Nindu Manasulu Serial Today Episode గణ వర్షతో మాట్లాడి పంపేస్తాడు. సాహితి గణతో వర్ష వెళ్లిపోయిందా అని అడిగితే వెళ్లిపోయింది.. ఏదో ప్రాబ్లమ్ ఉంటే మాట్లాడి పంపేశా అంటాడు. ఇక గణ సాహితితో ప్రేరణ మీకు రిలేటివా అని అడుగుతాడు. లేదు తను మా అన్నయ్య ఫ్రెండ్‌ అని సాహితి చెప్తుంది. లేదు మీ ఇంట్లో జరిగే ప్రతీ ఫంక్షన్‌లో తను ఉంటుంది కదా.. అందుకే అడిగా అని అంటాడు.

Continues below advertisement

గణ అలా అనగానే అందరూ షాక్ అయిపోతారు. మంజుల కోపంగా చూస్తుంది. బిజినెస్ పార్టనర్‌ అయినప్పటి నుంచి ఫ్యామిలీ పార్టనర్ అయిపోయిందని ప్రేరణ చాలా మంచిది అని అంటాడు. ఇలాంటి ఆవిడకు పెళ్లికి మంచి చీర ఇవ్వాలి అని ఓ చీర సెలక్ట్ చేసి ఇస్తాడు. ప్రేరణ థ్యాంక్స్ చెప్పి మీ రుణం ఉంచుకోను త్వరలోనే తీర్చుకుంటా అని అంటుంది. ప్రేరణ గారు మీరు ఈ చీర కట్టుకొని మా పెళ్లికి కచ్చితంగా రావాలి.. మీరు వస్తారు నాకు తెలుసు అని అంటాడు. బావగారు పెళ్లి పనులు అన్నీ మీరు మీ పార్టనరే చూసుకోవాలి అని అంటాడు. గణ పుల్లలు పెట్టేసి వెళ్లిపోతాడు.

గణ ప్రేరణని ఆపి నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అంటాడు. ఇంతలో మంజుల సిద్ధూని ఆపుతుంది. మంజుల ప్రేరణతో నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా.. అని తిడుతుంది. తనేం చేసింది అని సిద్ధూ అడుగుతాడు. నేను వద్దు అన్న పని చేసింది.. సిద్ధూని  వదిలేయ్ అంటే సరే అని మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నావ్ అని అంటుంది. తను నా ఫ్రెండ్ అమ్మా అని సిద్ధూ అంటాడు. తను ఫ్రెండ్‌లా ఉంటుందా అని మంజు అడుగుతుంది. ఇందాక గణ కూడా అదే అన్నాడు.. అసలు మన దాంట్లో తన జోక్యం ఏంటి.. తన స్థాయి తెలుసుకొని ప్రవర్తిస్తుందా..అని అంటుంది. అమ్మా అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు  గొడవ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. ప్రేరణ దానికి సిద్ధూ ఇందులో ఆంటీ తప్పు లేదు  తప్పు అంతా నాదే నేను రాకుండా ఉండాల్సింది అని అంటుంది. నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు అన్న ఆనందం లేకుండా పోతుంది. వాడు తన చెల్లి పెళ్లి పనులు చేయనివ్వకుండా నీ వెనక తిప్పుకుంటున్నావ్.. రావొద్దు అన్నా వచ్చి నా కొడుకు ముందు నన్ను తప్పు దానిలా చూపిస్తున్నావ్.. మీ అమ్మ పెంపకం అది ఇదీ అంటావ్ ఇది కూడా మీ అమ్మే నేర్పిందా అంటుంది. ఆంటీ అని ప్రేరణ అరుస్తుంది. మా అమ్మని ఏం అనొద్దు అనేసి చీర అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. 

Continues below advertisement

ప్రేరణ విషయంలో ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అని సిద్ధూ అంటాడు. నువ్వేరా నా కంటే నీ చెల్లి కంటే తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావ్.. మా కంటే తనే ఎక్కువ అయిందా.. నీ జీవితంలో తను ఏంట్రా అని అంటుంది. తను నా మంచి కోరే స్నేహితురాలు అని సిద్ధూ అంటాడు. మన ఇంట్లో మొదటి శుభకార్యం ఇది.. తన వల్ల ఏం ప్రాబ్లమ్ వస్తుందో అని అంటుంది. తన వల్ల ఏం ప్రాబ్లమ్ రాదు అని అంటాడు. 

