Nuvvunte Naa Jathaga Serial Today Episode హరివర్థన్ సత్యమూర్తితో నీ కొడుకు నీకు మంచోడు కావొచ్చు.. కానీ వీడేంటో నాకు తెలుసు.. వీడు నా కూతురి మెడలో తాళి కట్టి బంగారం లాంటి నా కూతురి భవిష్యత్తును నాశనం చేశాడు అని హరివర్థన్ అంటాడు. దానికి దేవా సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా దీనికి నాకు ఏం సంబంధం లేదు.. ఇదే విషయం మీకు నిరూపిస్తాను అని అంటాడు. 

Continues below advertisement

హరివర్థన్ దేవాతో నీ ప్రాణాలు తీయడం నాకు క్షణం పని కానీ అలా చేస్తే నా కూతురు నన్ను ద్వేషించుకుంటుంది. ఈ ఒక్క కారణంతోనే నువ్వు బతికిపోయావ్.. కానీ ప్రతీ సారి వదిలేస్తా అనుకోకు.. ఇన్నాళ్లకు నా కూతురి జీవితానికి ఒక దారి ఏర్పడుతుంది. తన భవిష్యత్‌కి మంచి మార్గం దొరికింది,, దయచేసి తనని వదిలేయ్‌రా తన జీవితంతో ఆడుకోకు నీకు దండం పెట్టి వేడుకుంటున్నా దయచేసి అర్థం చేసుకో అని జడ్జి వెళ్లిపోతారు. మిథున పెళ్లిలో ఏమైనా ఆటంకం ఏర్పడితే నిన్ను నీ కుటుంబం మొత్తం తగలబెట్టేస్తా అని రాహుల్ వెళ్లిపోతాడు.

మిథున పోస్టర్ పట్టుకొని వదిన మాటలు తలచుకుంటూ ఉంటుంది. పోస్టర్ చూసి తనుకు దేవాకి పెళ్లి జరగడం అన్నీ గుర్తు చేసుకుంటుంది. దేవా కూడా మిథునని తలచుకొని బాధ పడుతూ ఉంటాడు. మిథున నన్ను అపార్థం చేసుకొని ఉంటుందా.. ఈలోకంలో నన్ను ఎవరు అపార్థం చేసుకున్నా పర్లేదు కానీ మిథున మాత్రం నన్ను అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేను.. నా కారణంగా మిథున ఇంకా బాధ పడితే అది నన్ను జీవితాంతం వెంటాడే బాధ అవుతుంది. పోస్టర్లు నేను వేయించలేదు అని మిథునకు ఎలా చెప్పాలి అని అనుకుంటాడు. 

Continues below advertisement

మిథునకు ఫోన్ చేస్తాడు. మిథున లిఫ్ట్ చేయగానే మిథున నిన్ను ఒకసారి కలిసి మాట్లాడాలి అని అంటాడు. ఎక్కడ అని మిథున అడుగుతుంది. దేవా లొకేషన్ చెప్తాడు. ఉదయం ఆదిత్య, త్రిపుర మాట్లాడుకుంటారు. మిథున, దేవా పోస్టర్లు రిషి చూస్తాడు.. రిషి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు.. అని  నువ్వు తెలివిగా ఆలోచించి పోస్టర్లు వేశావ్ కానీ మా మామయ్య అంత కంటే తెలివిగా రిషిని ఇళ్లు దాటకుండా చేశాడు అని అంటుంది.  రిషికి దేవా బెస్ట్‌ ఫ్రెండ్ అయినా మిథున లాంటి మంచి అమ్మాయిని రిషి వదులుకోడు.. పైగా మా మామయ్య రిషిని కన్విన్స్ చేస్తాడు. పెళ్లికి టైం దగ్గర పడుతుంది. పెళ్లి ఆగడానికి ఏదో ప్లాన్ చేయ్ అని చెప్తుంది. 

ఆదిత్య మనసులో మిథున నాకు దక్కాలి అంటే పోస్టర్లు చాలు అనుకున్నా కానీ మిథున నాకు దక్కాలి అంటే ఎవరో ఒకరి ప్రాణాలు తీయాలి.. ఎవరి ప్రాణాలు తీస్తే మిథున నాకు దక్కుతుందో వాళ్ల ప్రాణాలే తీస్తా అని అనుకుంటాడు. మరోవైపు దేవా చెప్పిన గుడికి మిథున వస్తుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. గుడిలో భార్యభర్తల గొప్పతనం గురించి ప్రవచనాలు చేస్తారు. అది విని దేవా మిథున అలా ఉండిపోతారు. 

మిథున దేవాతో ఏం మాట్లాడాలని పిలిచావో చెప్పు అంటుంది. దేవా మిథునకు సారీ చెప్తాడు. ఎందుకు అని మిథున అంటే ఆ పోస్టర్లు నేను వేయించలేదు.. అందరిలానే నువ్వు కూడా నన్ను అసహ్యించుకుంటావని అనుకున్నా.. నన్ను ఎవరు అసహ్యించుకున్నా భరించగలను కానీ నువ్వు అసహ్యించుకుంటే తట్టుకోలేను మిథున.. ఆ పోస్టర్లు గురించి నువ్వు ఎంత బాధ పడుతుంటావో నాకు తెలుసు అందుకే అందులో నా ప్రమేయం లేదని చెప్పాలి అనిపించిందని అంటాడు. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకుంటానని నువ్వు ఎందుకు అనుకుంటావ్.. ఇలాంటి సంజాయిషీలు సారీలు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఆరు, ఏడు నెలలు నీతో పాటు ఉన్నా.. ఒకే గదిలో ఉన్నాం.. నువ్వేంటో చూశా.. నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకున్నా.. ఆడపిల్లని బాధ పెట్టేలా నలుగురిలో నవ్వుల పాలు చేసేలా చేయవని నాకు తెలుసు అని మిథున అంటుంది. దేవా థ్యాంక్స్ చెప్తాడు. 

దేవా, మిథున ఇద్దరూ మాట్లాడుతుంటే అక్కడికి రిషి వస్తాడు. ఇద్దరూ రిషిని చూసి షాక్ అయిపోతారు. ఇద్దరితో బాగుంది.. చాలా బాగుంది.. మీ ఇద్దరూ ఇలా సీక్రెట్‌గా మాట్లాడుకోవడం చాలా బాగుంది.. ఇది నేను అస్సలు ఊహించలేదు.. దీన్ని మీరు ఇంత సీక్రెట్‌గా ఉంచుతారు అని అస్సలు ఊహించలేదు.. నా దగ్గర కూడా దాస్తారు అనుకోలేదు అంటాడు. దేవా అది కాదు అంటే నువ్వు మిథునతో ఏం మాట్లాడావో నాకు తెలుసు.. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.