Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవా మాట్లాడుతూ ఉంటే రిషి వచ్చి మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలుసు అని సీరియస్‌గా మాట్లాడటంతో ఇద్దరూ తన పెళ్లి గురించి రిషికి తెలిసిపోయిందేమో అని కంగారు పడతారు. కానీ రిషి మాత్రం మీరు అనుకోకుండా కలిశారు.. మాట్లాడుకుంటున్నారు అంతే కదా అని అంటాడు. ఇద్దరూ నిజం రిషికి తెలీలేదని అనుకుంటారు.
దేవా నువ్వు నా గురించే మిథునకు చెప్తున్నావ్ కదా.. నా ఫ్రెండ్ రిషి చాలా మంచోడు నిన్ను బాగా చూసుకుంటాడు అనే కదా చెప్తున్నావ్ నాకు తెలుసురా అని దేవాని హగ్ చేసుకుంటాడు. రిషి మిథునతో నువ్వు నాకు చెప్పకుండా వచ్చావని కాస్తా కోపం వచ్చింది.. కానీ పర్లేదులే ఇలా రావడం వల్ల నా ఫ్రెండ్‌ని కూడా కలిశావ్ హ్యాపీగా ఉంది అని అంటాడు. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి బయల్దేరుతారు. రిషి మిథున చేయి పట్టుకొని తీసుకెళ్లడం చూసి దేవా చాలా బాధ పడతాడు.
దేవా ఇంట్లో అందరూ సందడిగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులకు బట్టలు పెట్టే కార్యక్రమం మొదలు పెడతారు. కాంతం భర్తతో మన దరిద్రానికి తగ్గట్టు పెళ్లి కూతురికి 500 రూపాయల చీర పెడతారు అని అనుకుంటుంది. అత్త దగ్గరకు వెళ్లి పట్టు చీర పెట్టలేక తక్కువ రేటుది పెట్టారా అంటే దానికి శారద అది ఓరిజినల్ పట్టు చీరే 10 వేలు అని చెప్పగానే కాంతం గుండె జారిపోతుంది. ఇంత ఖరీదైన చీర కొనడానికి డబ్బు ఎక్కడిది అంటే మీ ఆయన ఇచ్చాడని అంటుంది. కాంతం బిత్తరపోతుంది. నేను ఇవ్వలేదే అని రంగం అంటాడు.
ఇంతలో భాను వాళ్ల వస్తారు. భానుతో కాంతం ఇక నుంచి నువ్వు నా పార్టీనే కదా ఇంతకు ముందు మిథున మిగతా అందరితో ఉండేది అని అంటుంది. శారద కాంతాన్ని తిడుతుంది. సత్యమూర్తి రాగానే భాను ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక దేవా రాగానే దేవా డ్రస్ చూసి భాను ఈ డ్రస్‌లో ముద్దొస్తున్నావ్ అని బుగ్గలు గిల్లేస్తుంది. అందరూ నవ్వుకుంటారు.
దేవా, భాను పక్కపక్కనే కూర్చొని ఉంటారు. ఇద్దరికీ బట్టలు పెట్టే టైంలో దేవాకి తన ఫ్రెండ్స్ కాల్ చేసి పోస్టర్లు పెట్టిన వాడు దొరికాడని అంటారు. దేవా ఉన్నపళంగా వెళ్లిపోతాడు. సత్యమూర్తి, శారద ఎంత చెప్పినా వినడు. మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు అంటే ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని రేణుక అంటుంది. ఈ పెళ్లి జరగకపోతే నేను నా కూతురు మీ నట్టింట్లోనే ప్రాణాలు తీసుకుంటాం గుర్తుంచుకోండిఅని అంటుంది. ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది మేం ఇద్దరం మీకు మాటిస్తున్నాం అని సత్యమూర్తి అంటారు.
దేవా పోస్టర్లు అతికించిన వ్యక్తిని చితక్కొట్టి ఎవరు ఈ పోస్టర్లు వేయించారో చెప్పరా అని కొడతాడు. ఎంత కొట్టినా అతను తనకు తెలీదు అంటాడు. దేవా అతనితో ఫోన్ చేయించి రమ్మని చెప్పమని అంటాడు.
మిథున ఇంట్లో మెహందీ వేడుక మొదలవుతుంది. అందరూ ఆరుబయట కూర్చొని మిథున, రిషిలను తీసుకొచ్చి కూర్చొపెడతారు. రిషి అత్తామామలతో నాకు కాబోయే భార్యకి నేను మెహందీ పెడతా అని పర్మిషన్ అడుగుతాడు. ఇక అలంకృత చీటీలు తీయాలి అని అందులో ఏ పాట వస్తే దానికి జంటలు డ్యాన్స్ చేయాలి అంటుంది. ముందుగా హరివర్థన్, లలితలు గోదారి గట్టుమీద రామచిలుకవే అని డ్యాన్స్ చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.