విజయానంద్ మంజుతో సాహితి కోసం నువ్వు తల్లిగా ఎలా ఆలోచిస్తావో సిద్ధూ కూడా అలాగే ఆలోచిస్తాడు.. అందుకే నేను ఎవరినీ తప్పు అనను అంటాడు. దానికి సిద్ధూ నువ్వు ఒక్క మాట చెప్తే విషయం అందరికీ తెలుస్తుంది కదా చెప్పొచ్చు కదా.. చెప్పవు అని అంటాడు. విజయానంద్ మనసులో నేను చెప్తే నా పని అయిపోతుంది అని అనుకుంటాడు. మంజు సిద్ధూతో అన్నీ నువ్వే అయి ఈ పెళ్లి దగ్గరుండి నువ్వే చేయ్ అని అంటుంది. ప్రేరణకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటే దానికి సిద్ధూ తనకి కాదమ్మా తన కంటే ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. నాకు నువ్వు ఎంతో సాహితి కూడా అంతే అందుకే సాహితి భవిష్యత్ కోసం నేను తపన పడుతుంటే సాహితి కోసం నాకు ప్రేరణ సాయం చేస్తుంది అని అంటాడు. 

నిశ్చితార్థం కూడా మీరే ఆపారు కదా.. నేను ఏం చెప్పినా నువ్వు వినవు.. కానీ తను చెప్తే వింటావు అంతే కదా అని అంటుంది. పరాయి వాళ్ల కోసం నీ కన్న తల్లిని కూడా అవమానిస్తావా అని మంజు అంటుంది. తను మాత్రమే నీ మంచి కోరే మనిషి అని చెప్పకు.. తన కంటే మాకే మీ మంచి కోసం తెలుసు.. అందుకే సాహితి, గణలకు పెళ్లి చేస్తా ఇందులో ఏం మార్పు లేదు.. నువ్వు మా కోసం ఆలోచిస్తే నువ్వు ఈ పెళ్లి దగ్గరుండి జరిపించు.. లేదు పెళ్లి ఆపాలి అనుకుంటే ఈ పెళ్లికి దూరంగా ఉండు అని అంటుంది. ఉంటే మా వాడిలా ఉంటూ పెళ్లి జరిపించు.. లేదంటే మాకు సంబంధం లేని పరాయి వాడిలా దూరం నుంచి చూడు అంతే కానీ పెళ్లి ఆపాలి అని చూడకు అని చెప్తుంది. 

సిద్ధూ తల్లి మాటలు తలచుకొని బాధ పడతాడు. తర్వాత ప్రేరణకి కాల్ చేసి సారీ చెప్తాడు. సారీలు ఎందుకు.. మీ అమ్మ వద్దన్నా నేను వచ్చి తప్పు చేశాను.. అందుకు నేనే మీ అమ్మకి సారీ చెప్పాలి అని అంటుంది. ఇదే ప్రేరణ నాకు నీలో నచ్చేది.. ఎదుటి వారి మంచి కోరుకుంటావ్. నా వల్లే నువ్వు అందరి ముందు అవమాన పడుతున్నావ్..  నిన్ను మా అమ్మ అన్ని మాటలు అంటే నా మనసు తట్టుకోలేకపోతుంది.. అంతగా నువ్వు నా జీవితంలో భాగం అయిపోయావ్.. అందుకే నాకు పెళ్లి ఇష్టం లేదు అంటే మీ అమ్మ నన్ను పెళ్లికి దూరంగా ఉండమని చెప్పిందని అంటాడు. మీ అమ్మ నిన్ను నమ్మాలి.. అందుకు నువ్వు పెళ్లి పనుల్లో దగ్గరుండాలి.. గణ కావాలి అనే నిన్ను దూరం చేయాలి అని చూస్తున్నాడు.. అందుకే నువ్వు వాళ్లతోనే ఉండి వాడి తప్పులు చూపించాలి అందుకే ఓపికగా ఉండు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.