Chinni Serial Today Episode మ్యాడీకి అనుమానం రాకుండా మధు ఆఫ్‌ టికెట్‌కి దండం పెట్టి దయచేసి మీకు చిన్ని గురించి ఏం తెలిసినా చెప్పండి అని అంటుంది. నా మీద ఒట్టమ్మా నాకు తెలీదు అని ఆఫ్ టికెట్ అంటాడు. తనకు తెలీదు అంటున్నారు కదా వదిలేయ్ మ్యాడీ అని మధు చెప్తుంది. మ్యాడీ కోపంగా వెళ్లిపోతాడు.

Continues below advertisement

మధుతో ఆఫ్ టికెట్‌ నువ్వే చిన్ని అని చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావ్.. చెప్తే ఏం జరుగుతుందో అని భయంలో నేను ఉన్నానని అంటాడు. చెప్తే నేను మహికి శాశ్వతంగా దూరం అయిపోతా అని అంటుంది. ఆఫ్ టికెట్ మనసులో దూరం అయిపోవడం కాదు.. నిన్ను, అన్నని కాల్చేస్తాడని అనుకుంటాడు. నాకు మహి దూరం అయినా పర్లేదు కానీ అమ్మని తాను అపార్థం చేసుకోకూడదు.. అబద్ధాన్ని నిజం అని నమ్మే వాళ్లు నిజం నమ్మాలి అంటే బలమైన సాక్ష్యాలు ఉండాలి అని అలాగే మ్యాడీకి నిరూపిస్తా అని మధు అంటుంది. 

ప్రోగ్రాం మొదలవుతుంది. రెండో రౌండ్‌లో ఓ సీన్ చెప్తాం అందరూ  స్పాట్‌లో యాక్ట్ చేయాలని అంటారు. అందరూ యాంకర్ చెప్పిన సీన్‌కి యాక్ట్ చేస్తారు. ఇక మ్యాడీ, మధు వస్తారు. వాళ్లకి యాంకర్ మధు పేరు చిన్ని అని మ్యాడీ పేరు బన్నీ అని చెప్పి ఇద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ పెద్దయ్యాక లవర్స్ అయ్యారని ఈలోపు చిన్ని వాళ్ల అమ్మ బన్నీ వాళ్ల అమ్మని చంపింది అని బన్నీకి తెలిసిన తర్వాత మొదటి సారి చిన్ని, బన్నీ కలుసుకున్నారు అది సీన్ అని చెప్పి యాక్ట్ చేయమని అంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ సీన్ నాగవల్లి యాంకర్‌కి చెప్పి మధు  వాళ్లతో ఈ సీన్ చేయించమని చెప్తుంది. సీన్ వినగానే మ్యాడీ, మధు షాక్ అయిపోతారు. మధు వైపు దేవా సీరియస్‌గా చూడటం నాగవల్లి చూసి బావ ఇలా చూస్తున్నారేంటి అని అంటుంది. 

Continues below advertisement

మధు చిన్నిలా మారిపోయి ఏమైంది బన్నీ నాతో మాట్లాడవా అని అడుగుతుంది. నీతో మాట్లాడటం కాదు నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు.. నువ్వు ఒక హంతకురాలి కూతురివి.. అవును చిన్నీ మా అమ్మని చంపిన హంతకురాలి కూతురివి నువ్వు అని అంటాడు. మన ఇద్దరినీ దూరం చేయడానికి నీకు ఎవరో అబద్ధం చెప్పారు అని అంటుంది. నువ్వు మంచిదానివి అని నేను నిన్ను ప్రేమించాను.. నేను జీవితంలో చేసిన ఒకే తప్పు నా తల్లిని చంపిన హంతకురాలి కూతుర్ని ప్రేమించడం.. అని అంటాడు. 

