Illu Illalu Pillalu Serial Today Episode చందు తండ్రికి అమూల్య గురించి నిజం చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నర్మద కిచెన్‌లో కాఫీ పెడుతుంటే ప్రేమ గుడ్ మార్నంగ్ చెప్తుంది. అప్పుడే లేస్తావని అనుకోలేదు.. రాత్రంతా మీ గదిలో నుంచి పాటలు డ్యాన్స్‌లు వినిపించాయని ప్రేమని ఆటపట్టిస్తుంది. కళ్లు ఎరుపెక్కాయి ఏదో అయింది అని ఆట పట్టిస్తుంది. అంత లేదు అక్కా అని ప్రేమ అంటుంది.
నర్మద, ప్రేమల దగ్గరకు వేదవతి కూడా వచ్చి ఏంటో అప్పుడే గుసగుసలు అని అంటుంది. మేం యూత్ మేం ఏదో మాట్లాడుకుంటున్నామని అంటుంది. ఏంటే యూత్ రొమాన్స్ అంటున్నావ్..నేను మా ఆయన రాత్రి లేత గాలిలో ఎలావెళ్లామో తెలుసా అని వేదవతి అంటే వణుకుతూ వెళ్లుంటారులే ముసలి వాళ్లు కదా అని అంటుంది. ఎవరే ముసలి ఎవరే ముసలి అని వేదవతి అరుస్తుంది. మేం ఒకే కూల్‌డ్రింక్లో రెండు స్ట్రాలు అంటే మేం ఇక్కడ పాటలు డ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశామని అంటుంది. మీరు ఎంజాయ్ చేయడానికి నన్ను పంపేశారా అని వేదవతి అంటే దానికి ప్రేమ మీరు మామయ్య సరదాగా వెళ్లాలి అని అక్క అలా రెచ్చ గొట్టి పంపిందని ప్రేమ చెప్తుంది.
వేదవతి గవర్నమెంట్ కోడల్ని పొగిడేస్తుంది. ఇక ప్రేమతో మనం ఇంతలా సరదాగా మాట్లాడుతూ ఉంటే ఆ వల్లీ కుళ్లులో గోడ చాటుగా నిల్చొని వినేయాలి కదా అంటుంది. వల్లీ మాత్రం ఇంకా గుర్రు పెట్టి నిద్ర పోతూ ఉంటుంది. రామరాజు ఇంటికి వస్తే చందు ఎదురెళ్లి నీకో విషయం చెప్పాలి నాన్న అంటాడు. వేదవతి వచ్చి నేను అడిగినా చెప్పడం లేదు అంటుంది. మీ అమ్మకి కూడా చెప్పని అంత ముఖ్యమైన విషయం ఏంట్రా అని అడిగితే అమూల్య కోసం అని చందు చెప్తాడు. ఆ మాట గదిలో ఉన్న వల్లీ ఉలిక్కి లేచి పరుగులు పెడుతుంది. చందు విషయం చెప్పబోతే ఇంతలో వల్లీ పరుగున వచ్చి అమూల్యని ఈయన రోజు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి అని అనుకుంటున్నారని కంగారుగా చెప్తుంది.
రామరాజు కోడలితో మరి రాత్రి ఇంటి పరువు గురించి అని అన్నాడు. అమూల్యని కాలేజ్‌లో డ్రాప్ చేయడానికి పరువుకి సంబంధం ఏంటి అని అంటాడు. అమూల్యని ఒంటరిగా పంపిస్తే పోకిరీ వెధవలు అల్లరపెడితే మన ఇంటి పరువుపోతుంది కదా అదే అని అంటుంది. ఇంటి పెద్ద కొడుకు అనిపించుకున్నావ్‌రా ఈ రోజు నుంచి నువ్వే అమూల్యని డ్రాప్ చేసి తీసుకురా అని రామరాజు చెప్తాడు. చందు అయినా కూడా నిజం చెప్పాలి అనుకుంటే వల్లీ భర్త బండి ఎక్కించి ఆడబిడ్డని పంపేస్తుంది.
వల్లీ లోపలికి వెళ్తూ ఇప్పుడే అగ్నిపర్వతం దిగింది అనుకుంటూ లోపలికి వెళ్తుంటే నర్మద, ప్రేమల అక్కాయ్ అనుకుంటూ వస్తారు. వల్లీ టెన్షన్‌తో గ్యాప్ ఇయ్యండే అని అనుకుంటుంది. ఇద్దరూ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ ఇంకా తీసుకురాలేదు అని అంటారు. నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు కదా మామయ్యకి అబద్ధం చెప్పి మోసం చేశారు కదా అంటారు. అబద్ధం చెప్పడం మా ఇంటా వంటా లేదు.. హరిశ్చంద్ర వంశం మాది అని అంటుంది. మరి సర్టిఫికేట్లు ఇంకా రాలేదు ఏంటమ్మా అని రామరాజు అడుగుతాడు. వల్లీ బిత్తరపోతుంది.
రామరాజు వల్లీతో నువ్వు నిజంగానే ఎంఏ ఇంగ్లీష్ చదివావా.. ఫోన్‌లో మాట్లాడు అంటే యాయా అంటున్నావ్ అని నిలదీస్తాడు. ఇంతలో భాగ్యం, ఆనంద్‌రావు వస్తారు. భాగ్యం రామరాజుతో మా అమ్మాయి ఎంఏ సర్టిఫికేట్ తీసుకొస్తుంది. భాగ్యం రామరాజు చేతిలో సర్టిఫికేట్లు పెడితే రామరాజు కోడళ్లకి ఇచ్చి ఇవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూడండి అని అంటాడు. ప్రేమ సర్టిఫికేట్లు అన్నీ చూస్తూ ఉంటుంది. ఇద్దరూ కోపంగా చూడటం చూసి వేదవతి ఏంటే అలా చూస్తున్నారు.. కొంప తీసి అవి దొంగ సర్టిఫికేట్లా అని అడుగుతుంది. భాగ్యం వాళ్లు చాలా టెన్షన్ పడతారు. ప్రేమ ఒరిజినలే అని అంటుంది. ఈ సర్టిఫికేట్లు తీసుకొని జాబ్‌లో జాయిన్ అవ్వు అక్కా అని అంటుంది. వేదవతి కూడా వెళ్లమని అంటుంది. వల్లీ కంగారు పడిపోతుంది. ప్రేమ మామయ్యతో మీరు ప్రిన్సిపల్‌తో మాట్లాడి వల్లీ అక్క కోసం జాబ్ అడగండి అని అంటుంది. రామరాజు సరే అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.