Ammayi garu Serial Today Episode: కోమలి వల్లే మీనాన్న కోమాలోకి వెళ్లాడని అశోక్‌కు ఆమె తల్లి చెబుతుంది. పిండప్రధానం చేస్తుండగా అక్కడికి వచ్చిందని  చెబుతుంది. నిజం చెప్పడానికి సూర్య ఇంటికి వెళ్తామని మీనాన్న అంటే కిందపడేసి తీవ్రంగా గాయలయ్యేలా చేసిందని చెబుతుంది. దీంతో కోమలిపై అశోక్‌ కోపంతో రగిలిపోతాడు. దాని అంతు చూస్తానని అంటాడు. దీంతో వాళ్ల అమ్మ చాలా భయపడిపోతుంది.  ఇంతలో రాజు అశోక్‌ను  నిలువరిస్తాడు. కోమలి నన్ను ఇంత మోసం చేసిందని తెలిసిన తర్వాత చూస్తూ  ఎలా ఊరుకోగలను అంటాడు. నువ్వు కోమలి గురించి నిజం చెబితే చాలు...తనను జైలుకు ఎలా పంపాలో మేం చూసుకుంటామని రూప చెబుతుంది. ముందు నువ్వు కోమలిని కలిసి తను ఏంటో నువ్వు నేరుగా తెలుసుకోవాలని కదా అని అంటుంది. దీంతో అశోక్‌ కోమలికి ఫోన్ చేస్తాడు. తాను జైలులో లేనని ఇప్పుడు బయటకు వచ్చానని చెబుతాడు. నిన్ను ఒకసారి కలవాలని అనడంతో వెంటనే వస్తానని చెబుతుంది. మనం ఎప్పుడూ కలుసుకునే చోటే కలుద్దామని చెబుతాడు. దీంతో విజయాంబికకు చెప్పి కోమలి అతని వద్దకు పరుగెడుతుంది. దీంతో దీపక్‌ అయోమయానికి గురవుతాడు. మనకు తెలియకుండా వాడికి బెయిల్ ఎవరు ఇస్తారని అంటాడు. నాకు అదే అర్థం కావడం లేదని విజయాంబిక అంటుంది. అసలు వీడికి బెయిల్ ఎవరు ఇప్పించి ఉంటారని వాళ్లు తలలు బాదుకుంటారు.      కోమలి వెళ్లి అశోక్‌ను కలుస్తుంది.అసలు నువ్వు బయటకు ఎలా వచ్చావని అడుగుతుంది. నేను జైలులో ఉంటే ఒక్కసారి కూడా నన్ను కలవాలని నీకు అనిపించలేదా అని నిలదీస్తాడు. నేను ఉన్న పరిస్థితులు నీకు తెలిసి కూడా ఇలా ఎలా అడుగుతున్నావు అని కోమలి అంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా  రాజు,రూప నన్ను ఫాలోఅవుతూనే ఉన్నారని అంటుంది. మరి ఇప్పుడు ఎలా వచ్చావని అశోక్ నిలదీస్తాడు. నువ్వు పూర్తిగా మారిపోయావని అంటాడు.విజయాంబిక, దీపక్‌తో కలిసి నన్ను మోసం చేస్తున్నావని అంటాడు. దీంతో కోమలి బాధపడుతుంది. నీకు కలలో కూడా ద్రోహం చేయనని అంటుంది. నువ్వు చేసిన మోసం తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయాలనిపిస్తోందని అంటాడు. మానాన్నను ఆస్పత్రిపాలు చేశావని అంటాడు. ఈ విషయాలు అశోక్‌కు ఎలా తెలిశాయని కోమలి భయపడుతుంది. ఇంతలో అక్కడికి రూప, రాజు వస్తారు. వాళ్లను చూసిన కోమలి...వీళ్ల మాటలు పట్టించుకోవద్దని,మనల్ని విడదీసేందుకే వీళ్లు ప్లాన్ వేసి ఉంటారని అంటుంది. వీళ్లు మోసగాళ్లు అయితే నాకు బెయిల్ ఇచ్చి బయటకు ఎందుకు తీసుకొస్తారని అశోక్ నిలదీస్తాడు. నేను కావాలని మీనాన్నకు అపాయం తలపెట్టలేదని...అనుకోకుండా జరిగిపోయిందని ప్రాధేయపడుతుంది. ఇన్నాళ్లు నిన్ను నమ్మే నా జీవితం నాశనం చేసుకున్నానని అంటాడు.ఇప్పుడే వెళ్లి సీఎంకు నీ గురించి నిజం చెప్పేస్తానని అంటాడు.రాజు,రూపను తీసుకుని అశోక్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో వారికి విజయాంబిక,దీపక్ ఎదురవుతారు. రౌడీలను తీసుకుని వస్తారు. దీంతో వారిని రాజు అడ్డుకుంటాడు. ఈలోగా  అశోక్‌ను పారిపొమ్మని రూప చెబుతుంది.అతను పారిపోగానే రౌడీలు అశోక్‌ వెంటపడతారు. వారి వెనక రాజు కూడా పరుగెత్తుతాడు. దీంతో కోమలి విజయాంబికను నిలదీస్తుంది.అశోక్‌ను చంపమని చెప్పడమేంటని అడుగుతుంది. దీంతో వెనక తన కొడుకుని పంపిస్తుంది. ఆ ఆశోక్‌ రాజుకు దొరక్కుండా  క్షేమంగా  చూసుకోమని పురమాయిస్తుంది.       ఇంతలో రౌడీలు అశోక్‌ను పట్టుకుని ఓ గోదామ్‌లో కట్టిపడేస్తారు. రాజు,రూప వెళ్లి వెతికినా కనిపించడు. వాళ్లు అశోక్‌ను ఎక్కడ దాచారో కోమలికి తెలుసని.....వెళ్లి నాలుగు తగిలిస్తే అదే నిజం చెబుతుందని అంటుంది. ఇంతలో విజయాంబిక కోమలి మనసు మార్చే ప్రయత్నాలు చేస్తుంది. అశోక్‌ కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని తెలిసినా...వాడే ఇవాళ నిన్ను చంపాలని చూశాడని అంటుంది. వాడికోసమా నువ్వు ఇంత బాధపడుతున్నావు అని అంటుంది. డబ్బు నీచేతిలో ఉంటే  ఇలాంటి అశోక్‌లు వందమంది దొరుకుతారని చెబుతుంది. అశోక్‌ గురించి మర్చిపోమని అంటుంది. ఇంతలో రూప,రాజు ఇంటికి వచ్చి కోమలిని నిలదీస్తారు. రూప కోమలిపై చేయిచేసుకుని అశోక్‌ గురించి ఆరా తీస్తుండగా...సీఎం సూర్య వచ్చి రుక్మిణీపై చేయి చేసుకోబోతాడు. దీంతో మళ్లీ కోమలి కొత్త నాటకం ఆడటం మొదలుపెడుతుంది.