Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కావేరికి విహారి ధైర్యం చెప్తాడు. ఎవరైనా ఇలా చేస్తే చంపేయ్.. అందరూ నీ వెనకే ఉంటారు అని చెప్తాడు. ఇంకోసారి అమ్మిరాజు ఎదురు పడితే తరిగి తరిమి కొట్టు అని చెప్తాడు. ఇంకోసారి వాడు ఎదురు పడితే మీరు ఉన్నారు అని ధైర్యంగా ఎదుర్కొంటా అని కావేరి అంటుంది.
యమున లక్ష్మీని కొట్టినందుకు సారీ చెప్తుంది. ఇంత జరిగినా మాకు చెప్పాలి అనిపించలేదా అని చారుకేశవ అంటే కావేరి కోసం చెప్పలేదు అని లక్ష్మీ అంటుంది. కావేరి పరువు కోసం నువ్వు వెళ్లిపోవాలి అనుకున్నావ్.. తన వల్ల నువ్వు వెళ్లిపోయావ్ అని కావేరి చనిపోవాలి అనుకుందని విహారి చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. మేం లేమా నీకు ఇంకెప్పుడూ ఇలాంటివి చేయకు అని అంటారు. లక్ష్మీని కూడా లోపలికి వెళ్లమని చెప్తారు.
లక్ష్మీ వెళ్తుంటే అంబిక క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. అందరూ అంబికకు నచ్చచెప్పబోతారు. అంబిక ఎవరినీ మాట్లాడొద్దు అని బ్యాగ్ తీసుకొని వస్తుంది. అందరూ వింతగా చూస్తారు. ఏంటి బ్యాగ్ అని అడుగుతారు. నాన్న నువ్వు ఊరిలో అందర్ని నమ్ముతావు కానీ కూతుర్ని నమ్మవు.. ఇంటి వారసుడేమో వేరే వాళ్లకోసం ఇంట్లో వాళ్లని అంటాడు. ఈ ఇంట్లో నాకు విలువ లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండలేను అని అంటుంది. అత్తయ్యా అది కాదు అని విహారి అంటే. వద్దు విహారి నిన్న పని మనిషి కోసం నన్ను నిలదీశావ్ చూడు అప్పుడే సగం చచ్చిపోయా.. నేను మిమల్ని నా వాళ్లు అనుకున్నారు కానీ మీరు నన్ను అనుకోలేదు.. అందుకే నేను ఇంటి నుంచి వెళ్లిపోతాను.. ఆ లక్ష్మీకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వలేదు అని అంటుంది.
అంబికను అందరూ వెళ్లొద్దని అంటారు. దాంతో అంబిక ఆ లక్ష్మీకి మనకు ఏం సంబంధం లేదు.. అది మన ఇంట్లో దర్జాగా ఉంటుంది. మీ అందరికీ సాయంత్రం వరకు టైం ఇస్తున్నా ఆ లక్ష్మీ ఇక్కడి నుంచి వెళ్లకపోతే అప్పుడు నేనే వెళ్లిపోతా అని అంబిక అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. లక్ష్మీ విహారితో ఈ ఇంట్లో అంబిక ఉండటమే న్యాయం నేను నా దారి చూసుకొని వెళ్లిపోతా అని అంటుంది. సాయంత్రం వరకు టైం ఉంది కదా నేను మాట్లాడుతా అని విహారి అంటాడు.
అంబిక దగ్గరకు పద్మాక్షి, సహస్రలు వెళ్తారు. మీరు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు అని అంటుంది. సహస్ర మనసులో దానికి మేం ఎందుకు సపోర్ట్ చేస్తున్నామో చెప్పలేం అని అనుకుంటుంది. మీ ఇద్దరికీ ఈ మధ్య ఏం అయిందో నాకు అర్థం కావడం లేదు దాన్ని చాలా బాగా చూసుకుంటున్నావ్.. ఏమైంది మీకు .. అక్క తనని రెండో కూతురు అనుకుంటున్నావా అని అంబిక అడుగుతుంది. సహస్ర ప్రెగ్నెంట్ కదా అందుకే ఇంట్లో గొడవలు వద్దు అనుకుంటున్నా అని పద్మాక్షి అంటుంది. దానికి అంబిక అయితే అది అయినా ఇంట్లో ఉండాలి లేదంటే నేను అయినా ఉండాలి అని అంటుంది. సరే నీకు నచ్చినట్లు చేయవే అని చెప్పి పద్మాక్షి వెళ్లిపోతుంది.
విహారి ఆలోచిస్తూ ఉంటే చారుకేశవ, వసుధలు వచ్చి లక్ష్మీకి అన్యాయం జరగకూడదు అని అంటారు. దానికి విహారి అంబిక అత్తయ్య ఇంటి నుంచి వెళ్లడానికి నేను ఒప్పుకోను అలా అని లక్ష్మీ చేయి వదిలే ప్రసక్తి లేదని అంటాడు. ఏం జరిగినా లక్ష్మీని వదలను అని అంటాడు. అందరూ ఆలోచనల్లో మునిగిపోతారు. సహస్ర పద్మాక్షితో అత్తయ్య వెళ్లినప్పుడు కళ్లు తిరిగి పడిపోనా అంటుంది. అక్కడుంది అంబిక అది అంత ఈజీగా ఊరుకోదు అని పద్మాక్షి అంటుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.