Jagadhatri Serial Today Episode: అనాథ ఆశ్రమంలో పిల్లల కోసం జగధాత్రి కుటుంబం  భోజనాలు రెడీ చేయగా...అందులో హోంమినిష్టర్ తాయర్ అనుచరుడు విషం కలుపుతాడు. ఇంతలో ఫుడ్‌ మొత్తం రెడీ చేయగా...ముందుగా అన్ని పదార్థాలను  ఒక ప్లేట్‌లోకి తీసి శ్రీవల్లి పక్కన పెడుతుంది. తమను అనాథలుగా చేసిన తల్లిదండ్రుల కోసం ఇలా పెట్టడం ఆనవాయితీ అని చెబుతుంది. ఆ ప్లేట్‌లో అన్నం, కూరలను  ఓ ఎలుక వచ్చి తింటుంది.                       

Continues below advertisement

                              జగధాత్రి స్వయంగా  మంచిమంచి వంటకాలు సిద్ధం చేసిందని..అందరూ కడుపునిండా తినాలని పిల్లలకు  హోంమినిష్టర్‌ చెబుతుంది. ఆమె ప్రవర్తన తేడాగా ఉండటంతో జగధాత్రితోపాటు  వైజయంతి,నిషికకు కూడా అనుమానం వస్తుంది. ఇంతలో పిల్లలందరికీ  అన్నం, కూరలు వడ్డిస్తారు. కేదార్‌ కూడా  తాయర్‌ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఆమె వాలకం చూస్తుంటే...ఏదో ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోందని జగధాత్రి అంటుంది. నాపై గెలవడానికి ఎలాంటి పాపానికైనా ఒడిగడుతుందని అంటుంది. అది ఏంటో కనిపెట్టకపోతే...ఇక్కడ ఎలాంటి ప్రమాదమైనా జరగొచ్చని అంటుంది. ఇంతలో కౌషికి ఫోన్ రావడంతో బయటకు వెళ్తుంది. అప్పుడే అక్కడ ఆమెకు ఊహించని పరిణామం ఎదురవుతుంది. శ్రీవల్లి బయట పెట్టిన ప్లేట్‌లో అన్నం తిని ఎలుక చచ్చిపడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురవుతుంది. అన్నంలో పాయిజన్ కలిసి ఉండొచ్చని అనుమానిస్తుంది. పరుగెత్తుకుంటూ లోపలికి వస్తుంది. కానీ అప్పటికే పిల్లలు అన్నం తినేస్తుంటారు. జగధాత్రిని తీసుకెళ్లి  ఎలుక చచ్చిపోయిన విషయాన్ని చూపిస్తుంది కౌషికి. అన్నంలో విషం కలిసి ఉండొచ్చని అంటుంది. దీంతో జగధాత్రికి విషయం అర్థమవుతుంది. మినిష్టర్ ప్రవర్తనకు ఇదే కారణం అయి ఉండొచ్చని ఊహిస్తుంది. అన్నంలో విషం కలిపారని చెబుతుంది. వెంటనే పిల్లలు తినకుండా ఆపాలని కేదార్ అనగా...జగధాత్రి వద్దని వారిస్తుంది. పిల్లల ప్రాణాల మీదకు వస్తుందని కౌషికి అంటుంది.ఇప్పుడు మనం ఏం చేసినా...మినిష్టర్‌ ఇదంతా మనమే చేశామని మనపైకి నెడుతుందని ధాత్రి అంటుంది. ముందు  ఏ పదార్థంలో విషం కలిపారో కనిపెడితే సరిపోతుందని చెబుతుంది. అది తెలుసుకోవడం ఎలా అని అంటే....మినిష్టర్‌తోనే నిజం చెప్పిందమని జగధాత్రి ప్లాన్ చేస్తుంది.                             

                            అందరూ భోజనం చేస్తున్నా...ఎవరికీ ఏం కాకపోవడంతో మినిస్టర్‌ తన అనుచరుడిపైన చిందులు వేస్తుంది. విషం ఎందులో కలిపావురా అని ఆరా తీస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన జగధాత్రి...మీరు మా గెస్ట్ కదా ముందు మీరే తినాలి అంటూ ఆహ్వానిస్తుంది. ఆమె రానురాను అంటున్నా...జగధాత్రి  చేయిపట్టుకుని లాక్కెళ్తుంది. ఆమెను కూర్చోబెట్టి...అన్ని పదార్థాలు వడ్డిస్తుంది. ఇంతలో మినిష్టర్‌ తన అనుచరుడి వైపు చూస్తూ...ఎందులో కలిపావురా అంటూ సైగలు చేస్తుంది. భోజనాల్లో కలపలేదులే నువ్వు ప్రశాంతంగా తిను అంటూ చెబుతాడు. అన్ని ఐటెమ్స్‌ తిన్నా....పాయసం, బజ్జీ మాత్రం ఇంకా వడ్డించకపోవడంతో ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకదానిలో విషం ఉండి ఉండాలని మినిష్టర్ అనుమానిస్తుంది. ఇప్పుడు ఇవి వద్దు అంటే జగధాత్రి  ఒప్పుకోదు...తింటే ప్రాణాలు పోతాయని తాయర్ భయపడుతూ ఉంటుంది.  ఇంతలో కేదార్‌  మిర్చి బజ్జీ వడ్డిస్తుండగా  మినిష్టర్ వద్దని ఆపుతుంది. ఎందుకు వద్దని జగధాత్రి గట్టిగా నిలదీయగా...తింటే నేను చస్తాను కాబట్టి వద్దు అంటుంది. అదేంటి..ఆ బజ్జీలో ఏదో విషం ఉన్నట్లు  అంత మాట అనేశారని  కౌషికి అడుగుతుంది.  ఏం లేదు నాకు ఎసిడిటీ ఉంది. ఇప్పుడు మిర్చి బజ్జి తింటే కడుపులో మంటవస్తుందని అలా అన్నా అని తాయర్ తప్పించుకుంటుంది. అయితే పాయసం అయినా  తినాలని  జగధాత్రి పట్టుబడుతుంది. షుగర్‌ ఉందని తప్పించుకుంటుంది. దీంతో విషం ఎందులో కలిపాడో వాడితోనే చెప్పిద్దామని జగధాత్రి అనడంతో  ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.

Continues below advertisement