Illu Illalu Pillalu Serial Today Episode వేదవతి భర్తని ఒప్పించి రాత్రి సినిమాకి వెళ్లడానికి రెడీ అయిపోతుంది. నర్మద, ప్రేమ బయట వల్లీ టెన్షన్‌గా తిరగడం చూస్తారు. ప్రేమ నర్మదతో ఈ టైంలో కూడా ఆ బల్లి అక్కడ అంత టెన్షన్‌గా తిరుగుతుంది అంటే ఏదో చేయబోతుంది అక్క పద రెండు పీకి విషయం అడుగుదాం అంటుంది. నర్మద ఆపి ఏం చేస్తుందో చూద్దాం అని అంటుంది.

Continues below advertisement

చందు ఇంటికి వస్తాడు. చందుని చూసి ఈయన ఇంత కోపంగా ఉన్నారు అంటే మామయ్యకి అమూల్య, విశ్వల గురించి చెప్పేస్తాడని అనుకుంటుంది. భర్తని ఇంట్లోకి వెళ్తుంటే నీతో మాట్లాడాలి బా అని ఆపడానికి ప్రయత్నిస్తుంది. నాన్నతో మాట్లాడాలి అని చందు అంటే అడ్డుకుంటూనే ఉంటుంది. నర్మద, ప్రేమలు ఏదో చేస్తుందని అనుకుంటారు. 

చందు లోపలికి వెళ్తుంటే వల్లీ చాలా టెన్షన్ పడుతుంది. సినిమాకి రెడీ అయి హాల్‌లో ఉంటే చందు వెళ్లి మీకు ఓ విషయం చెప్పాలి నాన్న ఇది మన పరువుకి సంబంధించినది.. మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా అంటాడు. ఏంట్రా విషయం అని రామరాజు అడిగితే అది మన అమూల్య అని చెప్పేలోపు వల్లీ పరుగున వచ్చి పడిపోయి కాలు నొప్పి అని అరుస్తుంది. అందరూ వల్లీ దగ్గరకు వెళ్లిపోతారు. నర్మద ప్రేమతో డ్రామా మొదలెట్టింది అని అంటుంది. 

Continues below advertisement

నర్మద చందుతో బావ మేం చూసుకుంటాం మీరు వెళ్లండి ముఖ్యమైన విషయం మాట్లాడండి అని అంటే వల్లీ చందుని వదలదు.. నువ్వు నా దగ్గరే ఉండు అని అంటుంది. నర్మద, ప్రేమలు తీసుకెళ్తామంటే వద్దు బా తీసుకెళ్లాలి అంటుంది. మొత్తానికి వల్లీ నాటకం వల్ల చందు విషయం చెప్పకుండా ఆగిపోతాడు. రామరాజు, వేదవతి సినిమాకి వెళ్లిపోతారు. వల్లీ మనసులో ఇప్పటికి ఆపేశా.. ఇక ఎప్పటికీ చెప్పకుండా ఆపేయాలని అనుకుంటుంది. 

నర్మద, ప్రేమలకు వల్లీ పార్క్ ప్రవర్తన ఇప్పటి ప్రవర్తన అన్నీ గుర్తొచ్చి ఏదో చేస్తుందని ఏం అర్థం కావడం లేదు అనుకుంటారు. మరో వైపు తన స్వప్న సుందరి మిస్ అయిపోయిందని తిరుపతి తెగ బాధ పడిపోతుంటాడు. ఇంతలో తిరుపతికి స్వప్న సుందరి కాల్ చేస్తుంది. ఒక్క సారి కనిపించవా అని తిరుపతి అంటే మెరుపు తీగలా వచ్చి పోతుంది. తిరుపతి తనతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయావేంటి అంటే ఇలా ప్రేమించుకుంటేనే బాగుంటుందని ముద్దు పెట్టి ఫోన్ కట్ చేస్తుంది. నా స్వప్న సుందరి వాయిస్‌ ఇంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటుందో అని తిరుపతి అనుకుంటాడు. తీరా చూస్తే తిరుపతి స్వప్న సుందరి ఓ ట్రాన్స్. తిరుపతి పార్క్‌కి రా అని ఉన్న లెటర్ విసరడంతో ఆమె తీసుకొని తిరుపతితో లవ్‌లో పడిపోతుంది. భవిష్యత్‌లో తిరుపతికి ఈ విషయం తెలిస్తే షాక్ మూమూలుగా ఉండదు.

శ్రీవల్లి చందుకి విషయం అడుగుతుంది. చందు చెప్పను అంటే నేను నీ భార్యని బావ.. నాకు చెప్పకుండా దాస్తున్నావ్.. నేను నీలో సగం కష్టం అయినా సుఖం అయినా మనమే పంచుకోవాలి కదా అసలేం జరిగిందో చెప్పు అంటుంది. దానికి చందు పార్క్‌లో అమూల్యని విశ్వతో చూశాను,, అమూల్య ఆ విశ్వగాడితో ప్రేమలో ఉందనుకుంటా అని అంటాడు. వల్లీ షాక్ అయినట్లు మాట్లడుతుంది. నాన్నకి చెప్పి అమూల్యకి బుద్ధి చెప్పిస్తా అని అంటాడు. అలా చెప్తే మీ నాన్న, చెల్లి చనిపోతారని వల్లీ అంటుంది. అమూల్య విషయం మీ నాన్నకి చెప్తే అమూల్య సూసైడ్ చేసుకుంటుందని అంటుంది. చందు నమ్మి భయపడిపోతాడు. ఒక వేళ అమూల్య బండోడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది అంటే మీ నాన్న గుండె పగిలిపోతుందని అంటుంది. వల్లీ మాటలకు చందు చాలా భయపడిపోతాడు. 

అమూల్యకి విశ్వ మోసం చేస్తున్నాడు అని నేను తనని సర్ది చెప్పి వాడి వెనక తిరగకుండా చూస్తా అని అంటుంది. వల్లీ బయటకు వెళ్లి పెద్ద గండం గట్టెక్కిందని అనుకుంటుంది. ప్రేమ, నర్మద చూసి ఈ నాటకం వెనక ఏదో ఉంది అక్క ఈ వల్లీ ఏదో చేస్తుందని అనుకుంటారు. వల్లీ తనని తాను పొగుడుకుంటూ గెంతులు వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.