మధు  ఏడుస్తూ మ్యాడీ కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటుంది. మధు నటన చూసి దేవాకి తనే చిన్నినా అని అనుమానం వస్తుంది. అందుకేనా ఆఫ్ టికెట్‌తో మాట్లాడిందా అని అనుకుంటాడు. బన్నీ మా అమ్మకి అయినా మీ అమ్మకి అయినా ప్రాణాలకు తెగించి ప్రాణం పోయడమే తెలుసు కానీ ప్రాణాలు తీయడం తెలీదు.. అమ్మ అంటే దేవుడికి ప్రతిరూపం.. దేవుడు ఎప్పుడూ ప్రాణాలు తీయడు.. అర్థం తెలియని వయసులోనే మన స్నేహం ప్రేమగా మారింది. ప్రేమంటే ఒకరి కోసం ఒకరు బతకడం కాదు.. అవసరం అయితే ఒకరి కోసం ఒకరు చావడం.. నా ప్రేమలో ఏమైనా లోపం ఉంటే నా ప్రేమ వల్ల నువ్వు బాధ పడితే నన్ను నేను చంపుకోగలను కానీ నీ మీద ప్రేమని చంపుకోలేను అని మధు కింద పడి ఏడుస్తుంది. 

మ్యాడీ ఏడుస్తున్న మధుని పైకి లేపి అమ్మ తప్పు చేయదు.. అమ్మ చేస్తే అది తప్పు కాదు అని నువ్వు చిన్నప్పుడు అన్నావ్.. కానీ నేను ఆ మాట మర్చిపోయి మీ అమ్మ తప్పు చేసిందని అనుకోవడం నా తప్పు ఐలవ్‌యూ చిన్ని అని మ్యాడీ మధుని హగ్ చేసుకుంటాడు. అందరూ బిత్తరపోతారు. మన ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు.. మనం ఒకరి కోసం ఒకరు పుట్టాం.. ఒకరి కోసం ఒకరు బతుకుదాం.. ఒకరి కోసం ఒకరు చనిపోదాం అని మధుని హగ్ చేసుకుంటాడు. నాగవల్లికి చాలా పెద్ద షాక్ ఇది.. తన ప్లాన్ తనకే రివర్స్ అయిపోయింది. 

అందరూ క్లాప్స్ కొడతారు. మ్యాడీ ఇంతలో రివర్స్ అయి నువ్వు చెప్పిన సెంటిమెంట్ డైలాగ్స్‌కి నేను ఇలా రియాక్ట్ అవుతాను అనుకున్నావ్ కదా. కానీ నువ్వు ఎప్పటికీ నా తల్లిని చంపిన హంతకుాలి కూతురివే.. నేను నిన్ను జీవితంలో ప్రేమించను.. జీవితంలో క్షమించను.. నీ ముఖం చూడను.. గుడ్‌బై అని చెప్పి వెళ్లిపోతాడు. మధు చాలా ఏడుస్తుంది.  ప్రోగ్రాం యాక్టివిటీస్ అయిన తర్వాత దేవా మాట్లాడుతాడు. మ్యాడీ, మధుల సీన్ చాలా బాగుంది అని పొగుడుతాడు. ఇక బెస్ట్ యూత్‌ కపుల్‌గా మధు, మ్యాడీ గెలిచారని చెప్పి దేవ చేత గిఫ్ట్ ఇప్పిస్తారు. నాగవల్లి మధుకి కంగ్రాట్స్ చెప్పి హగ్ చేసుకొని చెప్పాను కదా మావాడి చేత చీ కొట్టిస్తాను అని ఇప్పుడు హ్యాపీనా అని అంటుంది. ఇక నాగవల్లి మధుతో కొంచెం దూరం జరుగుతావా ఫ్యామిలీ ఫొటో తీసుకోవాలి అని అంటుంది. దేవా, నాగవల్లి, మ్యాడీ ఫొటో తీసుకుంటారు. ఇక దేవా మధునే చిన్నినా అని నాగవల్లిని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.