Nindu Manasulu Serial Today Episode విజయానంద్‌ టెన్షన్‌తో మందు తాగుతూ ఉంటాడు. ఇంతలో గణ కాల్ చేస్తాడు. మామ నన్ను తప్పుంచి ఈ పెళ్లి ఆపేయాలనే ఆలోచనలో ఉన్నావా ఏంటి అని అడుగుతాడు. విజయానంద్‌ మనసులో అదే ఉందిరా అనుకుంటాడు. గణ విజయానంద్‌తో నీ గురించి తెలిసే నా జాగ్రత్తలో ఉన్నాను అంటాడు. ఎన్ని సార్లు ఒకే టాపిక్ చెప్పి బెదిరిస్తావ్ అని విజయానంద్ అంటాడు. దానికి గణ నీ జుట్టు నా చేతిలో ఉందని నీకు గుర్తు చేయాలి కదా మామ అంటాడు. 

Continues below advertisement

విజయానంద్‌ మనసులో అంతా నా ఖర్మరా.. అయినా నేను జాగ్రత్తగా దాచుకున్న సీక్రెట్స్‌ ఎలా వీడికి దొరికాయని అనుకుంటాడు. ఇక గణ విజయానంద్‌తో నీ కొడుకు ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. వాడిని నువ్వే ఆపి ఈ పెళ్లి జరిగేలా చూడాలని అంటాడు. మామ నిన్ను బెదిరించాలి అని కాదు కానీ నీ కూతురు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అందుకే పెళ్లి చేసుకుంటున్నా.. ఈ పెళ్లి అయిన తర్వాత నీ కూతుర్ని ఆస్తిని.. నీ బిజినెస్‌లను అవసరం అయితే నిన్ను కూడా నేనే జాగ్రత్తగా చూసుకుంటా అని అంటాడు. ఈ పెళ్లిని సిద్ధూ ప్రేరణ ఆపాలని చూసినా మా మామ అడ్డుకుంటాడని అనుకుంటాడు.

విశ్వాసం విజయానంద్‌తో ఏమైంది చెప్పమని అంటే నేను ఒంటరిగా కాసేపు ఉంటా నన్ను వదిలేయ్ విశ్వాసం అని విజయానంద్ పంపేస్తాడు. ప్రేరణ గణని కలుస్తుంది. హాయ్ గణేశ్ గారు అని పలకరిస్తుంది. పిలుపులో తేడా ఉంది అని గణ అంటే నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలి అని మా నాన్న నాకు గణేశ్ అని పేరు పెడితే నువ్వు దాన్ని గణలా మార్చుకొని వేరేలా ప్రవర్తిస్తున్నావ్ ఇద్దరు అమ్మాయిల జీవితంతో ఆడుకుంటున్నావ్ అంటుంది. నువ్వేం అంటున్నావో అర్థం కావడంలేదు అని గణ అంటే అర్థం కావడం లేదా అని ప్రేరణ అన్నని లాగిపెట్టి కొడుతుంది. 

Continues below advertisement

తీరా చూస్తే గణ ప్రేరణ తనని కొట్టినట్లు ఊహించుకుంటాడు. ప్రేరణ గణతో ఏదో ఊహించుకున్నావ్ కదా.. అర్థమవుతుంది నీకు నేను అంటే భయం ఉందని..  అయినా వర్ష విషయంలో నువ్వేం చేస్తున్నావ్.. వర్షని మోసం చేస్తున్నావ్.. వర్షని మోసం చేసినట్లు సాహితికి కూడా మోసం చేస్తున్నావ్.. వర్షతో నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి తనని నువ్వే దొరికిపోతున్నావ్.. వర్ష నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. తనకు న్యాయం చేయ్..మధ్యలో సాహితిని ద్రోహం చేయొద్దు.. ఆడదాని ఉసురు మంచిది కాదు.. తనని పెళ్లి చేసుకోవద్దు అని అంటుంది. నేనేంటి వర్షని మోసం చేయడం ఏంటి.. తను నా ఫ్రెండ్‌.. నాకు నా ఫ్రెండ్‌కి ఇలాంటివి పెట్టడం తప్పు .. అయినా నువ్వు ఎవరు అని అడుగుతాడు. నేను ఎవరో నీకు తెలీదా అని ప్రేరణ అంటుంది. 

