెప్పు అని అంటుంది. నేను మధుని ఇరికిద్దామని అనుకుంటే ఇలా ఇరుక్కున్నానేంటి అని లోహిత అనుకుంటుంది.

మధు, మ్యాడీ  మాట్లాడుకుంటూ ఉంటారు. మధుని బాధ పడొద్దని మ్యాడీ చెప్తాడు. నేనే ఆవిడ కూతురు అని ఎప్పుడు చెప్తానా అని మధు అనుకుంటుంది. చిన్న చిన్న కారణాలకు మనం ప్రేమించిన వాళ్లని మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు అని అంటుంది. కోపాన్ని దూరం చేసుకోవాలి అందరికీ దగ్గర అయిపోవాలని అంటుంది. మ్యాడీ చిన్ని గురించి తర్వాత చెప్తా అని అనుకొని వెళ్లిపోతాడు. మ్యాడీ బట్టలు సర్దుతాడు. ప్రమీల చూసి ఏంటి బట్టలు సర్దుతున్నావ్ అని అంటే అమెరికా వెళ్లిపోతున్నా అని అంటాడు. అమ్మానాన్నలకు చెప్పాలి అంటే చెప్తే వెళ్లనివ్వరు అందుకే చెప్పకుండా వెళ్లిపోతా అంటాడు. ప్రమీల ఎంత చెప్పినా మ్యాడీ వినకుండా వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.