Podharillu Serial Today Episode: మాధవ్ పెళ్లి చేయాలంటే ఇల్లు రిపేర్ చేయించాలని బ్రోకర్ చెప్పడంతో అన్నదమ్ములు ఆపనులు మొదలుపెడుతుంటారు. ఈవిషయాన్ని గాయత్రి వాళ్ల ప్రెండ్ ఆమెకు చెబుతుంది. మా అమ్మ, మామయ్యకు బయపడకుండా ఇళ్లు బాగుచేయించుకోవడం చూసి గాయత్రి ఆనందపడిపోతుంది. కానీ వాళ్లు ప్రెండ్ అసలు విషయం చెబుతుంది. పెళ్లికోసమే ఇల్లు బాగుచేయించుకుంటున్నారని చెప్పడంతో షాక్ తింటుంది. ఆడపిల్ల సంబంధం వాళ్లు రానున్నారని చెబుతుంది. మీ బావ నీకు దక్కాలంటే ఆ ఇంటి రిపేర్ పనులు ఆపించాలని చెబుతుంది. దీంతో వెంటనే వెళ్లి ఈ విషయం వాళ్ల అమ్మకు చెబుతుంది. దీంతో తాయరు అగ్గిమీద గుగ్గిలమవుతుంది. అటు మాధవ్ సహా తమ్ముళ్లు అందరూ కలిసి ఇంటి రిపేర్ పనులు మొదలుపెడతారు. సిమెంట్ తో ప్యాచ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈలోగా అక్కడికి తాయర్‌తో కలిసి నారాయణ వాళ్ల అన్నయ్య వస్తారు. కోర్టుతీర్పు ఉన్నా సరే ఎంత ధైర్యం ఉంటే ఇంటి రిపేర్ పనులు మొదలుపెడతారని మండిపడతారు. కోర్టు కేసు వచ్చేలోగా ఇంటిపై చేయి వేస్తే ఊరుకునేదే లేదంటారు. ఇల్లు మొత్తం పడగొట్టి కట్టించడం లేదని...చిన్న చిన్న రిపేర్‌లు చేయిస్తున్నామని మాధవ్ అంటాడు. ఇంటి మీద చేయి వేస్తే పోలీసు కేసు పెడతామని తాయరు అంటుంది. మళ్లీ తాయర్ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టడంతో చెల్లిను కొట్టేందుకు నారాయణ సైకిల్ పైకి ఎత్తుతాడు. దీంతో మాధవ్ వాళ్ల అత్తను ఒప్పించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎలాంటి రిపేర్ పనులు చేయబోమని చెబుతాడు. మహా చేసిన పనికి పిచ్చకోపంతో రగిలిపోతుంటాడు భూషణ్..హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చిన తర్వాత చిందులు తొక్కుతుంటాడు.నువ్వు ఇంత కోపం ప్రదర్శస్తే ఆ అమ్మాయి ఎలా పెళ్లిచేసుకుంటుందని వాళ్ల సముదాయిస్తుంటుంది. ఇంతలో ఆది వెళ్లి పెళ్లికొడుక్కి సారీ చెప్పి బ్రతిమాలుడుతాడు. రోడ్డుమీద వెళ్లే ఓ డ్రైవర్‌కు సపోర్ట్ చేసి నన్ను అవమానపరుస్తుందా అంటాడు. నా పరువు మొత్తంపోయిందని మండిపడతాడు. నేను తప్పుచేసినా సరే నువ్వు దాన్ని కరెక్ట్ అని చెప్పాలి అంటాడు. దీంతో ఇద్దరూ గొడవపడుతుంటే హారిక ఆపి మహాను రూమ్‌లోకి తీసుకెళ్తుంది. ఆది వచ్చి మహామీద కోప్పడతాడు.ఎందుకు ఎదురుమాట్లాడుతున్నావని మండిపడతాడు.వాడు తప్పుచేసినా కరెక్టే అని సపోర్ట్ చేయడం ఏం న్యాయం అని మహా నిలదీస్తుంది. చిన్నప్పటి నుంచి వాడ్ని అలాగే పెంచామని వాళ్ల అమ్మ చెప్పింది కదా...నువ్వు కొంచెం తగ్గి ఉండొచ్చు కదా అని ఆది మహాకు సర్ధిచెబుతుంటాడు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పకుండా గొప్ప పని చేశావని నెత్తిన పెట్టుకోమంటావా అని మహా మండిపడుతుంది. వాడితో జీవితాంతం కలిసి ఉండాల్సిన దానివి ఆ మాత్రం సర్దుకుపోలేవా అని అంటాడు. వాడిని ఒక్కపూట భరించడమే కష్టమని...జీవితాంతం ఎలా భరిస్తానని అంటుంది. కొత్తలో అలాగే ఉంటుందని...రానురాను అతని ఇష్టాలకు అనుగుణంగా మారిపోవచ్చని అంటాడు. దీంతో మహాకు మరింత కోపం వస్తుంది. నువ్వు అసలు నా అన్నవేనా అని నిలదీస్తుంది. మీరు ఏం చేసినా అతనే నీకు కాబోయే మొగుడని...అతనితో ఎలా నడుచుకోవాలో నేర్చుకోమని చెబుతాడు.
చక్రికి వాళ్ల కారు ఓనర్ ఫోన్ చేసి జూబ్లిహిల్స్‌లో ఓ కారుకు డ్రైవర్‌గా వెళ్లాలని చెబుతాడు. కొద్దిరోజులు పాటు అక్కడే పనిచేయాలని చెబుతాడు. ఇంతలో గాయత్రి మాధవ్ కోసం జున్ను తీసుకుని వస్తుంది. మీ ఇల్లు బాగుచేయకుండా మా అమ్మవాళ్లు అడ్డుకున్నారంటగా అని జాలిపడుతుంది.