సాహితిని నేను ఇష్టపడ్డా.. సాహితికి నేను ఇష్టం మరి నేను సాహితికి మోసం ఎలా చేస్తా.. మా పెళ్లిని ఎవరూ ఆపలేరు అని అంటాడు. సాక్ష్యాలు లేవు కాబట్టి నువ్వు ఇలా అవుతున్నావ్.. నేను నీ పెళ్లి ఆపుతా.. ఆ తండ్రి రక్తం పంచుకొని నువ్వు పుట్టావో అదే అర్థం పంచుకొని నేను పుట్టాను.. నిన్ను వదలను.. నా వల్ల గర్వంగా తిరిగే మా నాన్నకి నీ వల్ల తలవంపులు వస్తే ఊరుకోను.. మర్యాదగా వర్షని పెళ్లి చేసుకో సాహితితో పెళ్లి ఆపేయ్ అని అంటుంది. 

ఆపకపోతే ఏం చేస్తావో అని గణ చెల్లిని అడుగుతాడు. నీ చొక్కా పట్టుకొని నడిరోడ్డు మీదకు లాగి ఈ పెళ్లి ఆపుతా అలా చేయకపోతే నేను రాజశేఖరం గారి బిడ్డనే కాదు అని వార్నింగ్ ఇచ్చి ప్రేరణ వెళ్లిపోతుంది.   నాతోనే ఛాలెంజ్ చేస్తుందా దీని అడ్డు తప్పించి అయినా నేను గెలవాలి అని గణ అనుకుంటాడు. సిద్ధూ ఇంట్లో పందిరి రాట వేస్తారు. పంతులు అమ్మాయికి మేనమామ ఉన్నారా అని అడుగుతాడు. లేరు అనడంతో తమ్ముడు అయినా అన్నయ్య అయినా వచ్చి పందిరి రాట నాటిస్తే మంచిది అంటారు. సాహితి, విజయానంద్ సిద్ధూని పిలుస్తారు. 

సిద్ధూ వచ్చి సాహితితో నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా.. అయినవాడు అయితే అన్నీ చేయమన్నారు.. లేదంటే పరాయివాడిలా పక్కన ఉండమన్నారు అయినా నేను ఫీలవ్వలేదు.. నీ జీవితం నీ భవిష్యత్‌ కోసం నేను ఏ నిర్ణయం తీసుకున్నానో దానికి పూర్తిగా కట్టుబడు ఉన్నాను.. అని చెప్పి వెళ్లిపోతాడు. విజయానంద్ వెళ్లి అమ్మ మీద అలిగితే ఎలా సిద్ధూ ఇది నీ చెల్లి పెళ్లి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని సిద్ధూ మీద చేయి వేస్తాడు. చేయి వదులు అని సిద్ధూ కోప్పడతాడు. నువ్వు అసలు తండ్రివేనా నువ్వు తండ్రిగా ఏదో తనకు మంచి జీవితం ఇస్తావని తను ఆశపడుతుంది. కానీ నువ్వు ఆ గణ గాడికి ఇచ్చి తన గొంతు కోస్తున్నావ్.. నీ స్వలాభం కోసం నువ్వు ఏదో చేస్తున్నావ్.. నువ్వు ఏదో దాస్తున్నావ్.. ఇప్పటికైనా నిజం చెప్పి పెళ్లి ఆపు.. నువ్వు ఆపవు అని నాకు తెలుసు అందుకే నీ ముఖం చూడాలి అంటే నాకు అసహ్యం అని సిద్ధూ వెళ్లిపోతాడు. నా టైం బ్యాడ్ అయి నీతో మాటలు అనిపించుకుంటున్నా నాకు టైం రాని అప్పుడు చెప్తా అని అంటుంది. విజయానంద్ పందిరరాట నాటుతాడు. 

గణ ప్రేరణ చాలెంజ్ గురించి ఆలోచిస్తాడు. వర్షతో నిజం చెప్పించిందా ఏంటి అని  వెంటనే వర్షకి కాల్ చేస్తాడు. వర్షతో పెళ్లికి రెడీగా ఉన్నావా బంగారం అని అంటాడు. గణ నువ్వు నన్ను మోసం చేస్తున్నావా.. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్.. నువ్వు నన్ను కాదని సాహితిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్ కదా అంటుంది. నీ మైండ్ ఎవరో డైవర్ట్ చేశారు ఎవరు వాళ్లు అంటాడు. లేదు వర్ష కాసేపట్లో మన పెళ్లి అది గుర్తుందా.. నువ్వు అన్నమాటలకు నాకు ఇప్పుడే చనిపోవాలని ఉందని అంటాడు. నిన్ను ప్రేరణే కదా ఇలా మాట్లాడించిందని అంటాడు. అవును అని వర్ష అంటుంది. ప్రేరణతో ఎందుకు మాట్లాడావని తిడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.