Chinni Serial Today Episode దేవా మధుమితతో అతను నీతో ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది. దానికి మధు అతను మీ గురించి అడిగారు అంకుల్.. అని అంటుంది. అయినా మీరు ఏంటి అంకుల్ ఇంత టెన్షన్ పడుతున్నారు అని మధు అడిగితే మినిస్టర్‌ని కదా అమ్మా అపాయింట్ మెంట్ లేకుండా ఎవరినీ కలవను.. అయినా అతను నన్ను ఎందుకు కలవాలి అనుకున్నాడా అని ఆలోచిస్తున్నా అని అంటాడు.
మధుతో నిన్న నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారు కదమ్మా ఎవరో తెలుసా అంటే తెలీదు అని మధు అంటుంది. నేను తెలుసుకుంటా వాడిని మాత్రం వదిలిపెట్టను అని అంటాడు. నేను చూసుకుంటా నాన్న ఇలాంటి కిడ్నాప్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని దేవా చెప్తాడు. దేవా, నాగవల్లి దగ్గరకు వెళ్లి ఆఫ్ టికెట్ వచ్చాడు.. అని చెప్తాడు. కాలేజ్ ఫెస్ట్ మొదలవుతుంది. ర్యాంప్ వాక్ చేస్తారు. జడ్జిలు మార్కులు వేస్తారు.
తర్వాత మధు మ్యాడీల జోడీ వస్తుంది. దేవా నాగవల్లితో నేను ముందే చెప్పాను కదా అంటాడు. ఇక ఇద్దరూ ర్యాంప్ వాక్ చేస్తుంటే మధు డ్రస్ చిరిగి పోతుంది. మధు అక్కడే ఆగిపోతుంది. ఏమైందని మ్యాడీ సైగ చేస్తే డ్రస్ చూపిస్తుంది. దాంతో మ్యాడీ మధుని ఎత్తుకొని వాక్ చేస్తాడు. దేవా, నాగవల్లి, లోహిత, శ్రేయ ఇబ్బందిగా చిరాకుగా ఫీలవుతారు. ఆడియన్స్ మాత్రం చప్పట్లు కొడుతూ గోల గోల చేస్తారు. ఇలా అయింది ఏంటి అని శ్రేయ లోహితను అడిగితే ఇలా అవుతుంది అనుకోలేదు సారీ శ్రేయ అని లోహిత అంటుంది.
నాగవల్లి హర్ట్ అయి వెళ్లిపోతుంది. మధు, మ్యాడీ వాళ్లు చూస్తారు. లోహిత కూడా నాగవల్లి నుంచి నరుక్కురావాలి అని వెనకాలే వెళ్తుంది. నాగవల్లితో ఆంటీ స్టేజ్ మీద ఆ సీన్ నాకే చిరాకుగా ఉంది మీకు ఎలా ఉంటుందో నీకు తెలుసు.. ఇదంతా మధు ప్లాన్.. కావాలనే తన డ్రస్ తను కుట్లు ఇప్పుకొని మ్యాడీ తను ఎత్తుకోవాలి అని ఇలా ప్లాన్ చేసింది. పబ్లిక్‌లో ఇలాంటి ప్లాన్స్ చేసింది అంటే వాళ్లిద్దరూ ఉన్నప్పుడు ఇంకెన్ని చేస్తుందో అని అంటుంది. దానికి నాగవల్లి లోహితతో ఇక దాని ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు అని మధు దగ్గరకు వెళ్తుంది.
ఆఫ్ టికెట్ కాలేజ్ మొత్తం చిన్నీ కోసం తిరుగూ ఉంటాడు. నాగవల్లి మధుతో మొత్తానికి బాగానే ప్లాన్ చేశావ్.. నీ ప్లాన్ నాకు తెలీదు అనుకుంటున్నావా.. మ్యాడీ నిన్ను అలా ఎత్తుకోవడానికి నీ డ్రస్ నువ్వు చింపుకున్నావ్ అని నాకు తెలీదా అని నాగవల్లి అంటుంది. నేను అలా చేయలేదు అని మధు అంటుంది. నువ్వు చిన్ని అని చెప్పుకోలేవు కాబట్టి మధులా దగ్గర అవ్వాలి అనుకుంటున్నావ్.. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఇలా ఎత్తుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి ఇలా ప్లాన్ చేశావ్ అంటుంది. అందం అని ముసుగుతో మా వాడిని బుట్టలో వేయాలి అనుకుంటున్నావ్.. నువ్వే చిన్ని అని తెలిస్తే ఏం అవుతుందో అర్థం చేసుకో అని అంటుంది.
మ్యాడీకి నా మీద ఉన్నది ద్వేషం కాదు కోపం.. ఆ కోపం వెనక కూడా ప్రేమ ఉంది.. రేపో మాపో ఆ ప్రేమ తెలుసుకునేలా చేస్తా అని మధు అంటుంది. వాడు నిన్ను ఎంత ద్వేషిస్తున్నాడో నువ్వే తెలుసుకునేలా నేను చేస్తా అని అది కూడా ఇప్పుడే చేస్తా అని నాగవల్లి అంటుంది. ఆఫ్ టికెట్ మధుని వెతుక్కుంటూ మధు వాళ్లు ఉన్న దగ్గరకు వస్తాడు. నాగవల్లి రావడం చూసి దాక్కుంటాడు. తర్వాత మ్యాడీ అక్కడికి వస్తాడు. మ్యాడీ ఆఫ్ టికెట్‌ని చూసి షాక్ అయిపోతాడు. ఆఫ్ టికెట్ అని పిలుస్తాడు. చిన్ని వాళ్ల గురించి అడుగుతాడు. నాకు తెలీదు అని ఆఫ్ టికెట్ అంటే కాలర్ పట్టుకుంటాడు. చిన్ని చూసి ఏమైందని అడుగుతుంది. ఈయన చిన్ని వాళ్ల నాన్న దగ్గర ఉండేవాడు.. ఇతనితో నిజం చెప్పించు అని అంటాడు. మధు కావాలనే ఆఫ్ టికెట్‌కి చేతులు జోడించి చిన్ని వాళ్ల గురించి చెప్పండి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.